USలో 'రావు బహదూర్'.. క్రేజ్ మామూలుగా లేదుగా..
అమెరికాలో మంగళవారం నిర్వహించే 5 డాలర్ల ప్రత్యేక టికెట్ ఆఫర్ల నేపథ్యంలో రావు బహదూర్ మూవీకి భారీగా ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారు.
By: M Prashanth | 7 July 2026 11:04 AM ISTకంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారని మరోసారి రావు బహదూర్ మూవీ నిరూపిస్తోంది. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ లీడ్ రోల్ లో దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ఆ సైకలాజికల్ డ్రామా విడుదలైన తొలి మూడు రోజుల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. అమెరికాలో కూడా ఆ సినిమాకు ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా అక్కడి తెలుగు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అమెరికాలో మంగళవారం నిర్వహించే 5 డాలర్ల ప్రత్యేక టికెట్ ఆఫర్ల నేపథ్యంలో రావు బహదూర్ మూవీకి భారీగా ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారు. డల్లాస్, ఆస్టిన్, సియాటిల్, బే ఏరియా, మేరీల్యాండ్, షార్లెట్ తో పాటు పలు నగరాల్లో కొత్త షోలను యూడ్ చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ప్రకటించాయి. ఇప్పటికే ఉన్న షోలకు టికెట్లు వేగంగా అమ్ముడవుతుండటంతో మరిన్ని షోస్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అమెరికాలో రావు బహదూర్ సినిమాపై ఉన్న క్రేజ్ క్లియర్ గా కనిపిస్తోంది.
బాక్సాఫీస్ వద్ద కూడా రావు బహదూర్ సాలిడ్ గా రాణిస్తోంది. భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఆ చిత్రం తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.8 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్టోరీపై నమ్మకంతో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరణ ఇస్తారనే విషయాన్ని ఆ చిత్రం మరోసారి రుజువు చేస్తోందని సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
సత్యదేవ్ యాక్టింగ్ ఆ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. రావు బహదూర్ పాత్రలో ఆయన ఎక్స్ప్రెషన్స్, కన్వర్జేషన్స్, పాత్రలో ఒదిగిపోయిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాత్రకు పూర్తి న్యాయం చేశారనే ప్రశంసలు అందుకుంటున్నారు. దర్శకుడు వెంకటేష్ మహా కూడా తనదైన శైలితో సినిమాను ముందుకు నడిపించిన తీరు సినీ ప్రియులను ఆకర్షిస్తోంది. ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తూనే స్టోరీ ఆసక్తికరంగా మలిచారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు మరో బలంగా నిలిచాయి. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యంతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు కూడా సినిమాను రిచ్ వాల్యూస్ తో రూపొందించాయి. స్క్రీన్ పై కనిపించే ప్రతి ఫ్రేమ్ లో ఆ క్వాలిటీ కనిపిస్తోందని ప్రేక్షకులు అంటున్నారు. హీరోయిన్ దీప థామస్ నటనకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే అని.. కానీ స్క్రీన్ల్ ప్లే ఇంకా బాగుండాల్సిందని సినీ అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా అమెరికాలో ఎక్స్ ట్రా షోలను వేయాల్సిన పరిస్థితి రావడం రావు బహదూర్ మూవీకి పెరుగుతున్న రెస్పాన్స్ కు ఎగ్జాంపుల్ గా కనిపిస్తోంది. తొలి వీకెండ్ లో మంచి వసూళ్లు సాధించిన ఆ సినిమా, వీక్‌డేస్ లో కూడా అదే జోరు కొనసాగిస్తే మరింత సాలిడ్ కలెక్షన్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. మరి ఫుల్ రన్ లో రావు బహదూర్ మూవీ ఎంతటి వసూళ్లు సాధిస్తుందో అంతా వేచి చూడాలి.
