సీనియర్ల తర్వాత ఆ రేంజ్ రెస్పాన్స్ అతడికే!
అందులో ఒకరు రణబీర్ కపూర్ కాగా, మరొకరు రణవీర్ సింగ్ గా చెప్పొచ్చు. రణబీర్ కపూర్ కు `యానిమల్` సినిమాతో పాన్ ఇండియాలో మంచి గుర్తింపు దక్కింది.
By: Srikanth Kontham | 21 March 2026 8:00 PM ISTబాలీవుడ్ లో దశాబ్దాలుగా రాజ్యమేలుతోంది ఖాన్ త్రయం. షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ , హృతిక్ రోషన్ వంటి దిగ్గజాల తర్వాతే ఎవరైనా? ఖాన్ లు, కపూర్ ల నుంచి పోటీని తట్టుకుని నిలబడిన ఏకైక స్టార్ ఎవరంటే? హృతిక్ మాత్రమే. ఆ తర్వాత మరే స్టార్ ఆ జాబితాలో చేరలేదు. ఇప్పటికీ బాలీవుడ్ లో చాలా మంది సక్సెస్ పుల్ హీరోలున్నారు. వారి సినిమాలు వందల కోట్ల వసూళ్లను సాధిస్తాయి. కానీ గుర్తింపు అన్నది కేవలం వసూళ్లతో మాత్రమే సాధ్యం కాదు. అతడి ఛరిష్మా అన్నది అంతే కీలకం. సీనియర్ల తర్వాత ఆ రేంజ్ లో సక్సెస్ అయింది ఇద్దరు స్టార్లు మాత్రమే.
అందులో ఒకరు రణబీర్ కపూర్ కాగా, మరొకరు రణవీర్ సింగ్ గా చెప్పొచ్చు. రణబీర్ కపూర్ కు `యానిమల్` సినిమాతో పాన్ ఇండియాలో మంచి గుర్తింపు దక్కింది. `యానిమల్` విజయం అతడికి కొత్త ఇమేజ్ ను తెచ్చి పెట్టిందన్నది వాస్తవం. తాజగా `ధురందర్ 2` విజయంతో రణవీర్ సింగ్ అంతకు మించి సంచలనం అవుతున్నాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంలోనూ, సినిమా కోసం తనను తాను పూర్తిగా మార్చుకోవడంలో రణవీర్ సింగ్ చూపించిన నిబద్ధత ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు కేవలం గ్లామరస్ స్టార్‌గా కనిపించిన రణవీర్ ఇప్పుడు నటనలో విశ్వరూపం చూపించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటున్నాడు.
పాత్ర కోసం రణవీర్ తీసుకున్న జాగ్రత్తలు, పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక కమర్షి యల్ సినిమా మాత్రమే కాదు. రణవీర్ సింగ్ ఒక నటుడిగా తర్వాతి స్థాయికి వెళ్లడానికి ఇది ఒక మైలురాయిలా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒక్క చిత్రంతోనే ఆయన పాన్-ఇండియా స్టార్‌గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశమంతా రణవీర్ సింగ్ నటన, ఆయన ఎంచుకుంటున్న కథలను కీర్తిస్తోంది. ఒకప్పుడు కేవలం ఎనర్జిటిక్ హీరోగా మాత్రమే పేరున్న ఆయన ఇప్పుడు పాత్ర ఏదైనా తనదైన ముద్ర వేయగల కంప్లీట్ యాక్టర్ గా ఎదిగాడు.
సామాన్యుల నుంచి సినీ విశ్లేషకుల వరకు అందరూ ఆయనలో ఒక పవర్‌హౌస్ పెర్ఫార్మర్‌ను చూస్తున్నారు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి ప్రాజెక్ట్ వెనుక ఒక క్లారిటీ కనిపిస్తుంది. అందుకే ఆయనకు ఇంతటి ఆదరణ దక్కు తోందని అభిమానులు గర్వపడుతున్నారు. ఖాన్ హీరోలు దశాబ్దాల పాటు సంపాదించుకున్న క్రేజ్‌ను, ఈ తరం హీరోలు అతి తక్కువ సమయంలోనే అందుకుంటున్నారు. అందులో రణబీర్ కపూర్ ముందా? రణవీర్ సింగ్ ముందా? అంటే చెప్పలేం. దాదాపు ఇద్దరు సరిసమంగానే కనిపిస్తున్నారు. భవిష్యత్ లో వీరిద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది? అన్నది కాదనలేని నిజం.
