Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో రియ‌ల్ మ‌హానుభావుడు

అయితే రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్ లోనూ అలాంటి లక్షణాలున్న ఓ మహానుభావుడు ఉన్నాడు. ఆయనే బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్.

By:  Srikanth Kontham   |   17 March 2026 10:51 AM IST
ఆ స్టార్ హీరో రియ‌ల్ మ‌హానుభావుడు
X

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన `మహానుభావుడు` సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అందులో హీరోకు అతి శుభ్రత (ఓసీడీ) అనే ఓ అలవాటు ఉంటుంది. పరిసరాలు ఏమాత్రం అపరిశుభ్రంగా ఉన్నా అస్సలు తట్టుకోలేడు. వెండితెరపై ఆ పాత్ర ఎంతో న‌వ్వులు తెప్పిస్తుంది. అయితే రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్ లోనూ అలాంటి లక్షణాలున్న ఓ మహానుభావుడు ఉన్నాడు. ఆయనే బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్.

బయటికి ఎంతో సందడిగా అల్లరిగా కనిపించే రణవీర్ సింగ్ వ్యక్తిగత జీవితంలో మాత్రం అత్యంత క్రమశిక్షణతో కూడిన శుభ్రతను పాటిస్తాడ‌న్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

తాను ఎక్కడికి వెళ్లినా అది సినిమా షూటింగ్ అయినా? విదేశీ పర్యటన అయినా? తన వెంట ఒక హైజీన్ కిట్ తప్పనిసరిగా తీసుకెళ్తాడుట‌. శుభ్రత విషయంలో ఆయన అస్సలు కాంప్రమైజ్ కాడుట‌. రణవీర్ వద్ద ఎప్పుడూ ఉండే వస్తువుల జాబితా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. హ్యాండ్ శానిటైజర్, ఐ డ్రాప్స్, మౌత్ ఫ్రెషనర్, డియోడరెంట్ , పెర్ఫ్యూమ్ వంటివి బ్యాగులో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. గుమ్మం దాటి బ‌య‌ట‌కు వెళ్లాడంటే ఒకవేళ బ్యాగ్ అందుబాటులో లేక‌పోతే వాటన్నింటి జేబులోనే వేసుకుని వెళ్లిపోతాడట‌. అవ‌స‌రం మేర కారులో కూడా ఓ కిట్ ఎ ప్పుడూ సిద్దంగా ఉంచుకుంటాడుట‌.

ఎవరితోనైనా కరచాలనం చేసినా ? బయటి వస్తువులను తాకినా? వెంటనే శానిటైజర్ వాడటం ర‌ణ‌వీర్ కు ఉన్న‌అలవాటు. అలాగే తన కళ్లు ఎప్పుడూ తాజాగా ఉండాలని ఐ డ్రాప్స్, శ్వాస ఫ్రెష్‌గా ఉండాలని మౌత్ ఫ్రెషనర్‌ను నిరంతరం ఉపయోగిస్తుంటారు. శుభ్రతపై ర‌ణ‌వీర్ కు ఉన్న మక్కువ కేవలం తన వరకే మాత్రమే పరిమితం కాదండోయ్. తన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండాలని కోరుకుంటాడు. షూటింగ్ స్పాట్‌లో క్యారవాన్ లేదా సెట్ ఏమాత్రం అస్తవ్యస్తంగా ఉన్నా ఆయన వెంటనే స్పందిస్తారు.

`శుభ్రత ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే పనిపై ఏకాగ్రత కుదురుతుంద‌నేది రణవీర్ సింగ్ నమ్మకం. ఈ అలవాటు వల్ల ఆయనను బాలీవుడ్ లో కొంద‌రు రియల్ లైఫ్ మహానుభావుడు అని పిలుస్తుంటారుట‌.

సాధారణంగా గ్లామర్ ఫీల్డ్‌లో ఉండే వారు తమ బాహ్య సౌందర్యం కోసం రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ రణవీర్ మాత్రం వ్యక్తిగత పరిశుభ్రత కు ఇచ్చే ప్రాధాన్యత చూస్తుంటే? అది ఆయన ఆరోగ్య స్పృహను తెలియజేస్తుంది. కరోనా వంటి మహమ్మారి రాకముందు నుంచే ఆయన ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. అందుకే ఆయన ఎప్పుడూ అంత ఎనర్జిటిక్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తుంటారని ఆయన అభిమానులు అంటుంటారు.

క్రేజీ ఫ్యాషన్ , విభిన్నమైన దుస్తులతో వార్తల్లో నిలిచే రణవీర్ సింగ్ వెనుక ఇలాంటి ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఉన్నాడా? అని తెలుసుకుని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. శర్వానంద్ సినిమాటిక్ స్టైల్‌లో కాకపోయినా? ఒక బాధ్యతాయుతమైన సెలబ్రిటీగా తన ఆరోగ్యం , శుభ్రత పట్ల ర‌ణ‌వీర్ చూపే శ్రద్ధ నిజంగా అభినందనీయం. అందుకే ఆయన కేవలం గ్రేట్ యాక్టర్ మాత్రమే కాదు. ఒక రియల్ మహానుభావుడుగానూ వెలిగిపోతున్నాడు.