క్రేజీ కాంబో షూటింగ్ పూర్తి.. త్వరలోనే అనౌన్స్‌మెంట్
కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్, వాటికి ఉండే హైప్ వేరు. అయితే కొన్ని ఊహించని కాంబినేషన్లు కూడా చిత్ర పరిశ్రమలో ఆసక్తిని పెంచుతాయి
By: Sravani Lakshmi Srungarapu | 12 Oct 2025 4:00 AM ISTకొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్, వాటికి ఉండే హైప్ వేరు. అయితే కొన్ని ఊహించని కాంబినేషన్లు కూడా చిత్ర పరిశ్రమలో ఆసక్తిని పెంచుతాయి. ఇప్పుడలాంటి కాంబినేషనే బాలీవుడ్ లో ఒకటి తెరకెక్కుతుంది. అదే రణ్‌వీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్ కలిసి చేస్తున్న సినిమా. వీరంతా కలిసి సినిమా చేయడంతో దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడొస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న రణ్‌వీర్, శ్రీలీల మూవీ
రణ్‌వీర్, శ్రీలీల కలిసి సినిమా చేస్తున్నారని వార్తలొచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి లీకైన కొన్ని లుక్స్ మరియు సెట్ లో కొన్ని స్పష్టమైన ఫోటోలు ఆ ఆసక్తిని ఇంకాస్త పెంచగా, ఆ సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. రణ్‌వీర్, శ్రీలీల, బాబీ డియోల్ నటిస్తున్న ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైందని తెలుస్తోంది.
వర్కవుట్ అయిన లీడ్ రోల్స్ కెమిస్ట్రీ
సినిమాలో రణ్‌వీర్ మరియు శ్రీలీల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవడంతో పాటూ సినిమాలో వారి పెయిర్ చాలా ఫ్రెష్ గా, ఎనర్జిటిక్ గా ఉందని, వారిద్దరి యాక్టింగ్ ఆడియన్స్ ను కచ్ఛితంగా ఆశ్చర్యపరుస్తుందని, వారంలోపే ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అనౌన్స్‌మెంట్ రానుందని అంటున్నారు. అయితే ఈ మూవీ టైటిల్ ఏంటనేది ఇంకా వెల్లడి కాలేదు.
డిసెంబర్ 5న ధురంధర్ రిలీజ్
ఈ ఇయర్ లో రానున్న మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్టుగా ఈ మూవీని నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా, సినిమాలో రణ్‌వీర్ స్క్రీన్ ప్రెజెన్స్, శ్రీలీల గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయని సన్నిహిత వర్గాలంటున్నాయి. రణ్‌వీర్ సింగ్ ఓ వైపు ఈ ప్రాజెక్టు చేస్తూనే మరోవైపు ధురంధర్ అనే సినిమాను కూడా చేస్తున్నారు. రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ధురంధర్ డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
