Begin typing your search above and press return to search.

వ‌ర్కింగ్ అవ‌ర్స్ విష‌యంలో దీపికాకు వ్య‌తిరేకంగా ర‌ణ్‌వీర్

అయితే ఈ విష‌యంలో కొంద‌రు దీపికాను స‌మ‌ర్ధిస్తే మ‌రికొంద‌రు మాత్రం ఆమె అభిప్రాయాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ నెగిటివ్ గా ట్రోల్ కూడా చేశారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Dec 2025 3:00 AM IST
వ‌ర్కింగ్ అవ‌ర్స్ విష‌యంలో దీపికాకు వ్య‌తిరేకంగా ర‌ణ్‌వీర్
X

ఈ మ‌ధ్య సినీ ఇండ‌స్ట్రీలో వ‌ర్కింగ్ అవ‌ర్స్ అనేది చాలా పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొణె రోజుకు క‌చ్ఛితంగా 8 గంట‌లు మాత్ర‌మే వ‌ర్క్ చేస్తాన‌ని, దానికంటే ఎక్కువ వ‌ర్క్ చేయ‌డం త‌న‌కు కుద‌ర‌ద‌ని స్టేట్‌మెంట్ ఇవ్వ‌డంతో ఇది ఇండ‌స్ట్రీలో చాలా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ వ‌ర్కింగ్ అవ‌ర్స్ కార‌ణంగానే దీపికా రెండు పెద్ద పాన్ ఇండియా సినిమాల‌ను చేజార్చుకున్నారు.

వ‌ర్కింగ్ అవ‌ర్స్ కార‌ణంగా రెండు సినిమాల‌ను కోల్పోయిన దీపికా

అందులో ఒక‌టి ప్ర‌భాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న స్పిరిట్ కాగా, రెండోది నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న క‌ల్కి2. ఈ రెండు సినిమాల‌కు వ‌ర్కింగ్ అవ‌ర్స్ విష‌యంతో పాటూ దీపికా మ‌రికొన్ని స్పెష‌ల్ డిమాండ్స్ చేసి, త‌న డిమాండ్ల‌ను తీర్చాల‌ని కోర‌డంతో మేక‌ర్స్ ఆమెకు స‌ర్దిచెప్పాల‌ని ఎంతో ప్ర‌య‌త్నించి ఆమె ఎంత‌కీ విన‌క‌పోవ‌డంతో చేసేదేమీ లేక‌ ఆ రెండు సినిమాల నుంచి మేక‌ర్స్ ఆమెను త‌ప్పించార‌ని టాక్ వినిపించింది.

అన్నీసార్లు 8 గంట‌ల‌కే క‌ట్టుబ‌డ‌లేం

అయితే ఈ విష‌యంలో కొంద‌రు దీపికాను స‌మ‌ర్ధిస్తే మ‌రికొంద‌రు మాత్రం ఆమె అభిప్రాయాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ నెగిటివ్ గా ట్రోల్ కూడా చేశారు. అయితే ఈ విష‌యంలో స్వ‌యంగా దీపికా భ‌ర్త ర‌ణ్‌వీర్ సింగ్ కూడా దీపిక నిర్ణ‌యానికి వ్యతిరేకంగా నిల‌వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 8 అవ‌ర్స్ వ‌ర్క్ విధానానికి క‌చ్ఛితంగా క‌ట్టుబడి ఉండాలంటే అది క‌ష్ట‌మేన‌ని ర‌ణ్‌వీర్ చెప్పారు.

అయితే ర‌ణ్‌వీర్ ఈ కామెంట్స్ చేసింది ఇప్పుడు కాదు. ఎప్పుడో గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ర‌ణ్‌వీర్ ఈ కామెంట్స్ చేయ‌గా, ఇప్పుడా వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఎంతోమంది వ‌ర్కింగ్ అవ‌ర్స్ విష‌యంలో కంప్లైంట్స్ చేస్తుంటార‌ని, 8 గంట‌ల షిఫ్ట్ అని చెప్పి 10-12 గంట‌లు వ‌ర్క్ చేయించుకుంటున్నార‌ని అంటుంటార‌ని, కానీ మ‌నం అనుకున్న వ‌ర్క్ 8 గంట‌ల్లో పూర్తవ‌న‌ప్పుడు కాస్త ఎక్కువ టైమ్ వ‌ర్క్ చేయాల్సి ఉంటుంద‌ని, అన్నీ సార్లూ 8 గంట‌లే అంటే అయ్యే ప‌ని కాద‌ని ర‌ణ్‌వీర్ ఆ ఇంట‌ర్వ్యూలో కామెంట్స్ చేశారు.