1000 కోట్ల క్లబ్ హీరో తాజా చిత్రమిదే!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ఇటీవలే `ధురంధర్` విజయంతో 1000 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు.
By: Srikanth Kontham | 30 Dec 2025 5:00 AM ISTబాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ఇటీవలే `ధురంధర్` విజయంతో 1000 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు. ఈ సక్సెస్ తో అతడి స్టార్ డమ్ రెట్టింపు అయింది. మరి పెరిగిన ఇమేజ్ తో రణవీర్ సింగ్ ఎంత పారితోషికం పెంచాడు? అన్నది అతి త్వరలోనే బయటకు వస్తుంది. అయితే `ధురంధర్` తర్వాత రణవీర్ సింగ్ చేయబోయే చిత్రమేదని? నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 1000 కోట్ల స్టార్ అయిన తర్వాత రణవీర్ నిర్ణయాలు ఎలా ఉంటాయి? అన్న దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎలాంటి కంటెంట్ ని ఎంచుకుంటాడు? దర్శకుడు ఎవరవుతారు? ఇలా కొంత చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా రణవీర్ ప్రాజెక్ట్ లాక్ అవ్వడం ఇంట్రెస్టింగ్. `ప్రలే` అనే చిత్రం లాక్ అయింది. దీనికి జై మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక పోస్ట్ అపోకలిప్టిక్ జాంబీ థ్రిల్లర్. ఇందులో రణవీర్ సింగ్ పాత్ర మనుగడ కోసం పోరాటం చేసే వ్యక్తిగా కనిపించనున్నాడు. ఈ కాన్సెప్ట్ ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ జానర్ లో ఇంత వరకూ భారతీయ చిత్రాలేవి రాలేదు. మహష్ `వారణాసి` కాస్త ఈ జానర్ లో కనిపించే అవకాశం ఉంది. ఇదొక సాహసకుడి పాత్రకు సంబంధించిన కాన్సెప్ట్ కావడంతో రణవీర్ సింగ్ సినిమాకు కొంచెం రిలేటడ్ గా ఉండొచ్చు.
ఈ జానర్లో హాలీవుడ్లో మాత్రం చాలా సినిమాలు వచ్చాయి. వాటి స్పూర్తితో బాలీవుడ్ కూడా ఓ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో రణవీర్ సింగ్ కి జోడీగా అలియాభట్ ను దించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలియా భట్ పాత్ర ఓ ప్రేమికురాలిగా కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వాటన్నింటిని పూర్తి చేసి వచ్చే ఏడాది ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలు పట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అలియా భట్ ఎంట్రీ గనుక ఖరారైతే? రణవీర్ సింగ్ తో నటించడం మూడవ సారి అవుతుంది. ఇప్పటికే `గల్లీబోయ్`, రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ` చిత్రాల్లో నటించింది.
ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో తాజా సినిమాతో జత కట్టి హిట్ కొడితే హ్యాట్రిక్ నమోదవుతుంది. ప్రస్తుతం రణవీర్ సింగ్ `ధురుం ధర్` విజయాన్ని ఆస్వాదించే పనిలో ఉన్నాడు. ఆ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్స్ లో భాగమవుతున్నాడు. మునుపటిలా కాకుండా ఇప్పుడు బాలీవుడ్ కూడా పెద్ద ఎత్తున సక్సెస్ ఈవెంట్లు నిర్వహించడం విశేషం. ఈ విషయంలో మాత్రం బాలీవుడ్ టాలీవుడ్ ని చూసి కాపీ కొట్టిందన్నది వాస్తవం.
