Begin typing your search above and press return to search.

పాలిటిక్స్ పై రణవీర్ ఒపీనియన్ ఏంటి? అసలేం జరుగుతోంది?

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇటీవల చర్యలు సినీ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి.

By:  M Prashanth   |   12 April 2026 10:00 AM IST
పాలిటిక్స్ పై రణవీర్ ఒపీనియన్ ఏంటి? అసలేం జరుగుతోంది?
X

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఇటీవల చర్యలు సినీ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్న ఆయనకు సంబంధించిన కొన్ని పబ్లిక్ అపియరెన్సులు కొత్త ఊహాగానాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల విడుదలైన ధురంధర్ సిరీస్ చిత్రాలతో రణవీర్ సింగ్ బ్లాక్‌ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఆ సినిమాలు కమర్షియల్‌ గా మంచి ఫలితాలను సాధించడంతో పాటు ఆయన నటనకు కూడా ప్రశంసలు దక్కాయి. అయితే అదే సమయంలో ఆ చిత్రాలపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి ధురంధర్ సినిమాలు ప్రొపగాండా తరహాలో ఉన్నాయని, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకు అనుకూలంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపించాయి. ఆ విమర్శల మధ్య రణవీర్ చేసిన తాజా చర్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి.

ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలకు రణవీర్ సింగ్ హాజరయ్యారు. ఆ కార్యక్రమం తర్వాత ఆయన మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ కు వెళ్లడం గమనార్హం. అక్కడ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్- ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బాలిరామ్ హెడ్గేవార్ కు నివాళులర్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అదే సమయంలో ఆయన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో సమావేశం కావడం రాజకీయ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. ఒక బాలీవుడ్ స్టార్ ఆ స్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వాన్ని కలవడం సాధారణంగా కనిపించకపోవడంతో, ఆ భేటీ వెనుక ఉద్దేశ్యంపై విభిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ పరిణామాల నేపథ్యంలో రణవీర్ సింగ్ రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

కొందరు అభిమానులు ఇది కేవలం వ్యక్తిగత సందర్శన మాత్రమేనని, ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెబుతున్నారు. మరికొందరు ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీకి సంకేతాలు కావచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే రణవీర్ సింగ్ నుంచి మాత్రం ఆ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఆయన తన అప్ కమింగ్ ప్రాజెక్టులపైనే దృష్టి సారిస్తున్నారని అభిమానులు అంటున్నారు.

సినిమాల సెలక్షన్, షూటింగ్లతో బిజీగా ఉన్న ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పటికైతే లేదని సమాచారం. మొత్తంగా చూస్తే, వరుస హిట్స్‌ తో ఫుల్ ఫామ్‌ లో ఉన్న రణవీర్ సింగ్ పబ్లిక్ అపియరెన్సులు మాత్రం కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. రాజకీయ రంగంలోకి అడుగుపెడతారా లేదా అనేది స్పష్టత రాకపోయినా.. ఆయన చర్యలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి.