ఒకే ప్రేమ్ లో రణవీర్..రణబీర్..దీపిక..అలియా!
రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, దీపికా పదుకొణె, అలియా భట్ ఒకే సినిమాలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. గతంలో ఈ జంటలు విడివిడిగా పలు హిట్ చిత్రాలతో ఆకట్టుకున్నారు. కరణ్ జోహార్, జోయా అక్తర్, సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకులు ఈ కాంబినేషన్‌ను తెరపైకి తీసుకురావాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే నలుగురి డేట్లు, భారీ బడ్జెట్ సర్దుబాటు సవాలుగా మారనున్నాయి.
By: Srikanth Kontham | 12 Nov 2026 11:20 AM ISTకొన్ని కాంబినేషన్లు వినడానికి ఎంతో క్రేజీగా.. చూడటానికి మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమను ఏలుతోన్న నలుగురు అగ్ర తారలు రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, దీపికా పదుకొణె, అలియా భట్ ఒకే సినిమాలో కలిసి నటిస్తే? ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఆ కలయికే అభిమానులకు గొప్ప అనుభూతిగా మారిపోతుంది. ఇటీవలి కాలంలో ఈ నలుగురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించాలని అభిమానులు.. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బలంగా కోరుకుంటున్నారు. ఒకే తెరపై నలుగురు సూపర్ స్టార్లను చూడాలనే డిమాండ్ బాలీవుడ్ లో అంతకంతకు బలపడుతుంది.
ఈ నలుగురి మధ్య ఉన్న వృత్తిపరమైన .. వ్యక్తిగత సమీకరణాలే ఈ క్రేజ్‌కు ప్రధాన కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో `యె జవానీ హై దీవానీ`, `తమాషా` చిత్రాలలో రణబీర్-దీపిక కెమిస్ట్రీ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేసిందో తెలిసిందే. `బాజీరావ్ మస్తానీ`, `పద్మావత్` లాంటి చిత్రాలలో రణవీర్-దీపికల జోడీ సైతం అంతే ఫేమస్ అయింది. `గల్లీ బాయ్`, `రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ` సినిమాలతో రణవీర్-అలియా జంట బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకుంది. నిజ జీవిత దంపతులైన రణబీర్-అలియా సైతం `బ్రహ్మాస్త్ర`తో ప్రేక్షకులను అలరించారు.
ఇలా విడివిడిగా అద్భుతాలు చేసిన ఈ జంటలన్నీ ఒకే చోట చేరితే ఆ సినిమా రేంజ్ లో ఉంటుందో ఊహకే కష్టం. ఆఫ్-స్క్రీన్‌లోనూ వీరందరి మధ్య ఉన్న స్నేహం, ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. పలు ఈవెంట్లు.. వెకేషన్లలో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయినప్పుడల్లా ఈ నలుగురితో పక్కా కమర్షియల్ .. ఎమోషనల్ డ్రామా తీయండి అంటూ దర్శకనిర్మాతలకు అభిమానులు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.
ముఖ్యంగా కరణ్ జోహార్.. జోయా అక్తర్ .. సంజయ్ లీలా భన్సాలీ వంటి అగ్ర దర్శకులు మాత్రమే ఈ నలుగురు స్టార్ల ఇమేజ్‌కు తగ్గ కథను హ్యాండిల్ చేయగలరని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం అంత ఈజీ కాదు. నలుగురు పాన్-ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న స్టార్లు కావడంతో వారని కాల్షీట్లు సర్దుబాటు చేయడం.. భారీ రెమ్యునరేషన్ల బడ్జెట్‌ను భరించడం నిర్మాతలకు సవాలుగా మారుతుంది.
అన్నింటిని మించి నలుగురు అగ్ర నటుల పాత్రలకు సమానమైన ప్రాధాన్యత, బలమైన స్క్రీన్ స్పేస్ ఉండేలా కథను సిద్ధం చేయడం ఏ దర్శకుడికైనా కత్తిమీద సాము లాంటిదే. కానీ ఈ కాంబినేషన్ కలిసి పనిచేయాల్సిన అవసరం..సమయం అయితే వచ్చేసింది. సినిమా మార్కెట్ విస్తరిస్తున్న తరుణంలో అసాధ్యం అనుకున్న ఎన్నో మల్టీస్టారర్ కాంబినేషన్లు నేడు నిజమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్‌గా మారిన రణవీర్, రణబీర్, దీపిక, అలియాల కలయిక ఎప్పటికైనా తెరపై సాకారమవుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ నలుగురిని ఒకే ఫ్రేమ్‌లో బంధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించే ఆ లక్కీ డైరెక్టర్ ఎవరవుతారో? వేచి చూడాలి.
