3000 కోట్ల హీరో తదపరి ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్!
రణ్‌వీర్ సింగ్ ధురంధర్ చిత్రంలో హంజా పాత్రలో కనిపించినట్లే పొడవాటి జుట్టుతో రగ్గడ్ లుక్‌లో ఇందులోనూ ఆకట్టుకుంటున్నారు.
By: Srikanth Kontham | 7 Sept 2026 2:19 PM ISTబాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ `ధురంధర్` హిట్ తర్వాత తదుపరి క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ జాంబీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి `ప్రళయ్` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో సౌత్ నటి కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి లీకైన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో రణ్‌వీర్ సింగ్ ఓ చిన్నారిని తన వీపు మీద మోస్తూ కనిపిస్తున్నారు. ఆయన పక్కనే కల్యాణి ప్రియదర్శన్ నడుస్తూ కనిపిస్తుంది. కల్యాణి బ్రౌన్ కలర్ ట్యాంక్ టాప్, గ్రీన్ ట్రౌజర్ ధరించి డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చింది.
రణ్‌వీర్ సింగ్ ధురంధర్ చిత్రంలో హంజా పాత్రలో కనిపించినట్లే పొడవాటి జుట్టుతో రగ్గడ్ లుక్‌లో ఇందులోనూ ఆకట్టుకుంటున్నారు. నేలపై జాంబీలు పడి ఉండగా.. రణ్‌వీర్ మాస్ యాక్షన్ పోజ్‌లో ఉన్న మరో ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ లీక్డ్ క్లిప్ చూసిన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర కామెంట్లతో సందడి చేస్తున్నారు. రణ్‌వీర్ లుక్ అత్యంత ప్రతిభావంతంగా ఉందంటూ కొందరు కొనియాడగా, ప్రముఖ పాపులర్ గేమింగ్ అండ్ వెబ్ సిరీస్ `ది లాస్ట్ ఆఫ్ అస్` లేదా `ది వాకింగ్ డెడ్` వైబ్స్ వస్తున్నాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
`ధురంధర్`లోని హంజా పాత్ర లాంగ్ హెయిర్ స్టైల్ కొనసాగించినా? ప్రళయ్‌లో రణ్‌వీర్ బాడీ లాంగ్వేజ్ దానికి పూర్తి భిన్నంగా ఉందంటూ ఆయన నటనా ప్రావీణ్యాన్ని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. `ప్రళయ్` చిత్రంపై అంచనాలు అప్పుడే ఆకాశాన్నంటుతున్నాయి. మునుపటి చిత్రం `ధురంధర్: ది రివేంజ్` దేశీయంగా 1000 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి రికార్డును నెలకొల్పిన తొలి బాలీవుడ్ చిత్రంగా చరిత్ర సృష్టించింది. అంతటి అద్భుత విజయం తర్వాత వస్తున్న సినిమా కావడంతో `ప్రళయ్` ఎలా ఉండబోతోందా అనే అంచనాలు అభిమానుల్లో అంతకంతకు బలపడుతున్నాయి.
భారీ తారగణంతో వందల కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రాన్ని హన్సల్ మెహతాకు చెందిన ట్రూ స్టోరీ ఫిల్మ్స్, రణ్‌వీర్ సింగ్ సొంత బ్యానర్ మా కసమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హిందీ పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా ప్రళయ్ తెరకెక్కుతోంది. అయితే ఇది హోసే సారామాగో రాసిన `బ్లైండ్‌నెస్` నవల ఆధారంగా తెరకెక్కుతోందని గతంలో ప్రచారం జరిగినా? హన్సల్ మెహతా ఖండించారు. జై మెహతా, విశాల్ కపూర్ కలిసి రాసిన ఒరిజినల్ కథతోనే సినిమా తెరకెక్కుతుందన్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న జాంబీ థ్రిల్లర్ `ప్రళయ్` విడుదల తేదీని చిత్రబృందం అధి కారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏదేమైనా? సెట్స్ నుంచి లీకైన చిన్న వీడియోనే సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయడంలో సఫలమైంది. మును ముందు రాబోయే అధికారిక ప్రచార చిత్రాలు ఇంకే రేంజ్ లో ఊపు తెస్తాయో చూడాలి.
