Begin typing your search above and press return to search.

న‌టుడిగా అంతకుమించి ఏం కావాలి?

తన 47 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన ఆయన, ఈసారి జమీల్ జమాల్ పాత్రతో ప్రేక్షకులను గట్టిగా ఆకట్టుకున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 March 2026 5:00 PM IST
న‌టుడిగా అంతకుమించి ఏం కావాలి?
X

స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన దురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తుండగా, ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు రాకేష్ బేడీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన 47 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన ఆయన, ఈసారి జమీల్ జమాల్ పాత్రతో ప్రేక్షకులను గట్టిగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సినిమాలో ఆయ‌న పాత్ర తాలూకా వచ్చే ట్విస్ట్ కు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

రాకేష్ బేడీకి ర‌ణ్‌వీర్ ప్ర‌శంస‌లు

రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాకేష్ బేడీ, షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తైన రోజు సెట్స్‌పై అందరూ కలిసి ఉండగా, హీరో రణ్‌వీర్ సింగ్ మైక్ తీసుకుని మాట్లాడిన మాటలు తనకు జీవితాంతం గుర్తుండిపోతాయని తెలిపారు. ఈ మూవీ రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే, అందులో రూ.500 కోట్లు రాకేష్ బేడీ వల్లే వస్తాయ‌ని రణ్‌వీర్ అన్నారని, ఒక నటుడిగా అంతకంటే గొప్ప ప్రశంస తనకు అవసరం లేదని గర్వంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, రాకేష్ బేడీ నటనపై మరింత చర్చకు దారి తీస్తున్నాయి.

క‌మెడియ‌న్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన రాకేష్ బేడీ

కామెడీ పాత్రలతో కెరీర్ ప్రారంభించిన రాకేష్ బేడీ, కాలక్రమేణా సీరియస్, క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లి తన నటనలో విభిన్నతను చూపించారు. బాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాలకుపైగా కొనసాగుతున్న ఆయన ప్రయాణం, కొత్త తరానికి ఒక ప్రేరణగా నిలుస్తోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆయన ఎంచుకుంటున్న పాత్రలు కథలో కీలక మలుపులు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, దురంధర్ విజయాన్ని కొనసాగిస్తూ వచ్చిన ఈ సీక్వెల్, దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను మరోసారి ప్రతిబింబించింది. దేశభక్తి అంశాలతో కూడిన కథలో రాకేష్ బేడీ వంటి అనుభవజ్ఞులైన నటులను సరైన రీతిలో ఉపయోగించడం సినిమాకు మరింత బ‌లాన్ని చేకూర్చింది.

మొత్తంగా చూస్తే, రాకేష్ బేడీ కెరీర్‌లో ఇది మరో గుర్తుండిపోయే మైలురాయిగా నిలుస్తోంది. ఒకవైపు రణ్‌వీర్ సింగ్ వంటి స్టార్ హీరో నుంచి వచ్చిన ప్రశంసలు, మరోవైపు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్.. ఇవ‌న్నీ కలిపి ఆయన నటనకు న్యాయం చేస్తున్నాయి. దశాబ్దాల అనుభవం ఉన్న నటుడు ఇప్పటికీ తన ప్రతిభతో కొత్త తరం ప్రేక్షకులను మెప్పించడం నిజంగా విశేషమే.