Begin typing your search above and press return to search.

ఆవిడ రెండే పోగొట్టుకుంటే పాపం ర‌ణవీర్ డ‌బుల్

కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఎంచుకుంటున్న సినిమాలు లేదా చర్చల దశలో ఉన్న ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోవడం మార్కెట్ వాల్యూపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

By:  Sivaji Kontham   |   21 Feb 2026 6:00 AM IST
ఆవిడ రెండే పోగొట్టుకుంటే పాపం ర‌ణవీర్ డ‌బుల్
X

దీపికా పదుకొనే గర్భవతిగా ఉన్న సమయంలో లేదా ప‌సి పిల్లాడి పోషించాల్సిన స్థితిలో ఉన్న‌ప్పుడు కొన్ని ప్రాజెక్టులకు దూరమవ్వడం సహజమే కానీ, రణవీర్ సింగ్ వరుసగా భారీ ప్రాజెక్టులను కోల్పోవడం ఆయన అభిమానులను కలవరపెడుతోంది.

రణవీర్ కెరీర్ గ్రాఫ్‌లో అత్యంత కీల‌క‌మైన‌ నాలుగు ప్రాజెక్టులు కోల్పోయాడు. శంక‌ర్ తో అప‌రిచితుడు ఆగిపోయింది.. ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో ప్రాజెక్ట్ `బ్ర‌హ్మ‌రాక్షస్` అనుకుని ఆపేసారు. శ‌క్తిమాన్ క‌థ‌తో సినిమా తీయాల‌ని పాకులాడినా రైట్స్ ద‌క్క‌లేదు. ఇప్పుడు ఫ‌ర్హాన్ తో `డాన్ 3` కూడా వివాదంలో ఉంది.

`అపరిచితుడు` రీమేక్ నిర్మాణ సంస్థల మధ్య వివాదాలు, ద‌ర్శ‌కుడు శంకర్ వేరే ప్రాజెక్టులతో బిజీ అవ్వడంతో ఆగిపోయింది. ప్రశాంత్ వర్మ - బ్రహ్మరాక్షస షూటింగ్ మొదలైనట్లే అయ్యి, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల రణవీర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రావాల్సిన డాన్ 3 సినిమాపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది రణవీర్‌కు దక్కాల్సిన అతిపెద్ద బూస్ట్. కానీ ద‌క్కేట్టు లేదు. శ‌క్తిమాన్ హక్కుల సమస్య, బడ్జెట్ కారణాల వల్ల ప‌ట్టాలెక్క‌లేదు.

అయితే రణవీర్ సింగ్ అద్భుతమైన నటుడు అనడంలో సందేహం లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఎంచుకుంటున్న సినిమాలు లేదా చర్చల దశలో ఉన్న ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోవడం మార్కెట్ వాల్యూపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే అత‌డి త‌దుప‌రి స్టెప్ కూడా ఆశించినట్టుగా లేదు. ప్రళయ్ వంటి జాంబీ సినిమాలు ప్రయోగాత్మకంగా బాగున్నా, మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి. మరోవైపు దీపికా రెండు పాన్ ఇండియా సినిమాల నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ప్ర‌భాస్ స‌ర‌స‌న చేయాల్సిన‌ స్పిరిట్, క‌ల్కి 2898ఏడి.. ఈ రెండు అవ‌కాశాలు కోల్పోవ‌డానికి కార‌ణం గొంతెమ్మ కోర్కెలేన‌ని క‌థ‌నాలొచ్చాయి. ఓవైపు ర‌ణ్ వీర్ వ‌రుస ప్రాజెక్టుల‌ను కోల్పోతుంటే, అదే స‌మ‌యంలో దీపిక రెండు భారీ పాన్ ఇండియా చిత్రాల ను కోల్పోవాల్సి వ‌చ్చింది. ఇది నిజంగా ఆ జంట‌కు ఊహించ‌ని జోల్ట్.

ర‌ణ్ వీర్ సింగ్ చేతి నుంచి చాలా సినిమాలు మాయ‌మయ్యాయి. ప్ర‌స్తుతం అతడు `దురంధ‌ర్ 2` త‌ర్వాత జాంబీల నేప‌థ్యంలోని ప్ర‌ళ‌య్ పై దృష్టి సారిస్తాడు..జాంబీల నేప‌థ్యం అంటే అది పూర్తిగా ప్ర‌యోగాత్మ‌క‌మైన‌ది. భార‌తీయ ఆడియెన్ కి ఏమేర‌కు క‌నెక్ట‌వుతుందో చెప్ప‌లేం. కానీ డాన్ 3 లాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టును పోగొట్టుకోవ‌డం ర‌ణ్ వీర్ కి పెద్ద మైన‌స్ అని అభిమానులు భావిస్తున్నారు...