Begin typing your search above and press return to search.

హెయిర్ స్టైలిస్ట్ కోసం స్టార్ హీరో ప్రత్యేక లేఖ!

రణవీర్ సింగ్ రాసిన ఈ లేఖను దర్శన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. `ఒక నటుడు తన వెనుక ఉండి పనిచేసే టీమ్‌ను ఇంతలా గౌరవించడం చాలా అరుదు.

By:  Srikanth Kontham   |   26 March 2026 8:15 AM IST
హెయిర్ స్టైలిస్ట్ కోసం స్టార్ హీరో ప్రత్యేక లేఖ!
X

బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటనతోనే కాదు ఉదార స్వభావంతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ర‌ణ‌వీర్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ `ధురందర్2` చిత్రానికి పనిచేసిన హెయిర్ స్టైలిస్ట్ దర్శన్ యేవలేకర్ కోసం ఓ ప్రత్యేకంగా త‌న స్వ‌హ‌స్తాల‌తో ఓ లేఖ రాసారు. ఒక స్టార్ హీరో తన టీమ్ సభ్యుడి కష్టాన్ని గుర్తించి ఇలా స్వయంగా అభినందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖలో రణవీర్ సింగ్ తన కృతజ్ఞతను ఎంతో ఎమోషనల్‌గా చాటుకున్నారు. `దర్శన్.. నీ ప్రతిభ మరియు అంకితభావం ఈ సినిమాలో నా పాత్రకు ప్రాణం పోశాయి.

ప్రతి రోజూ షూటింగ్ సెట్‌లో నన్ను అద్దంలో చూసుకున్నప్పుడు ఆ పాత్రలా అనిపించేలా చేశావు. నీతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఒక అద్భుతమైన అనుభవం. థాంక్యూ మై బ్రదర్` అంటూ రణవీర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ దర్శన్ పట్ల రణవీర్‌కు ఉన్న గౌరవాన్ని చాటి చెబుతోంది. దర్శన్ యేవలేకర్ గత పదేళ్లుగా రణవీర్ సింగ్‌తో కలిసి ప్రయాణిస్తున్నారు. రణవీర్ కెరీర్‌లోని ఐకానిక్ చిత్రాలైన `రామ్ లీలా, `బాజీరావ్ మస్తానీ, `పద్మావత్` వంటి సినిమాల్లో రణవీర్ కనబరిచిన విభిన్నమైన లుక్స్ వెనుక దర్శన్ శ్రమ ఎంతో ఉంది. `ధురందర్` సినిమాలో రణవీర్ మేకోవర్ , హెయిర్ స్టైల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంలో దర్శన్ కీలక పాత్ర పోషించారు.

రణవీర్ సింగ్ రాసిన ఈ లేఖను దర్శన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. `ఒక నటుడు తన వెనుక ఉండి పనిచేసే టీమ్‌ను ఇంతలా గౌరవించడం చాలా అరుదు. రణవీర్ కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు. అంతకంటే గొప్ప మనిషి` అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు రణవీర్ సింగ్ గొప్ప మనసును అభినందిస్తున్నారు. తెర వెనుక ఉండే సాంకేతిక నిపుణులకు ఇచ్చే ఇలాంటి చిన్న గౌరవం వారిలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపు తుందని నెటి జ‌నులు అభిప్రాయపడుతున్నారు. ర‌ణ‌వీర్ మ‌న‌స్త‌త్వాన్ని ఉద్దేఉశించి నెటి జ‌నుల పోస్టులు అంతే ఆస‌క్తిక‌రం.

కేవలం నటనతోనే కాకుండా తోటి వారిని గౌరవించడంలో కూడా తాను రియల్ స్టార్ రణవీర్ మరోసారి నిరూపిం చుకున్నారంటూ ఓ నెటి జ‌నుడు రాసుకొచ్చాడు. ఈ సంఘటన సినీ పరిశ్రమలో ఇతర స్టార్ హీరోలకు కూడా ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని చెప్పొచ్చు. స్టార్ హీరోలు కెమెరా వెనుక క‌ష్ట‌ప‌డే వారి క‌ష్టాన్ని గుర్తించి ఈ ర‌కంగా ప్రోత్స‌హిస్తే వారంతా మ‌రింత ఉత్సాహంగా ప‌ని చేస్తారు. ఇలా ప్రోత్స‌హించ‌డంలో టాలీవుడ్ న‌టులు కూడా ముందుకు రావాలి. ఈ విష‌యంలో ద‌క్షిణాది హీరోల‌కంటే ఉత్త‌రాది హీరోలే ఎంతో ఉత్త‌మం అనొచ్చు.