కళ్యాణిని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాడట
దురంధర్ చిత్రంతో రికార్డులు బ్రేక్ చేస్తున్న రణ్ వీర్ సింగ్ రెట్టించిన ఉత్సాహంతో కెరీర్ లో ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు.
By: Sivaji Kontham | 17 Jan 2026 10:21 AM ISTదురంధర్ చిత్రంతో రికార్డులు బ్రేక్ చేస్తున్న రణ్ వీర్ సింగ్ రెట్టించిన ఉత్సాహంతో కెరీర్ లో ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు. తదుపరి దురంధర్ సీక్వెల్ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం చాలా కొత్త రికార్డులను నెలకొల్పుతూ ఇండియాలో చాలామంది పాన్ ఇండియా హీరోలకు సవాల్ విసురుతుందని అంచనా వేస్తున్నారు. 2025 ముగింపును ఘనంగా కానిచ్చేసిన రణ్ వీర్ ఫర్హాన్ దర్శకత్వంలోని డాన్ 3 ఆఫర్ ని వదులుకోవడం ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో జాంబీ మూవీ తెరపైకొచ్చింది.
2025లో మలయాళ చిత్రసీమలో సెన్సేషన్ గా మారింది కళ్యాణి ప్రియదర్శిణి. తన స్నేహితుడు దుల్కార్ సల్మాన్ నిర్మించిన లోకా- ది చాప్టర్ 1 సంచలన విజయం సాధించి, పాన్ ఇండియాలో హాట్ టాపిగ్గా మారింది. ఇలాంటి సమయంలో రణ్ వీర్ తన తదుపరి చిత్రానికి కళ్యాణి ప్రియదర్శినిని కథానాయికగా ఎంపిక చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.. సౌత్ ఇండియా సెన్సేషన్ కళ్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్‌లో భారతదేశంలో నెవ్వర్ బిఫోర్ అనిపించేలా జాంబీ థ్రిల్లర్ `ప్రళయ్` తెరకెక్కుతుందని చర్చ సాగుతోంది. కళ్యాణి ప్రియదర్శన్ తన బాలీవుడ్ అరంగేట్రం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని కూడా తెలుస్తోంది. తన తండ్రి ప్రియదర్శన్ బాలీవుడ్‌లో దిగ్గజ దర్శకుడు అయినా కళ్యాణి మాత్రం సరైన కథ కోసం ఎదురుచూసారు. ముఖ్యంగా జాంబీ థ్రిల్లర్ లాంటి భిన్నమైన జోనర్‌లో హిందీ కి పరిచయం కావడం తనకు కొంచెం సందేహంగా అనిపించిందట.
దీంతో రణవీర్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగి కళ్యాణికి ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. ఈ సినిమాను రణవీర్ తన సొంత బ్యానర్ `మా కసమ్ ఫిల్మ్స్` లో నిర్మిస్తున్నారు. అతడు స్వయంగా కథలోని వైవిధ్యాన్ని, దర్శకుడు జై మెహతా విజన్‌ను కళ్యాణి ప్రియదర్శన్ కి వివరించారు. రణవీర్ మాటలతో సంతృప్తి చెందిన కళ్యాణి వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనికోసం కొంత సమయం పట్టింది.. కానీ చివరికి కళ్యాణి ఓకే చెప్పిందని తాజాగా కథనాలొస్తున్నాయి.
ఈ సినిమా కథాంశం గురించి కూడా ఇప్పటికే కొన్ని లీకులు ఉన్నాయి. ఇది హాలీవుడ్ లో తెరకెక్కిన `ఐయామ్ లెజెండ్, వరల్డ్ వార్ జెడ్ తరహా మూవీ. ఈ చిత్రానికి `స్కామ్ 1992` ఫేమ్ జై మెహతా దర్శకత్వం వహిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది పోస్ట్-అపోకలిప్టిక్ జాంబీ సర్వైవల్ థ్రిల్లర్. హాలీవుడ్ సినిమా `వరల్డ్ వార్ జెడ్` తరహాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ముంబై నగరాన్ని ఒక శిథిలమైన లోకంగా చూపించబోతున్నారని తెలిసింది. జాంబీ వైరస్ సోకిన మనుషుల కారణంగా ఒక ద్వీపం నిర్మాణుష్యంగా మారుతుంది. అక్కడ భార్యాభర్తలైన రణవీర్ సింగ్- కళ్యాణి ప్రియదర్శన్ ఎలాంటి సాహసాలు చేసారు? అనేదే సినిమా. జాంబీలు చుట్టుముట్టిన ఒక విపత్కర పరిస్థితుల్లో వారు ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు? అనేదే కథాంశం.
2026 జూలై లేదా ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ చిత్రానికి కళ్యాణి క్రేజ్ మాలీవుడ్ మార్కెట్ కి కలిసొస్తుందని రణ్ వీర్ బృందం భావిస్తున్నారు. మలయాళంలో కళ్యాణి నటించిన `లోకా: చాప్టర్ 1 - చంద్ర` గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అందులో ఈ సెన్సిటివ్ బ్యూటీ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు చూసి `ప్రళయ్` మేకర్స్ ఆమెను ఎంచుకున్నారు. తెలుగులో `హలో` లాంటి రొటీన్ బోరింగ్ చిత్రంలో నటించి ఫ్లాపైన కళ్యాణి ఇప్పుడు బాలీవుడ్ లో పూర్తి ప్రయోగాత్మక సినిమాని ఎంపిక చేసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రణవీర్ సింగ్ ఇటీవల నటించిన `ధురంధర్` బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ సక్సెస్‌లో ఉంది. ఈ జోష్‌తోనే `ప్రళయ్` సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని, బడ్జెట్ పరంగా రాజీ అన్నదే లేకుండా పెడుతున్నారని కూడా టాక్ నడుస్తోంది. షూటింగ్ ప్రారంభ తేదీ సహా, ఇతర నటీనటుల వివరాలు మునుముందు వెల్లడిస్తారని సమాచారం.
