Begin typing your search above and press return to search.

ర‌ణవీర్ సింగ్ స‌ర‌స‌న క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శిన్!

అదే అత‌డిని బిగ్ స్టార్ గా మ‌రింత ప్ర‌మోట్ చేసిన అంశం కూడా. దీంతో ర‌ణ‌వీర్ సింగ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

By:  Srikanth Kontham   |   24 July 2026 11:46 PM IST
ర‌ణవీర్ సింగ్ స‌ర‌స‌న క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శిన్!
X

`ధురంధ‌ర్` విజ‌యంతో బాలీవుడ్ స్టార్ ర‌ణ‌వీర్ సింగ్ పాన్ ఇండియాలో ఎంత సంచ‌ల‌న‌మ‌య్యారో? చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక్క విజ‌యం ర‌ణ‌వీర్ ని బాలీవుడ్ లో టాప్ లో కూర్చోబెట్టింది. అత‌డి స‌క్సెస్ ను చూసి ఇత‌ర స్టార్లు కుళ్లు కున్నారు? అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 3000 కోట్ల వ‌సూళ్ల సినిమా అందించినా? అత‌డిని ప్ర‌శంసించ‌డానికి మాత్రం ఏ బాలీవుడ్ స్టార్ ముంద‌కు రాలేదు. అదే అత‌డిని బిగ్ స్టార్ గా మ‌రింత ప్ర‌మోట్ చేసిన అంశం కూడా. దీంతో ర‌ణ‌వీర్ సింగ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఈనేప‌థ్యంలో ర‌ణ‌వీర్ ఈసారి పూర్తిగా భిన్నమైన జోనర్‌లో `ప్రలయ్` అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా కుమారుడు జై మెహతా ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా తెరంగేట్రం చేస్తుండటం విశేషం. `స్కామ్ 1992`, `లూటేరే` వంటి ప్రాజెక్ట్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జై మెహతా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హన్సల్ మెహతా - సమీర్ నాయర్ సంయుక్తంగా నిర్మించ‌డానికి రెడీ అవుతున్నారు.

బాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎవ‌రూ టచ్ చేయని జాంబీ అపోకాలిప్స్ నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. హాలీవుడ్‌లో `వరల్డ్ వార్ జెడ్`, `28 డేస్ లేటర్` వంటి చిత్రాలు ఈ జోనర్‌లో సంచలనం సృష్టించగా తాజాగా భారతీయ తెరపై అలాంటి సరికొత్త దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించనున్నారు. పోస్ట్-అపోకాలిప్టిక్ ముంబై నేపథ్యంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి నగరాన్ని ఓ భయానక డిస్టోపియాగా ఈ చిత్రంలో చూపించబోతున్నారుట‌.

ఈ చిత్రంలో మొదట అలియా భట్ నటిస్తుందని వార్తలు వ‌చ్చినా? ఆమె డేట్స్ కుదరకపోవడంతో మేకర్స్ మరో సరికొత్త జోడీని తెరపైకి తీసుకువచ్చారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన `లోకా: చాప్టర్ 1` చిత్రంతో భారీ పాపులారిటీ తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమా ద్వారా బాలీ వుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స‌మాచారం. ఇప్పటికే ఓ సూపర్‌ నేచురల్ థ్రిల్లర్ ప్రపంచంలో నటించిన అనుభవం ఉండటంతో? రణవీర్ సింగ్ సరసన ఆమె ఎంపిక సరైనదేనని అంతా భావిస్తున్నారుట‌.

సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలున్నాయ‌ట‌. ఈనేప‌థ్యంలో క‌ళ్యాణ్ ప్రియ‌ద‌ర్శిన్ కి ఇప్ప‌టి నుంచే హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో స్పెష‌ల్ ట్రైనింగ్ కూడా ఇస్తున్న‌ట్లు తెలిసింది. ఇదే నిజ‌మైతే క‌ళ్యాణి కెరీర్ కొత్త ట‌ర్నింగ్ తీసుకున్న‌ట్లే. అమ్మ‌డు న‌టిగా ఇప్ప‌టికే సౌత్ లో కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో స్థిర‌ప‌డాల‌ని ఎంతో ఆశ‌ప‌డింది. కానీ ఆశీంచిన విజ‌యాలు ద‌క్క‌లేదు. దీంతో సొంత ప‌రిశ్ర‌మ‌లోనే స‌త్తా చాటి ఇప్పుడు బాలీవుడ్ కి ప్ర‌మోట్ అవుతుంది. ఈ సినిమా విజ‌యం సాధిస్తే పాన్ ఇండియాలో వెలిగిపోతుంది.