Begin typing your search above and press return to search.

రణ్ వీర్ కాంతారా కామెంట్స్.. అది వదిలేసి ఇది పట్టుకున్నారా..?

స్టేజ్ మీద కాంతారాలో రిషబ్ యాక్టింగ్ గురించి రణ్ వీర్ మెచ్చుకుంటూనే అతనిలో డెవిల్ వచ్చినప్పుడు అంటూ గాగుల్స్ తీసి కళ్లు పైకి అని ఓ అంటూ చెప్పాడు.

By:  Ramesh Boddu   |   30 Nov 2025 12:15 PM IST
రణ్ వీర్ కాంతారా కామెంట్స్.. అది వదిలేసి ఇది పట్టుకున్నారా..?
X

కాంతారా సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. సినిమాను ఇలా కూడా తీస్తారా.. ఒక పాత్రలో ఇలా కూడా నటిస్తారా అన్న రేంజ్ లో పూనకాలు తెప్పించాడు. ఐతే ఈ సినిమాలో రిషబ్ శెట్టి యాక్టింగ్ పై స్టార్స్ అంతా ఒక్కొక్కరు ఒక్కోలా తమ స్పందన తెలియచేశారు. ఐతే లేటెస్ట్ గా ఐ.ఎఫ్.ఎఫ్.ఐ సినీ వేడుకల్లో రణ్ వీర్ సింగ్ కాంతారాపై చేసిన కామెంట్స్ కాస్త నెగిటివ్ గా వెళ్లాయి.

రిషబ్ యాక్టింగ్ గురించి రణ్ వీర్ మెచ్చుకుంటూనే..

స్టేజ్ మీద కాంతారాలో రిషబ్ యాక్టింగ్ గురించి రణ్ వీర్ మెచ్చుకుంటూనే అతనిలో డెవిల్ వచ్చినప్పుడు అంటూ గాగుల్స్ తీసి కళ్లు పైకి అని ఓ అంటూ చెప్పాడు. ఐతే ఇదంతా కాంతారాని ఇమిటేట్ చేసినట్టు కాకుండా కామెడీ చేసినట్టు అనిపించింది. అంతే ఈ ఒక్క పాయింట్ పట్టుకుని కన్నడిగులు తమ సినిమానే కాదు తమ దేవతను అవమానించాడు అంటూ రణ్ వీర్ పై విమర్శలు చేస్తున్నారు. అతను క్షమాపణ చెప్పాల్సిందే అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

రణ్ వీర్ సింగ్ ఆ తర్వాత తనను అలాంటి పాత్రలో చూడాలని ఉందా అయితే అతనికి చెప్పండి తనని తీసుకోమని కూడా అన్నాడు రణ్ వీర్ సింగ్. సో ఆ పాత్ర నచ్చడం వల్లే రణ్ వీర్ తన మార్క్ ఫన్ వేలో అలా చెప్పాడు. అంతేకానీ అక్కడ రిషబ్ శెట్టిని కానీ, కాంతారాని కానీ ఉద్దేశపూర్వకంగా చేసినట్టు లేదు. అదే ఈవెంట్ లో రణ్ వీర్ స్టేజ్ మీద మాట్లాడుతుంటే అక్కడే ఉన్న రిషబ్ శెట్టి కూడా నవ్వుకున్నాడు.

కాంతారాపై కామెడీ చేశాడంటూ రణ్ వీర్ సింగ్ మీద విమర్శలు..

ఐతే కన్నడ ఫ్యాన్స్ ముఖ్యంగా కాంతారాని ఇష్టపడిన ఫ్యాన్స్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కాంతారా సినిమాపై కామెడీ చేశాడంటూ రణ్ వీర్ సింగ్ మీద విమర్శలు చేస్తున్నారు. మరి ఈ ఇష్యూపై రణ్ వీర్ సింగ్ రెస్పాండ్ అవుతారా క్లారిటీ ఇస్తారా అన్నది చూడాలి.

ఒక సినిమా గురించి మరో స్టార్ మాట్లాడినప్పుడు తన ఉద్దేశ్యం ఏదైనా సరే సరిగా చెప్పాలి. అందులోనూ అది డివోషనల్ సబ్జెక్ట్ కాబట్టి మరింత జాగ్రత్త పడాలి అలా కాకుండా ఎలా పడితే అలా అంటే ఆడియన్స్ నుంచి రియాక్షన్ ఇలానే ఉంటుంది. రణ్ వీర్ సింగ్ ఎప్పుడు ప్రతి ఈవెంట్ లో ఇలాంటి కామెడీ చేయడం కామనే కానీ కాంతారా మీద చేయడం మాత్రం నాట్ యాక్సెప్టబుల్ అనేస్తున్నారు.

కాంతారా మాత్రమే కాదు కాంతారా చాప్టర్ 1 సినిమా కూడా గొప్ప విజయం అందుకుంది. బాలీవుడ్ ఆడియన్స్ కూడా కాంతారా రెండు సినిమాలను ఒక రేంజ్ లో ఆదరించారు. మరి రణ్ వీర్ కామెంట్స్ పై కన్నడ ఫ్యాన్స్ చేస్తున్న ఈ విమర్శలను బీ టౌన్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.