YRFతో అగ్ర హీరో వివాదంపై మేనేజర్ క్లారిటీ
అయితే వైఆర్ఎఫ్ తో రణ్ వీర్ కి గొడవలు వచ్చాయని మీడియాలో చాలా కథనాలొచ్చాయి.
By: Sivaji Kontham | 9 Aug 2025 9:30 AM ISTతనకు లైఫ్‌ని ఇవ్వడమే గాక ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం కల్పించిన బ్యానర్‌తో సడెన్‌గా తెగ తెంపులు చేసుకుని వెళ్లిపోవడం అంటే ఏ హీరోకి అయినా కష్టమే. అయితే అలాంటి ఎమోషనల్ ఘట్టం ఎదురైంది రణ్ వీర్ సింగ్‌కి. అతడిని బ్యాండ్ బాజా బారాత్ చిత్రంతో 2010లో హీరోని చేసింది వైఆర్ఎఫ్ సంస్థ. ఓవర్ నైట్ లో అతడిని స్టార్ ని చేసింది ఈ సినిమా. ఆ తర్వాత మరో మూడు నాలుగు చిత్రాలు వైఆర్ఎఫ్‌లోనే చేసాడు. కానీ రణ్ వీర్ ఆ సంస్థను వీడి వెళ్లిపోయాడు.
తన స్నేహితురాలు, వైఆర్ఎఫ్ కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ .. తన మిత్రుడు రణ్ వీర్ ఎగ్జిట్ సమయంలో ఎలాంటి ఎమోషనల్ ఘట్టాల్ని ఎదుర్కొన్నారో ప్రశ్నిస్తే.. నాటి ఘటనలపై క్లియర్ కట్ గా వెల్లడించారు. రణ్ వీర్ సంస్థను వీడి వెళ్లాలనే నిర్ణయం తప్పు కాదు.. దానిని వైఆర్ఎఫ్ స్వాగతించిందని తెలిపారు. ఇటీవల 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా''తో చాటింగ్ సెషన్ లో షానూ మాట్లాడారు. రణ్‌వీర్ బ్యానర్‌ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం బాధ కలిగించలేదు.. అతడు తన జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాడు.. శుభాకాంక్షలు చెప్పాను! అని షానూ నాటి ఘటన గురించి చెప్పారు.
అయితే వైఆర్ఎఫ్ తో రణ్ వీర్ కి గొడవలు వచ్చాయని మీడియాలో చాలా కథనాలొచ్చాయి. నిజానికి కొన్ని వరుస ఫ్లాపులతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సమయంలో రణ్ వీర్ తన మాతృసంస్థ అయిన వైఆర్ఎఫ్‌ని వీడాడు. అతడిని వైఆర్ఎఫ్ మేనేజర్ అయిన షానూ శర్మ 'బ్యాండ్ బాజా బారాత్'(2010) చిత్రానికి ఎంపిక చేసారు ఆ తరవాత రణ్ వీర్ బ్రాండ్ వెలిగిపోవడానికి, అవకాశాలు అందుకోవడానికి స్నేహితురాలు షానూ శర్మ సహకరించారు.
కానీ రణ్ వీర్ సంస్థను వీడి వెళ్లాలనుకోవడానికి ఒక కారణం ఉండి ఉంటుంది.. YRF కు కూడా అతడు వెళ్లడానికి ఎటువంటి సమస్య లేదు అని అన్నారు. ''అతడు వెళ్ళడానికి ఒక కారణం ఉంది .. ప్రొడక్షన్ హౌస్ కు కూడా దీనికి అంగీకరించడానికి ఒక కారణం ఉంది'' అని షాను చెప్పారు.
రణ్‌వీర్ సింగ్ 'బ్యాండ్ బాజా బారాత్' తర్వాత వైఆర్ఎఫ్ తో 12 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం కొనసాగించాడు. లేడీస్ వర్సెస్ రికీ బహల్, బేఫిక్రే, జయేష్ భాయ్ జోర్దార్ సహా పలు సినిమాలు చేసాడు. రణ్ వీర్ ని స్టార్ ని చేసింది వైఆర్ఎఫ్. సుదీర్ఘ కాలం అతడి వెన్నంటి నిలిచింది ఈ సంస్థ. కానీ సక్సెస్ ముఖం చాటేయడంతో కొన్ని సమస్యలు వచ్చాయి. దాని కారణంగా అతడు సంస్థను వీడి వెళ్లాడు. కానీ వైఆర్ఎఫ్ తో ఎప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. వైఆర్ఎఫ్ సంస్థ 'స్పై యూనివర్శ్' లో వరుస చిత్రాల్ని నిర్మిస్తున్నందున రణ్ వీర్ కి కూడా ఏదో ఒక పాత్రలో అవకాశం కల్పిస్తుందేమో చూడాలి. రణ్ వీర్ ప్రస్తుతం ఆదిత్యాధర్ తెరకెక్కిస్తున్న 'దురంధర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి ఫర్హాన్ దర్శకత్వంలో డాన్ 3లోను నటిస్తున్నాడు.
