రణ్ వీర్ దురంధర్.. గురి బాగుంది..!
స్పై యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
By: Ramesh Boddu | 16 Aug 2025 7:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోలంతా కూడా హిట్టు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్ ఫాం కొనసాగించిన వారంతా కూడా సక్సెస్ కోసం ఎదురుచూస్తునారు. అలాంటి వారిలో రణ్ వీర్ సింగ్ కూడా ఉన్నాడు. ఈమధ్య రణ్ వీర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంత గొప్ప పర్ఫార్మెన్స్ చూపించట్లేదు. అందుకే ఈసారి గురి పెట్టి సూపర్ హిట్ కొట్టాల్సిందే అన్నట్టుగా వస్తున్నాడు. ప్రెజెట్ అతను దురంధర్ అనే సినిమా చేస్తున్నాడు.
స్పై యాక్షన్ దురంధర్..
స్పై యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాను ఆధిర్య ధర్ డైరెక్ట్ చేయడం కూడా అంచనాలు పెరిగేలా చేసింది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో సెన్సేషనల్ అనిపించుకున్న ఆధిత్య ధర్ ఈసారి దురంధర్ తో మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.
ఐతే బాలీవుడ్ స్పై థ్రిల్లర్ లకు ఒక ప్రత్యేకమైన ఫార్మెట్ ఉంది. ఐతే దురంధర్ దాన్ని బ్రేక్ చేసి అసలు సిసలు స్పై స్టోరీ చెప్పబోతున్నారు. రణ్ వీర్ సింగ్ కూడా దురంధర్ సినిమాపై సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఐతే అదేరోజు పోటీగా రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ లాక్ చేశారు.
ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేలా..
దురంధర్ సినిమా రణ్ వీర్ లుక్, సినిమా అప్పీల్ అంతా సంథింగ్ స్పెషల్ గా ఉంది. ఈ సినిమాలో సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. రణ్ వీర్ సింగ్ కెరీర్ లో కోరుతున్న ఒక సూపర్ హిట్ బొమ్మ దురంధర్ అవుతుందా లేదా అన్నది చూడాలి. రణ్ వీర్ సింగ్ లాస్ట్ ఇయర్ సింగం అగైన్ లో నటించాడు. ఆ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే దురంధర్ సినిమా మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. రణ్ వీర్ సింగ్ కూడా దురంధర్ మీదే ఫుల్ ఫోకస్ తో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది.
సో బాలీవుడ్ నుంచి వస్తున్న మరో స్పై మూవీ దురంధర్. ఆధిత్య ధర్ చేస్తున్న సినిమాకాబట్టి ఈ మూవీపై క్యూరియాసిటీ ఉంది. మరి ఈ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.
