Begin typing your search above and press return to search.

హిమాలయాల్లో 'దురంధ‌ర్' ప‌న్ను ర‌హితం

రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ చిత్రం `ధురందర్` నాలుగో వారంలోను అద్భుత వ‌సూళ్ల‌తో హ‌వా సాగిస్తోంది.

By:  Sivaji Kontham   |   3 Jan 2026 9:21 AM IST
హిమాలయాల్లో దురంధ‌ర్ ప‌న్ను ర‌హితం
X

రణవీర్ సింగ్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ చిత్రం `ధురందర్` నాలుగో వారంలోను అద్భుత వ‌సూళ్ల‌తో హ‌వా సాగిస్తోంది. అయితే ఈ వారంలో ఇత‌ర రిలీజ్ ల కార‌ణంగా థియేట‌ర్ల సంఖ్య త‌గ్గింది. ఆ మేర‌కు వ‌సూళ్లు కూడా త‌గ్గాయి. అయినా ఇప్పటికీ 10కోట్లు పైగా రోజువారీ వ‌సూళ్ల‌ను సాధిస్తోంద‌ని ట్రేడ్ చెబుతోంది. అయితే గ‌ల్ఫ్‌లో నిషేధం కార‌ణంగా ఈ సినిమా 90కోట్ల మేర న‌ష్ట‌పోయి ఉండొచ్చ‌ని ట్రేడ్ అంచ‌నా వేసింది. ఇలాంటి స‌మ‌యంలో దురంధ‌ర్ నిర్మాత‌ల‌కు ఒక‌ శుభ‌వార్త అందింది.

దురంధ‌ర్ చిత్రాన్ని హిమాల‌య సానువుల‌కు స‌మీపంగా ఉన్న ల‌డ‌ఖ్ లో ప‌న్ను ర‌హితంగా ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యం బాక్సాఫీస్ వసూళ్లకు అద‌నంగా క‌లిసొస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా కార్యాలయం ఈ ప్రకటన చేయ‌గానే దురంధ‌ర్ చిత్ర‌బృందం నుంచి హ‌ర్షం వ్య‌క్త‌మైంది. కేంద్ర పాలిత ప్రాంతంలో మిన‌హాయింపున‌కు కార‌ణం ఈ చిత్రాన్ని ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వ‌హించేలా అక్క‌డ అంద‌మైన దృశ్యాల‌ను చిత్రీక‌రించ‌డం ఒక కార‌ణం.

`దురంధ‌ర్` దేశవ్యాప్తంగా థియేటర్లలో తన జైత్ర‌యాత్రను కొనసాగిస్తున్న తరుణంలో ప‌న్ను చెల్లించాల్సిన ప‌ని లేక‌పోవ‌డం వ‌సూళ్ల ప‌రంగా అస్సెట్ కానుంది. లడఖ్ `ధురందర్`ను ఎందుకు పన్ను రహితంగా ప్రకటించింది?

అంటే... లడఖ్ ప్రకృతి సౌంద‌ర్యాన్ని ఈ చిత్రం అద్భుతంగా ప్రదర్శించడం .. ఆ ప్రాంతానికి టూరిజం ఆక‌ర్ష‌ణ‌ను పెంచడంలో సినిమా పోషించిన పాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రం లడఖ్ సినిమాటిక్ సౌందర్యాన్ని హైలైట్ చేసింది. ల‌డ‌ఖ్ సౌంద‌ర్యాన్ని చిత్రీక‌రించే ప్ర‌తి చిత్ర నిర్మాత‌కు ఇలాంటి ఒక అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌నే సందేశం ఇవ్వ‌డంతో అంద‌రినీ ఆక‌ర్షించ‌డమే దీని ఉద్ధేశం. కేంద్రపాలిత ప్రాంతానికి మరిన్ని భారీ బడ్జెట్ ప్రాజెక్టులను ఆకర్షించడానికి స్థానిక ప్రభుత్వం కొత్త చలనచిత్ర విధానంపై చురుకుగా పనిచేస్తోందని కూడా తాజా ప్ర‌క‌ట‌న‌లో ప్రస్తావించారు.

`ధురందర్`లో ఎక్కువ భాగం లడఖ్‌లో చిత్రీకరించారు. అక్కడ‌ కఠినమైన మంచు, చలి వాతావ‌ర‌ణంలో సహజ సౌందర్యాన్ని చిత్రీకరించ‌డం నిజంగా గొప్ప‌త‌నం. ల‌డ‌ఖ్ సౌంద‌ర్యాన్ని దురంధ‌ర్ లో అద్భుతంగా ఎలివేట్ చేయ‌డంలో సినిమాటోగ్ర‌ఫీ కూడా స‌హ‌క‌రించింది.

దురంధ‌ర్ డిసెంబ‌ర్ 5న విడుద‌లైంది. దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 739 కోట్లకు పైగా నికర వసూళ్లను రాబట్ట‌గా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1141.75 కోట్లు వసూలు చేసింది. థియేటర్లలో నాలుగు వారాల తర్వాత కూడా బాగానే ఆడుతోంది. 28వ రోజున భారతదేశంలో రూ. 15.75 కోట్లు ఆర్జించింది. ఈరోజులలో ఇది ఒక అరుదైన ఘనత. దేశీయంగా రూ. 700 కోట్ల మార్కును దాటిన మొదటి హిందీ చిత్రంగా కూడా ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. ఇది ధైర్య‌మైన ప్ర‌య‌త్నం.. దురంధ‌ర్ ఒక క్లాస్ ఎంట‌ర్‌టైన‌ర్ అని బాలీవుడ్ పాపుల‌ర్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ కీర్తించారు.

దురంధ‌ర పాకిస్తాన్ లియారీలో స్పై ఆప‌రేష‌న్ నిర్వ‌హించే ఇండియ‌న్ స్పై క‌థాంశం. ఇందులో ర‌ణ్ వీర్ సింగ్, అక్ష‌య్ ఖ‌న్నా, ఆర్.మాధ‌వ‌న్, సంజ‌య్ ద‌త్ స‌హా న‌టులంతా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకున్నారు.