Begin typing your search above and press return to search.

క్లీన్ స్వీప్ చేసిన ‘ధురంధర్ 2’.. కలెక్షన్స్ లోనే కాదు అవార్డ్స్ లో కూడా!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా ‘ధురంధర్ 2’ నామస్మరణే వినిపిస్తోంది.

By:  Madhu Reddy   |   19 Jun 2026 3:37 PM IST
క్లీన్ స్వీప్ చేసిన ‘ధురంధర్ 2’.. కలెక్షన్స్ లోనే కాదు అవార్డ్స్ లో కూడా!
X

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా ‘ధురంధర్ 2’ నామస్మరణే వినిపిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తూ ఏకంగా రూ. 1,600 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ రేంజ్ సంచలనం సృష్టించిన ఈ సినిమా, 2026 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ లేపుతున్నారు. ఆ విశేషాలు ఇలా వున్నాయి..

బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన స్పై థ్రిల్లర్:

2025లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’ ఫస్ట్ వారం లోనే బాలీవుడ్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం ఇండియాలోనే కాకుండా, ఓవర్సీస్‌లోనూ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. రణ్‌వీర్ సింగ్ ఇండియన్ గూఢచారిగా (Spy) తన నటనతో విశ్వరూపం చూపించడంతో ఈ సినిమా సమకాలీన సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

నేషనల్ అవార్డ్స్ రేసు:

ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ గతంలో తో జాతీయ అవార్డు గెలుచుకున్నఆదిత్య ధర్, ఈ సీక్వెల్‌ను ఇంకా హై వోల్టేజ్ కథతో అద్భుతంగా తెరకెక్కించారు. "నేను ఎప్పుడూ జాతీయ అవార్డులకు సిద్ధంగానే ఉంటాను" అని ఆదిత్య ధర్ ధీమాగా చెప్పడం విశేషం. ఇక దీంతో ఈసారి బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో ఈ సినిమాకు, అలాగే బెస్ట్ యాక్టర్ కేటగిరీలో రణ్‌వీర్ సింగ్‌కు అవార్డులు ఖాయమని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

టెక్నికల్ కేటగిరీల్లోనూ గట్టి పోటీ:

కేవలం నటన, దర్శకత్వమే కాకుండా సినిమాలోని మిగతా విభాగాలకు కూడా అవార్డులు రావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సపోర్టింగ్ రోల్‌లో అదరగొట్టిన రాకేష్ బేడి, వికాస్ నౌలాఖా అద్భుతమైన సినిమాటోగ్రఫీ, శాశ్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, సతీందర్ సర్తాజ్ రాసిన ‘జైయే సజనా’ పాట లిరిక్స్, అలాగే జాస్మిన్ శాండ్లాస్ పాడిన పాటలకు జాతీయ అవార్డులు రావాలంటూ బి62 స్టూడియోస్ ప్రొడక్షన్ పోస్టర్లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

వసూళ్ల పరంగానే కాకుండా కంటెంట్ పరంగా కూడా ‘ధురంధర్ 2’ సినిమా సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. మరి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆశిస్తున్నట్టుగానే 2026 నేషనల్ అవార్డ్స్‌లో ఈ చిత్రం క్లీన్ స్వీప్ చేసి అన్ని అవార్డులను తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి. ఇక ఏదేమైనా రణ్‌వీర్, ఆదిత్య ధర్ కాంబో ఇండియన్ స్క్రీన్‌పై ఒక మ్యాజిక్ క్రియేట్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు..