రణవీర్ 'ధురంధర్'.. టాక్ ఎలా ఉందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 5 Dec 2025 10:19 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఆ సినిమాలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, సౌమ్య టాండన్ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేశారు.
దాదాపు 17 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లో రిలీజ్ అయిన హయ్యెస్ట్ రన్ టైమ్ ఉన్న మూవీగా ధురంధర్ నిలిచింది. అంతే కాదు.. విడుదలకు ముందు ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. మరి ఇప్పుడు సినిమా నేడు రిలీజ్ అవ్వగా.. మూవీ చూసిన వాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి టాక్ ఎలా ఉందంటే?
దేశభక్తి ఎలిమెంట్స్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమా అంతా పాకిస్థాన్ లోని ఉగ్ర సంస్థలను భూస్థాపితం చేసేందుకు మన ఇంటిలిజెన్స్ వర్గాలు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ చుట్టూ తిరుగుతోంది. అయితే సినిమాలో ఓ ఖైదీని ఏజెంట్ రూపంలో పాక్ కు పంపడం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా సినీ ప్రియులు చెబుతున్నారు.
అక్కడ అతనికి ఎదురయ్యే సవాళ్ళను బాగా చూపించారని అంటున్నారు. కానీ స్పై మూవీస్ లో ఉండే మజా మాత్రం మిస్ అయిందని కామెంట్లు పెడుతున్నారు. కొన్ని చోట్ల చాలా సాగదీతగా అనిపించిందని చెబుతున్నారు. ప్రతి విషయాన్ని డైరెక్టర్ క్లియర్ గా చూపించాలనుకున్నారని, దాని వల్ల ఇబ్బంది వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు.
సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయినా.. కొన్ని సీన్స్ ను ముందే గెస్ చేసేయొచ్చని అంటున్నారు. మరికొన్ని సన్నివేశాల్లో హీరో అలా ఏంటి చేశారనిపిస్తుందని చెబుతున్నారు. క్లైమాక్స్ ముందు మాత్రం సినిమా థ్రిల్ పంచుతుందని, క్లైమాక్స్ యాక్షన్ ప్రియులకు నచ్చుతుందని అంటున్నారు. సీక్వెల్ కూడా ఉంటుందని రివీల్ చేసినట్లు చెబుతున్నారు.
ఏదేమైనా సినిమాలో ఏజెంట్ గా రణవీర్ సింగ్ అదరగొట్టేశారని కొనియాడుతున్నారు. అన్ని సీన్స్ లో తనదైన టాలెంట్ చూపించారని ప్రశంసిస్తున్నారు. అక్షయ్ ఖన్నా విలన్ గా ఆకట్టుకున్నారని చెబుతున్నారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ సహా దాదాపు క్యాస్టింగ్ అంతా బాగా యాక్ట్ చేశారని అంటున్నారు. సారా గ్లామరస్ గా సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. డైరెక్టర్ ఆదిత్య సినిమా బాగా తీసినా.. స్టోరీలో కొత్త విషయం పెద్దగా లేదని అంటున్నారు.
