Begin typing your search above and press return to search.

ధురంధర్ OTT వెర్షన్.. ఛేంజెస్ ఉన్నాయా?

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌ లో తెరకెక్కిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌ లోకి వచ్చేసింది.

By:  M Prashanth   |   30 Jan 2026 6:54 PM IST
ధురంధర్ OTT వెర్షన్.. ఛేంజెస్ ఉన్నాయా?
X

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌ లో తెరకెక్కిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌ లోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధించిన ఆ చిత్రం తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుండడంతో అభిమానులు ఇంటి వద్దే సినిమా ఆస్వాదిస్తున్నారు.

థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలైన ఆ సినిమా యాక్షన్ ఎపిసోడ్‌ లు, హై టెక్నికల్ వాల్యూస్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే అనుభూతిని ఓటీటీలో కూడా అందించేందుకు 4K రిజల్యూషన్, డాల్బీ డిజిటల్ 5.1 ఆడియో క్వాలిటీతో స్ట్రీమింగ్ చేస్తున్నారు. దీంతో సినీ లవర్స్.. ఓటీటీలో మూవీని ఎంజాయ్ చేస్తున్నారు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రణవీర్ సింగ్ రా (RAW) ఏజెంట్ పాత్రలో పవర్ ఫుల్ యాక్టింగ్ తో మెప్పించారు. దేశ భద్రత కోసం పాకిస్థాన్‌ లోని అత్యంత ప్రమాదకర ప్రాంతమైన ల్యారీ ప్రాంతంలో అండర్‌ కవర్ ఆపరేషన్ నిర్వహించే అధికారిగా ఆయన పాత్ర ఆకట్టుకుంది. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి అంశాల మేళవింపుతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

రణవీర్‌ కు తోడుగా అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో మెరిశారు. వీరి నటన సినిమాకు మరింత బలం చేకూర్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వం, టెన్షన్ పెంచే స్క్రీన్‌ ప్లే, భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. థియేటర్లలో ఈ చిత్రం మంచి వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అయితే ఓటీటీ వెర్షన్‌ లో థియేటర్ వెర్షన్‌ తో పోలిస్తే కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కథకు పెద్దగా అవసరం లేని కొన్ని సీన్స్ ను ట్రిమ్ చేయడంతో సినిమా నిడివి దాదాపు 10 నిమిషాల వరకు తగ్గింది. అలాగే మూవీలో ఉన్న కొన్ని బోల్డ్ డైలాగ్స్, కఠినమైన వర్డ్స్ ను మ్యూట్ చేశారు. కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కాస్త క్లీనర్ వెర్షన్‌ గా అందించినట్లు తెలుస్తోంది.

అయినా సినిమా ఒరిజినల్ మూడ్, యాక్షన్ ఇంటెన్సిటీ మాత్రం అలాగే ఉంచారు. ప్రధాన సన్నివేశాల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో థియేటర్ అనుభూతిని ఓటీటీలో కూడా పొందవచ్చు. ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అదే సమయంలో ధురంధర్ సీక్వెల్ ధురంధర్ 2 కూడా సిద్ధమవుతోంది. మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. మొత్తానికి థియేటర్లలో హిట్‌ గా నిలిచిన ధురంధర్ ఇప్పుడు ఓటీటీలో కూడా అదే జోరు కొనసాగిస్తూ యాక్షన్ ప్రియులను అలరిస్తోంది.