Begin typing your search above and press return to search.

'ధురంధర్‌' వెయ్యి కోట్ల వెనుక.. దిమ్మతిరిగే నిజం!

భారతీయ చలనచిత్ర చరిత్రలో 1000 కోట్ల క్లబ్ అనేది ఒక బెంచ్ మార్క్. సాధారణంగా ఈ రికార్డ్ ని అందుకోవాలంటే సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాలి.

By:  M Prashanth   |   30 Dec 2025 4:10 PM IST
ధురంధర్‌ వెయ్యి కోట్ల వెనుక.. దిమ్మతిరిగే నిజం!
X

భారతీయ చలనచిత్ర చరిత్రలో 1000 కోట్ల క్లబ్ అనేది ఒక బెంచ్ మార్క్. సాధారణంగా ఈ రికార్డ్ ని అందుకోవాలంటే సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాలి. ముఖ్యంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కల్కి లాంటి సినిమాలు దక్షిణాది భాషల్లో రిలీజ్ అయ్యి, అక్కడి నుంచే భారీ వసూళ్లు రాబట్టాయి. కానీ రణ్‌వీర్‌ సింగ్‌ 'ధురంధర్‌' మాత్రం ఆ రూల్ ని బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎలాంటి డబ్బింగ్ లేకుండా, సౌత్ భాషల్లో రిలీజ్ కాకుండానే ఈ మ్యాజికల్ ఫిగర్ ని టచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ రికార్డు వెనుక ఉన్న అసలు విశేషం ఏంటంటే.. ఈ సినిమాను సౌత్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డబ్బింగ్ చేయలేదు. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. అయినా సరే మన సౌత్ ఆడియెన్స్ భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ని నమ్మి థియేటర్లకు వెళ్లారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం సౌత్ ఇండియా నుంచే ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందట. ఒక స్ట్రైట్ హిందీ సినిమాకు సౌత్ లో ఈ రేంజ్ ఆదరణ దక్కడం చాలా అరుదు.

ఇక లాభాల పరంగా చూస్తే 'ధురంధర్‌' ఇండియన్ సినిమాలోనే 'మోస్ట్ ప్రాఫిటబుల్ ఫిల్మ్' గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. వేరే భాషల్లో డబ్బింగ్ ఖర్చులు, అక్కడ డిస్ట్రిబ్యూషన్ కమిషన్లు, భారీ ప్రమోషన్స్ హడావిడి లేకుండా సొంత రిలీజ్ ద్వారానే ఇంత మొత్తం రాబట్టడం విశేషం. దీనివల్ల నిర్మాతలకు మిగిలే లాభం మిగతా వెయ్యి కోట్ల సినిమాల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

ఆదిత్య ధర్ టేకింగ్, స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ కావడం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కంటెంట్ బలంగా ఉంటే భాష అడ్డుకాదని ఈ సినిమా మరోసారి నిరూపించింది. సబ్ టైటిల్స్ సాయంతోనే మన ఆడియెన్స్ సినిమాను ఎంజాయ్ చేశారు అంటే కథలో ఎంత గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 'ఏ' సర్టిఫికెట్ సినిమా కావడం, ఎలాంటి కమర్షియల్ హంగులు లేకపోయినా ఈ రేంజ్ సక్సెస్ సాధించడం నిజంగా గ్రేట్.

మొదటి భాగం కేవలం హిందీ వెర్షన్ తోనే బాక్సాఫీస్ ని షేక్ చేసిందంటే, ఇక రాబోయే సీక్వెల్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పార్ట్ 1 సక్సెస్ తో పార్ట్ 2 పై అంచనాలు మరో రేంజ్ కి వెళ్లాయి. ఒకవేళ రెండో భాగాన్ని కనుక అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే, కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అంచనా వేయడం కష్టమే. పార్ట్-2 ని ఎవరు ఆపలేరు అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

ఇక 'ధురంధర్‌' విజయం ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కు ఒక కొత్త కాన్ఫిడెన్స్ ఇచ్చింది. పాన్ ఇండియా రిలీజ్ అనే ట్యాగ్ లేకపోయినా, కంటెంట్ లో దమ్ముంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టొచ్చని గట్టిగా చెప్పింది. 2025 బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచిన ఈ సినిమా రికార్డులు ఇప్పట్లో ఎవరూ బ్రేక్ చేయలేకపోవచ్చు.