Begin typing your search above and press return to search.

పుకార్లకు చెక్ పెట్టిన దురంధర్2 టీమ్!

అయితే ఈ సందేహాలకు ముగింపు పలుకుతూ చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 March 2026 1:38 PM IST
పుకార్లకు చెక్ పెట్టిన దురంధర్2 టీమ్!
X

బాలీవుడ్‌లో భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న దురంధర్ 2: రివెంజ్ గురించి గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వాయిదా పుకార్లకు చివరికి క్లారిటీ వచ్చినట్టైంది. సినిమా రిలీజ్ కు మ‌రికొన్ని రోజులే మిగిలి ఉన్నా ఎలాంటి అప్డేట్లు లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ట్రైలర్, పాటలు, పోస్టర్లు లాంటివి ఎక్కడా కనిపించకపోవడంతో సినిమా చెప్పిన తేదీకే వస్తుందా లేదా అనే డౌట్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీసాయి. అయితే ఈ సందేహాలకు ముగింపు పలుకుతూ చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.




ట్రైల‌ర్ అప్డేట్ ఇచ్చిన మేక‌ర్స్

మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 7, ఉదయం 11.01 గంటలకు దురంధర్ 2 ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ తో సినిమా వాయిదా పడుతుందన్న ఊహాగానాలకు చెక్ పడినట్టైంది. ఒకవేళ సినిమా నిజంగానే వాయిదా పడే పరిస్థితి ఉంటే ఈ దశలో ట్రైలర్ విడుదలకు సిద్ధం కావడం కష్టమే. అందుకే ఈ అనౌన్స్‌మెంట్‌ను ఇండస్ట్రీ వర్గాలు కూడా ఒక ముఖ్యమైన సంకేతంగా చూస్తున్నాయి.

ఫ్యాన్స్ లో సందేహాలు

ఇప్పటివరకు ప్రమోషన్ విషయంలో చిత్ర బృందం అనుసరించిన నిశ్శబ్ద విధానం కూడా చర్చనీయాంశమైంది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కు చాలా ముందే ట్రైలర్, పాటలు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటాయి. కానీ దురంధర్2 విషయంలో మాత్రం మేకర్స్ చాలా వరకు మౌనం పాటించారు. డైరెక్ట‌ర్ ఆదిత్య ధ‌ర్ పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్ బిజీగా ఉన్నాడన్న సమాచారం ఉన్నప్పటికీ, ప్రమోషన్ టీమ్ నుంచి ఎలాంటి కదలిక కనిపించకపోవడం అభిమానుల్లో సందేహాలను పెంచింది.

ఓవ‌ర్సీస్ లో దురంధ‌ర్2పై మంచి బ‌జ్

ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాకు మంచి బజ్ నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన అన్ని ప్రాంతాల్లో మంచి స్పందన కనిపిస్తోందన్న వార్తలొచ్చాయి. అలాంటి టైమ్ లో సినిమా వాయిదా పడితే ఇప్పటికే ఏర్పడిన హైప్‌పై ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. అందుకే ట్రైలర్ అనౌన్స్‌మెంట్‌ను ఇప్పుడు ఒక కీలక నిర్ణయంగా చూస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ రెస్పాన్స్ కూడా ఆసక్తికరంగా మారింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినిమా రిలీజ్ అవుతుందా లేదా? అంటూ ప్రశ్నలు లేవనెత్తిన ఫ్యాన్స్‌కు ఈ ట్రైలర్ డేట్ అనౌన్స్‌మెంట్ కొంత ఉపశమనాన్ని కలిగించింద‌ని చెప్పొచ్చు. ముఖ్యంగా సీక్వెల్‌పై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు ఇప్పుడు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ట్రైలర్ విడుదలైన తర్వాతే సినిమా ప్రమోషన్ ఎలా ముందుకు సాగుతుంద‌నే విష‌యంలో క్లారిటీ వస్తుంది. ట్రైలర్‌తో మేకర్స్ భారీ ప్ర‌మోష‌న్ల‌ను మొద‌లుపెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ట్రైలర్ అనౌన్స్‌మెంట్‌తో దురంధర్2 చుట్టూ ఉన్న అనుమానాలు కొంతవరకు తగ్గినప్పటికీ, అసలు సినిమా ప్రభావం ఎలా ఉండబోతోందో చూడాలంటే ఇప్పుడు ట్రైలర్ కోసం వెయిట్ చేయాల్సిందే.