టాక్సిక్‌కు లేదు..ధురంధర్ 2కే ఎందుకు?
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ మూవీ టీజర్‌ని జనవరి 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ఓ న్యూస్ బయటికొచ్చింది.
By: Tupaki Entertainment Desk | 22 Jan 2026 7:00 PM ISTదేశ వ్యాప్తంగా షాకింగ్ కంటెంట్‌తో సంచలనం సృష్టించిన మూవీ `ధురంధర్`. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా `యూరి` ఫేమ్ ఆదిత్యధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రణ్‌వీర్ కు వరుస పరాజయాలు ఎదురవుతున్న నేపథ్‌యంలో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చేసింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ని సొంతం చేసుకుని స్టిల్ అదే క్రేజ్‌తో రన్నవుతోంది. ఇప్పటి వరకు రూ.1300 కోట్లకు పైనే రాబట్టి క్రేజీ బ్లాక్ బస్టర్ల రికార్డుల్ని తిరగరాసింది.
రన్ వీర్ సింగ్ నటన, అక్షయ్‌ఖన్నా అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఆదిత్యధర్ నెవర్ బిఫోర్ టేకింగ్ సినిమాని స్కై హైకి చేర్చాయి. దీని తరువాత సీక్వెల్‌గా `ధురంధర్ 2:ది రివేంజ్` రాబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ధురంధర్ 2పై పడింది. పార్ట్ 1లో రెహమాన్ డకాయత్ మర్డర్‌తో ఎండ్ చేసిన దర్శకుడు పార్ట్ 2 కోసం ఎలాంటి సర్ ప్రైజ్‌లు దాచాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పార్ట్ 2పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ మూవీ టీజర్‌ని జనవరి 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ఓ న్యూస్ బయటికొచ్చింది. అంతే కాకుండా టీజర్‌కు సెన్సార్ కూడా చేయించారని, సెన్సార్ వారు ఏ సర్టిఫికెట్ జారీ చేశారని తెలిసింది. టీజర్‌కు సెన్సార్ ఏంటీ? అన్నదే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇండియన్ సినిమాల్లో సరికొత్త చర్చకు తెర లేపింది. టీజర్‌లకు కూడా ఈ రోజుల్లో సెన్సార్‌షిప్ ఎంత అవసరమో తేల్చి చెప్పింది. మారుతున్న సోషల్ మీడియా విస్తరణ, వింత పోకడలకు చెక్ పెట్టే విధంగా ఈ విధానం పని చేస్తుందనే ఆలోచనలని రేకెత్తిస్తోంది. ప్రతీ టీజర్, ట్రైలర్‌లను సెన్సార్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది.
అయితే `ధురంధర్ 2 టీజర్‌ని సెన్సార్ చేయించడానికి ప్రధాన కారణం `బోర్డర్ 2` మూవీ అని తెలిసింది. కారణం `ధురంధర్ 2` టీజర్‌ని ఈ నెల 23న విడుదలవుతున్న `బోర్డర్ 2` ప్రింట్‌కు జత చేసి రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ చేసే టీజర్‌లకు సెన్సార్ తప్పని సరి కావడం వల్లే `ధురంధర్2` టీమ్ టీజర్‌కు సెన్సార్ ఫార్మాలీటీస్ పూర్తి చేసి `బోర్డర్ 2`కు జత చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. ఇటీవల యష్ నటించిన `టాక్సిక్` మూవీ టీజర్ నెట్టింట, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
ఇలాంటి టీజర్‌లని సెన్సార్ చేయకుండా వదలకూడదని పలువురు కామెంట్ చేశారు. అంతే కాకుండా కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్‌ని సైతం దీనిపై ప్రశ్నించడం..తను టీజర్‌లకు సెన్సార్ ఉండదని చెప్పడం తెలిసిందే. ఇదిలా ఉంటే 23న రిలీజ్ కానున్న టీజర్‌తో `ధురంధర్ 2` ఎలాంటి సంచలనాలకు తెర లేపడానికి రెడీ అవుతోందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 19న సినిమాని భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో టీజర్ ని థియేటర్లలో రిలీజ్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
