ధురంధర్ 2.. ప్రీమియర్స్ తోనే టాప్ రికార్డ్స్ బ్రేక్!
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ధురంధర్: ది రివెంజ్ (ధురంధర్ 2) నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 19 March 2026 11:49 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ధురంధర్: ది రివెంజ్ (ధురంధర్ 2) నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం విడుదలకు ముందే ప్రీమియర్ షోలతోనే రికార్డులు సృష్టించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మార్చి 18 సాయంత్రం నుంచి ప్రదర్శించిన ప్రీమియర్ షోల ద్వారా ధురంధర్ 2 మూవీ సుమారు రూ.44 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. మొత్తం 12,292 షోలలో ప్రదర్శితమైన ఆ చిత్రానికి సగటున 46.7 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని సమాచారం. మరోవైపు కొందరు ప్రీమియర్ షోల ద్వారా మాత్రమే రూ.52.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.
ఏదేమైనా ఇప్పటికే ప్రీమియర్ వసూళ్లలో గత రికార్డులను ధురంధర్ 2 మూవీ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓజీ చిత్రం సాధించిన రూ.25 కోట్ల మార్క్, అలాగే యానిమల్ సినిమా సాధించిన 1.2 మిలియన్ డాలర్ల రికార్డులు ధురంధర్ 2 అధిగమించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ధురంధర్ 2 మరిన్ని రికార్డులు కచ్చితంగా బ్రేక్ చేస్తుందని, క్రియేట్ చేస్తుందని క్లియర్ గా తెలుస్తోంది.
ఇక సినిమా విషయానికొస్తే.. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్: ది రివెంజ్ చిత్రంలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్, బీ 62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధర్, లోకేష్ ధర్, జ్యోతి దేశ్ పాండేలు సంయుక్తంగా ఆ చిత్రాన్ని నిర్మించారు.
గతేడాది విడుదలైన ధురంధర్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడంతో సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో మార్చి 19వ తేదీన ఉగాది, రంజాన్, గుడి పాడ్వా పండుగల సందర్భంగా ఆ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. గతంలో మొదటి భాగాన్ని కేవలం హిందీకి మాత్రమే పరిమితం చేసిన మేకర్స్.. ఈసారి సౌత్ మార్కెట్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ చిత్రానికి సుమారు రూ.250 కోట్ల నిర్మాణ వ్యయం కాగా, ప్రమోషన్ల కోసం మరో రూ.30 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తం బడ్జెట్ రూ.280 కోట్లకు చేరిందని వినికిడి. అయితే సినిమా కోసం కరాచీ నగరాన్ని క్రియేట్ చేసేలా భారీ సెట్లు వేసి చిత్రీకరణ జరిపినట్లు టాక్. రిలీజ్ విషయంలో కూడా ధురంధర్ 2 రికార్డులు సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా సుమారు 8,500 నుంచి 9,000 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000పైగా స్క్రీన్లలో ధురంధర్ సీక్వెల్ విడుదలైంది.
