Begin typing your search above and press return to search.

వేయి కోట్ల క్లబ్ ముంగిట 'ధురంధర్ 2'.. ఇంకా ఎంత రావాలి?

రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ‘ధురంధర్ 2’ ప్రస్తుతం థియేటర్ల వద్ద పాజిటివ్ వైబ్స్ తో కొనసాగుతోంది.

By:  M Prashanth   |   25 March 2026 1:39 PM IST
వేయి కోట్ల క్లబ్ ముంగిట ధురంధర్ 2.. ఇంకా ఎంత రావాలి?
X

రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన ‘ధురంధర్ 2’ ప్రస్తుతం థియేటర్ల వద్ద పాజిటివ్ వైబ్స్ తో కొనసాగుతోంది. ఒక సాధారణ స్పై థ్రిల్లర్‌గా మొదలైన ఈ సినిమా జోరు, ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే స్థాయికి చేరుకుంది. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ కంటే రెండవ భాగంపై ఉన్న అంచనాలు భారీగా ఉండటంతో, ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా రణవీర్ నటన, ఆదిత్య ధర్ టేకింగ్ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు.

సాధారణంగా సీక్వెల్ సినిమాల విషయంలో కొంత నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ‘ధురంధర్ 2’ విషయంలో అది రివర్స్ అయ్యింది. మేకింగ్ వాల్యూస్ హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండటంతో నార్త్ నుంచి సౌత్ వరకు అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రం సాలిడ్ వసూళ్లను సాధిస్తోంది. కేవలం వీకెండ్ మాత్రమే కాకుండా వర్కింగ్ డేస్‌లో కూడా ఈ సినిమాకు ఆడియన్స్ క్యూ కడుతుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్‌కు ఇది ఒక పెద్ద ఊరటనిచ్చే విజయం.

వసూళ్ల విషయానికి వస్తే, ‘ధురంధర్ 2’ ఆరు రోజుల్లోనే కళ్లు చెదిరే మార్కును అందుకుంది. కేవలం వారం కూడా పూర్తి కాకుండానే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.958 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. మరో 42 కోట్లు అందుకుంటే వేయి కోట్ల క్లబ్‌కు చేరువలో నిలుస్తుంది. మొదటి రోజు రూ.145 కోట్లతో మొదలైన ఈ బాక్సాఫీస్ దండయాత్ర, వీకెండ్ లో రూ.100 కోట్లకు తగ్గకుండా వసూళ్లను రాబట్టింది. హిందీ బెల్ట్‌లో రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలవడం విశేషం.

నిజానికి గత ఏడాది వచ్చిన పెద్ద సినిమాల రికార్డులను ఈ చిత్రం సునాయాసంగా అధిగమిస్తోంది. వీక్ డేస్ అయిన సోమ, మంగళవారాల్లో కూడా ఈ సినిమా డబుల్ డిజిట్ వసూళ్లు సాధించడం విశేషం. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే మరో రెండు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ ని ఈజీగా దాటేసేలా ఉంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా ‘దంగల్’ రికార్డులకు ఎంతవరకు చేరువ అవుతుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఆరు రోజుల కలెక్షన్ల వివరాలు అంచనా ప్రకారం ఇలా ఉన్నాయి.

మొదటి రోజు: రూ.145 కోట్లు

రెండవ రోజు: రూ.83 కోట్లు

మూడవ రోజు: రూ.117 కోట్లు

నాలుగవ రోజు: రూ.121 కోట్లు

ఐదవ రోజు: రూ.66 కోట్లు

ఆరవ రోజు: రూ.57 కోట్లు

మొత్తం వసూళ్లు: రూ.958 కోట్లు (వరల్డ్ వైడ్)

ఈ స్థాయిలో వసూళ్లు రావడానికి ప్రధాన కారణం సినిమాలో ఉన్న కంటెంట్. స్పై థ్రిల్లర్ జోనర్లో ఎమోషన్స్ కూడా పండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తున్నారు. వచ్చే వారం వరకు పెద్ద సినిమాల పోటీ లేకపోవడం ఈ చిత్రానికి మరింత ప్లస్ అయ్యేలా ఉంది. ఆదిత్య ధర్ తన హ్యాట్రిక్ హిట్‌తో ఇప్పుడు ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా మారిపోయారు. రణవీర్ సింగ్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఈ సినిమాతో ఆయన తన స్టామినా ఏంటో మళ్ళీ నిరూపించుకున్నారు. ఇక ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద నాన్ స్టాప్ గా దూసుకుపోతోంది. ఈ వారం ముగిసేలోపు రూ.1100 కోట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ భారీ విజయం రణవీర్ సింగ్ కెరీర్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.