Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్: రెండో బిడ్డతో 'రాకా- ప్ర‌ళ‌య్' బంప‌ర్ హిట్లే!

బాలీవుడ్ మోస్ట్ క్రేజీ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొణే తమ అభిమానులకు.. చలనచిత్ర పరిశ్రమకు అద్భుతమైన తీపి కబురు అందించారు.

By:  Sivaji Kontham   |   9 Sept 2026 9:21 AM IST
గుడ్ న్యూస్: రెండో బిడ్డతో రాకా- ప్ర‌ళ‌య్ బంప‌ర్ హిట్లే!
X

బాలీవుడ్ మోస్ట్ క్రేజీ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకొణే తమ అభిమానులకు.. చలనచిత్ర పరిశ్రమకు అద్భుతమైన తీపి కబురు అందించారు. తమ మొదటి కుమార్తె `దువా` జన్మించిన తర్వాత.. ఇప్పుడు తమ కుటుంబంలోకి రెండవ బిడ్డ రాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. రణ్‌వీర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ``పాప దువా.. మా హృదయాలు మరింత పెద్దవిగా మారుతున్నాయి.. మీ దీవెనలకు ధన్యవాదాలు`` అని పోస్ట్ చేయడంతో ఈ గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో నిమిషాల్లోనే విపరీతంగా వైరల్‌గా మారింది.




సినీ విశ్లేషకులు- అభిమానుల నమ్మకం ప్రకారం.. ఈ జంట జీవితంలోకి బిడ్డల రాక వృత్తిపరంగా కూడా అపారమైన అదృష్టాన్ని తీసుకువస్తోంది. గతంలో కొన్ని వరుస పరాజయాలతో సతమతమైన రణ్‌వీర్ సింగ్‌కు.. కుమార్తె దువా జన్మించిన తర్వాత లక్ బాగా కలసి వచ్చింది. అతడు నటించిన `ధురంధర్` ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తూ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాప రాకతో రణ్‌వీర్ మళ్లీ తిరిగి హిట్ ట్రాక్‌లోకి రావడమే కాకుండా.. తన తదుపరి భారీ ప్రాజెక్ట్ `ప్రళయ్`పై దృష్టి సారించడానికి మంచి ఎనర్జీ లభించింది.




ఈ పాజిటివ్ వైబ్స్ ఇప్పుడు దీపికా పదుకొణే కెరీర్‌కు కూడా ఎంతగానో కలసివస్తాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దీపిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం `రాకా`లో నటిస్తున్నారు. రెండో బిడ్డ రాకతో దక్కబోయే ఆనందం - అదృష్టం వల్ల దీపిక ఖాతాలో `రాకా` రూపంలో మరో బిగ్గెస్ట్ పాన్-ఇండియా విజయం నమోదు కావడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రణ్‌వీర్ నటిస్తున్న `ప్రళయ్` చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రళయం సృష్టించి బంపర్ హిట్ కొడుతుందని అంచనాలు వేస్తున్నారు.




రణ్‌వీర్ సింగ్ షేర్ చేసిన ఈ ఆనందకర పోస్ట్‌పై రంగుల ప్రపంచానికి చెందిన పలువురు అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులు హృదయపూర్వక శుభాకాంక్షలు అందించారు. హాలీవుడ్ నటుడు విన్ డీజెల్, ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్, మీకా సింగ్, సారా అర్జున్, వరుణ్ ధావన్, సూర్యకుమార్ యాదవ్, కాజల్ అగర్వాల్, ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ఎందరో సెలబ్రిటీలు ఈ జంటకు తమ బ్లెస్సింగ్స్ అందించారు. అక్క కాబోతున్న చిన్నారి దువాకు శ్రేయా ఘోషల్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం విశేషం.

ఎల్లప్పుడూ కష్టపడి పనిచేసే ఈ స్టార్ కపుల్ జీవితంలోకి రెండో బిడ్డ రాక ద్వారా వ్యక్తిగతంగానే కాకుండా.. సినిమాల పరంగా కూడా మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియా కామెంట్లలో చిన్నారి దువా అచ్చం తండ్రి రణ్‌వీర్ సింగ్ లాగే ఉందని పోస్టులు పెడుతూ.. ఈ దిష్టి తగలని క్యూట్ ఫ్యామిలీకి అన్ని శుభాలే జరగాలని.. వారి త‌దుప‌రి చిత్రాలు `రాకా`, `ప్రళయ్`లు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాలని కోరుకుంటున్నారు.