Begin typing your search above and press return to search.

నిశ్శబ్దం తిరిగి మాట్లాడగలదు.. ఒక్క వీడియోతో ఆలోచింపజేసిన రణవీర్ - దీపిక!

ఈ నేపథ్యంలోనే ఈ జంట చేసిన ఒక టూరిజం ప్రమోషనల్ యాడ్ అందరినీ ఆకట్టుకుంటుంది.మరి ఇంతకీ రణవీర్ సింగ్ , దీపిక పదుకొనే కలిసి చేసిన ఆ యాడ్ ఏంటంటే...

By:  Madhu Reddy   |   7 Oct 2025 3:43 PM IST
నిశ్శబ్దం తిరిగి మాట్లాడగలదు.. ఒక్క వీడియోతో ఆలోచింపజేసిన రణవీర్ - దీపిక!
X

బాలీవుడ్ సెలబ్రిటీ జంటలలో రణవీర్ సింగ్ , దీపికా పదుకొనేలు కూడా ఒకరు..వీరిద్దరూ చాలా సంవత్సరాలు ప్రేమలో ఉండి 2018లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అలా గత ఏడాది ఈ జంటకు పండంటి ఆడపిల్ల కూడా పుట్టింది. అయితే రణవీర్ సింగ్, దీపిక పదుకొనేలు ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో ఇరుక్కున్నప్పటికి వాటిని పట్టించుకోకుండా తమ కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ జంట చేసిన ఒక టూరిజం ప్రమోషనల్ యాడ్ అందరినీ ఆకట్టుకుంటుంది.మరి ఇంతకీ రణవీర్ సింగ్ , దీపిక పదుకొనే కలిసి చేసిన ఆ యాడ్ ఏంటంటే...

అబుదాబి టూరిజం ప్రమోషనల్ యాడ్.. ఈ యాడ్లో రణర్ సింగ్ ఒక మ్యూజియంలోని కళాఖండాన్ని చూస్తూ అప్పటి చరిత్ర చూసి ఆశ్చర్యపోతాడు.. "ఒకవేళ నా విగ్రహం చేస్తే.. నా భంగిమ ఎలా ఉంటుందో అనే ఆలోచనలో ఉన్నాను" అని అంటే దీపికా పదుకొనే రణవీర్ సింగ్ మాటలపై స్పందిస్తూ.."మీరు ఈ మ్యూజియంలో ఉండడానికి కచ్చితంగా అర్హులు" అంటూ ఆట పట్టిస్తుంది..

దానికి రణవీర్.." మనం వేరేచోట పెరిగితే ఎలా ఉంటామో ఎప్పుడైనా ఆలోచించావా?" అని అంటే.. దీపిక పదుకొనే రణవీర్ సింగ్ ప్రశ్నకి ఆసక్తికర ఆన్సర్ ఇస్తుంది."ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనల్ని ప్రశ్నించని ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి" అంటూ చెప్పుకొస్తుంది. దీపిక మాటలకు రణవీర్ కొన్ని ప్రదేశాల గురించి మాట్లాడుతూ.. "నిశ్శబ్దం తిరిగి మాట్లాడుతున్నట్టు అనిపించడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది" అంటాడు. ఆ తర్వాత "ఇది అబుదాబి.. పాజ్ బటన్ లాంటిది " అంటూ చెప్పడంతో పాటు "మనం ప్రపంచాన్ని చూడడానికి ప్రయాణిస్తాము.. కానీ కొన్నిసార్లు మనలో మనం ప్రయాణిస్తాం" అంటూ దీపిక మాటలతో యాడ్ ముగుస్తుంది.

అయితే ఈ ప్రకటన అన్ని ప్రకటనల లాగా సాధారణంగా కాకుండా ప్రేమ ప్రతిబింబించేలా చూసేవారికి ఓ చిన్న కథలా అనిపిస్తుంది..ప్రస్తుతం రణవీర్ సింగ్ దీపిక పదుకొనే కలిసి చేసిన ఈ ప్రకటన చూసి అభిమానులు చాలా ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రకటనలో దీపిక పదుకొనే హిజాబ్ లుక్ లో కనిపించడంతో చాలామంది ఆమె లుక్ ని మెచ్చుకుంటున్నారు.. అలా అబుదాబి వీధుల్లో చక్కర్లు కొడుతూ వీరు చేసిన ఈ ప్రమోషనల్ యాడ్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.

దీపిక కెరియర్ విషయానికి వస్తే.. మొదట సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ మూవీలో అవకాశాన్ని అందుకొని, ఆ తర్వాత చేజార్చుకుంది.. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898AD సినిమా సీక్వెల్ నుండీ కూడా ఈమెను తప్పించారు. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికయింది. దీంతో పాటు మరో హాలీవుడ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముంబైలో స్టార్ట్ అయినట్లు సమాచారం.