Begin typing your search above and press return to search.

రణ్ వీర్ కాస్ట్ లీయెస్ట్ యాడ్.. చూసిన వాళ్లు మాత్రం..!

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ లేటెస్ట్ గా ఒక క్రేజీ వీడియోతో వచ్చాడు. ఏజెంట్ చింగ్ అంటూ ఒక వాణిజ్య ప్రకటన ట్రైలర్ తో సర్ ప్రైజ్ చేశాడు.

By:  Ramesh Boddu   |   19 Oct 2025 10:52 AM IST
రణ్ వీర్ కాస్ట్ లీయెస్ట్ యాడ్.. చూసిన వాళ్లు మాత్రం..!
X

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ లేటెస్ట్ గా ఒక క్రేజీ వీడియోతో వచ్చాడు. ఏజెంట్ చింగ్ అంటూ ఒక వాణిజ్య ప్రకటన ట్రైలర్ తో సర్ ప్రైజ్ చేశాడు. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాడ్ ఏజెంట్ చింగ్ సీరీస్ లో భాగంగా వస్తుంది. ఈ యాడ్ లో రణ్ వీర్ సింగ్ తో పాటు శ్రీలీల, బాబీ డియోల్ కూడా ఉన్నాడు. ఏజెంట్ చింగ్ యాడ్ ని 150 కోట్ల రూపాయలతో తీశారని టాక్. ఐతే యాడ్ చూస్తే భారీతనం అర్థమవుతుంది కానీ అంత బడ్జెట్ అయిందా అన్నది మాత్రం డౌట్ గానే ఉంది.

రణ్ వీర్ సింగ్ యాక్షన్ స్టంట్స్, శ్రీలీల మెస్మరైజ్ మూమెంట్స్..

రణ్ వీర్ సింగ్ సడెన్ గా ఏజెంట్ చింగ్ ట్రైలర్ తో వస్తే ఇదేదో సినిమా అనుకున్నారు ఆడియన్స్. తీరా చూస్తే అదొక యాడ్ అని అర్ధమైంది. ఐతే రణ్ వీర్ సింగ్ యాక్షన్ స్టంట్స్, శ్రీలీల మెస్మరైజ్ మూమెంట్స్ అన్నీ ఈ యాడ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఐతే ఎంత బాగున్నా ఈ యాడ్ కి 150 కోట్లు ఖర్చు పెట్టారా అని షాక్ అవ్వడం ఆడియన్స్ వంతు అయ్యింది.

ఇక రణ్ వీర్ సింగ్ సినిమాల విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ సింగం ఎగైన్ తో వచ్చాడు రన్ వీర్ సింగ్. ప్రస్తుతం దురంధర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను ఈ ఇయర్ డిసెంబర్ రిలీజ్ లాక్ చేశారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో దురంధర్ రిలీజ్ కాబోతుంది. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ తో పాటుగా సంజయ్ దత్, మాధవన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.

బాలీవుడ్ స్ట్రగులింగ్ స్టార్స్ లో రణ్ వీర్ సింగ్ కూడా..

బాలీవుడ్ స్ట్రగులింగ్ స్టార్స్ లో రణ్ వీర్ సింగ్ కూడా ఉన్నాడు. అతను కూడా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఐతే దురంధర్ అవుట్ పుట్ మీద రణ్ వీర్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడట. సినిమా తప్పకుండా తనకు ఒక మంచి కమర్షియల్ సక్సెస్ ఇస్తుందని ఆశిస్తునాడట. రణ్ వీర్ సింగ్ సినిమాల వేగాన్ని పెంచాలని చూస్తున్నాడు. దురంధర్ రిలీజ్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల విషయంలో ఒక క్లారిటీ వస్తుంది.

ఈమధ్య బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్స్ తో సినిమాలకు రెడీ అవుతున్నారు. ఐతే రణ్ వీర్ కూడా ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు కానీ అది డిస్కషన్ స్టేజ్ లోనే ఆగిపోయింది. మరో సౌత్ డైరెక్టర్ వేటలో ఉన్నాడు రణ్ వీర్ సింగ్.