Begin typing your search above and press return to search.

'ధురంధ‌ర్:ది రివేంజ్' ట్రైల‌ర్‌..తూఫాన్‌..ఆందీ..బీస్ట్‌!

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధురంధ‌ర్`. ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ భారీ స్పై యాక్ష‌న్‌ డ్రామా ప్ర‌పంచ వ్యాప్తంగా చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

By:  Ravindar Gorantla   |   7 March 2026 12:21 PM IST
ధురంధ‌ర్:ది రివేంజ్ ట్రైల‌ర్‌..తూఫాన్‌..ఆందీ..బీస్ట్‌!
X

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధురంధ‌ర్`. ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ భారీ స్పై యాక్ష‌న్‌ డ్రామా ప్ర‌పంచ వ్యాప్తంగా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. గ‌ల్ష్ కంట్రీస్ బ్యాన్ చేసి పాకిస్థాన్‌కు స‌పోర్ట్ చేసినా షాకింగ్ కంటెంట్‌తో `ధురంధ‌ర్‌` వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్ర‌కంప‌ణ‌లు సృష్టించింది. వ‌ర‌ల్డ్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో రూ.1400 కోట్ల‌కుపైనే రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురి చేసింది. ఒక్క ద‌క్షిణాది భాష‌ల్లో డ‌బ్ చేయ‌కుండా ఒక్క హిందీలోనే విడుద‌ల చేసిన సినిమాకు ఈ స్థాయి వ‌సూళ్లు ద‌క్క‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.





దీంతో దీనికి సీక్వెల్‌గా రానున్న `ధురంధ‌ర్ ది రివేంజ్‌`పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మార్చి 19న ఈ మూవీ హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పార్ట్ వ‌న్ సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా జీయో పాలిటిక్స్‌పై ప్ర‌పంచ వ్యాప్తంగా స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల్ని మ‌రింత హైకి చేర్చింది. అంతే కాకుండా టీజ‌ర్‌లో చూపించిన హింసాత్మ‌క స‌న్నివేశాలు, హమ్జాగా ర‌ణ్‌వీర్ సాగించిన స్వైర విహారం సంచ‌ల‌నంగా మారింది.

టీజ‌ర్‌లోనే ఈ రేంజ్‌లో ఉంటే ట్రైల‌ర్ ఇక భీభ‌త్స‌మే ఆనే కామెంట్‌లు వినిపించాయి. ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వ‌చ్చింది. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ట్రైల‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అంటూ అంతా ఎదురు చూస్తున్న ట్రైల‌ర్ ఫైన‌ల్‌గా రిలీజ్ అయింది. కాంద‌హార్ ఫ్లైట్ హైజాక్ సీన్‌తో ట్రైల‌ర్‌ని స్టార్ట్ చేసిన డైరెక్ట‌ర్ ఆదిత్య‌ధ‌ర్ ..హ‌మ్జా రూత్‌లెస్ మ‌ర్డ‌ర్‌ల‌తో కొనసాగించి షాక్ ఇచ్చాడు. ఫ‌స్ట్ పార్ట్‌లో రెహ‌మాన్ డ‌కాయ‌త్‌ని మ‌ర్డ‌ర్ చేసిన త‌రువాత ఆ స్థానాన్ని ఎవ‌రు బ‌ర్తీ చేస్తార‌నే స‌న్నివేశాల‌తో ఎండ్ చేశారు. పార్ట్ 2లో ఆ స్థానాన్ని ర‌ణ్‌వీర్ భ‌ర్తీ చేసి ఇండియాకు వ్య‌తిరేకంగా ప‌ని చేసిన ఒక్కో క్రిమిన‌ల్‌ని అత్యంత దారుణంగా మ‌ర్డ‌ర్ చేస్తూ వెళ్ల‌డం చూపించాడు.

ఇదే అవ‌కాశం కోసం ఎదురుచూసిన హ‌మ్జా తుపాన్‌..ఆందీ..బీస్ట్ త‌ర‌హాలో విరుచుకుప‌డి అత్యంత పాశ‌వికంగా ప్ర‌త్య‌ర్థుల్ని మ‌ర్డ‌ర్ చేస్తూ భీభ‌త్సం సృష్టించ‌డం చూపించాడు. ఇందులోనే అసలు హ‌మ్జా ఎవ‌రు? ఈ ఆప‌రేష‌న్ కోసం ప‌ర్టికులర్‌గా త‌న‌నే ఎందుకు తీసుకున్నారు? అత‌ని నేప‌థ్యం ఏంటీ? అత‌ని కుటుంబాన్ని ఎలా కోల్పోయాడు? త‌న కుటుంబాన్ని త‌న క‌ళ్ల ముందే అత్యంత దారుణంగా హ‌త్య చేసి త‌న‌ని చిత్ర హింస‌ల‌కు గురి చేసిన గ్యాంగ్ ఎవ‌రు? వాళ్ల‌ని హ‌మ్జా ఎంత దారుణంగా హ‌త మార్చాడు? వంటి అంశాల‌ని ట్రైల‌ర్‌లో చూపించారు.

సినిమా కూడా ఇదే త‌ర‌హాలో హార్డ్ కోర్ వైయోలెన్స్‌తో సాగుతుంద‌ని తెలుస్తోంది. ర‌ణ్ వీర్ సింగ్ త‌న విశ్వ‌రూపాన్ని చూపించిన‌ట్టుగా ట్రైల‌ర్ స్ప‌ష్టం చేస్తోంది. మార్చి 19న రిలీజ్ కానున్న ఈ మూవీ పెయిడ్ ప్రీమియ‌ర్స్ మార్చి 18న నిర్వ‌హిస్తున్నారు. ట్రైల‌ర్‌తోలో భీభ‌త్సానికి తెర‌లేపిన `ధురంధ‌ర్ ది రివేంజ్‌` ఇజ్రాయెల్ - ఇరాన్ వార్ వేళ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో.ఎలాంటి సీక్రెట్‌ల‌ని బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌జేస్తుందో వేచి చూడాల్సిందే.