ఒక్క హిట్‌తో మొత్తం చేంజ్..!
బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సాలిడ్ సక్సెస్ దక్కించుకుని చాలా కాలం అయింది.
By: Ramesh Palla | 20 Feb 2026 12:01 PM ISTబాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సాలిడ్ సక్సెస్ దక్కించుకుని చాలా కాలం అయింది. బాలీవుడ్‌లో పరిస్థితులకు తగ్గట్లుగానే రణ్వీర్ సింగ్ కెరీర్ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వచ్చింది. గత నాలుగు ఐదు ఏళ్లలో చెప్పుకోదగ్గ సినిమా అన్నట్లుగా ఏదీ లేదు అనేది ఆయన అభిమానుల మాట. అంతకు ముందు ఆయన చేసిన ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్లు ఉండేది. దాంతో రణ్వీర్ సింగ్ కెరీర్ ఖతం అయినట్లే అని చాలా మంది విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఒకానొక సమయంలో రణబీర్ కపూర్ కి గట్టి పోటీగా రణ్వీర్ సింగ్ నిలుస్తాడు అనుకున్న వారు కాస్త తమ అభిప్రాయం మార్చుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి రణ్వీర్ సింగ్ కి 'ధురంధర్' సినిమా బిగ్ బ్రేక్ ను తెచ్చింది. సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు అందరి దృష్టి రణ్వీర్ సింగ్ పై ఉంది.
ధురంధర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్...
గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధురంధర్ సినిమా కేవలం హిందీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా యావత్ భారతీయ ప్రేక్షకులను మెప్పించింది. అందుకే చాలా స్పీడ్‌గా సీక్వెల్ ను ప్లాన్ చేయడం జరిగింది. విడుదలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ధురంధర్ 2 సినిమా కోసం ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ఇటీవల వచ్చిన టీజర్‌కి దక్కిన రెస్పాన్స్ చూస్తూ అర్థం అవుతోంది. భారీ బ్లాక్‌బస్టర్ గా ధురంధర్ 2 నిలవడం ఖాయం అనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు, ప్రేక్షకులు ఉన్నారు. రణ్వీర్ సింగ్ కి ధురంధర్ 2 మరో విజయాన్ని కట్టబెడుతుంది అనే విశ్వాసం ను అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రణ్వీర్ సింగ్ తదుపరి సినిమాల విషయంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పక్కన పెట్టే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.
రణ్వీర్ సింగ్ ధురంధర్ 2 రిలీజ్ డేట్...
ధురంధర్ సినిమాకు ముందు రణ్వీర్ సింగ్ చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తూ ఉండేవాడు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే కమిట్ అయిన రెండు మూడు సినిమాలను రద్దు చేసుకున్నాడని, అడ్వాన్స్ లు వెనక్కి ఇచ్చే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఓకే చెప్పిన సబ్జెక్ట్‌ల విషయంలో ఇప్పుడు వెనక్కి తగ్గి, కొత్త కథలతో రావాల్సిందిగా దర్శకులకు రణ్వీర్ సింగ్ సూచించాడని కూడా కొందరు అంటున్నారు. మొత్తానికి రణ్వీర్ సింగ్ రాబోయే మూడు సంవత్సరాలకు సంబంధించిన సినిమాల విషయంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అంతే కాకుండా ఆయన కథల ఎంపిక విషయంలో ఇంతకుముందు మాదిరిగా కాకుండా తన పద్ధతి ని పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా తదుపరి రాబోయే సినిమా విషయంలో ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
పాన్ ఇండియా రేంజ్ సినిమాతో రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ ఇంతకు ముందు ఇద్దరు సౌత్ దర్శకులతో వర్క్ చేసేందుకు కమిట్ అయ్యాడు. విభిన్నమైన కాన్సెప్ట్ అంటూ రెండు మూడు సినిమాలను రణ్వీర్ సింగ్ పాన్ ఇండియా రేంజ్ లో చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్‌లతో పని కావడం లేదని గ్రహించి కొత్త సబ్జెక్ట్ ల కోసం వెయిట్ చేస్తున్నాడు. అంతే కాకుండా రణ్వీర్ సింగ్ మరిన్ని స్పై థ్రిల్లర్ సినిమాలను చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఈయన చేసిన లవ్ కమ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లకు మంచి స్పందన వచ్చింది. కానీ అలాంటి సబ్జెక్ట్ లను ప్రస్తుతానికి పక్కన పెట్టే ఆలోచనతో ఉన్నాడు. మొత్తానికి ధురంధర్ సినిమా రణ్వీర్ సింగ్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ధురంధర్ సినిమాకు ముందు, ధురంధర్ సినిమాకు తర్వాత అన్నట్లుగా రణ్వీర్ కెరీర్ మారబోతుందని చెప్పుకోవచ్చు.
