Begin typing your search above and press return to search.

హీరోయిన్‌కి సినిమా స్టైల్‌లో లవ్‌ ప్రపోజల్‌..!

బాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌ అనగానే ముందుగా వినిపించే పేరు రణ్వీర్‌ సింగ్‌, దీపికా పదుకునే.

By:  Ramesh Palla   |   1 Sept 2025 4:00 PM IST
హీరోయిన్‌కి సినిమా స్టైల్‌లో లవ్‌ ప్రపోజల్‌..!
X

బాలీవుడ్‌లో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌ అనగానే ముందుగా వినిపించే పేరు రణ్వీర్‌ సింగ్‌, దీపికా పదుకునే. వీరిద్దరి జోడి చూడముచ్చటగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా వీరికి అభిమానులు ఉంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, షూటింగ్‌ ఇతర కార్యక్రమాలతో ఎప్పుడూ దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నా ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌ అంటూ పేరు సొంతం చేసుకున్న వీరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటారు. వీరి పెళ్లి అయ్యి దాదాపు ఏడు ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ వీరిద్దరు కొత్త జంట, ఇటీవలే పెళ్లి అయిందా అన్నట్లుగా చాలా క్యూట్‌గా ఉంటారు, అంతే కాకుండా వీరిద్దరూ ఎప్పుడూ ఏదో ఒక విషయమై మీడియాలో ఉంటారు.

ప్రేమ కథ చెప్పిన రణ్వీర్‌ సింగ్‌

రణ్వీర్‌ సింగ్‌, దీపికా పదుకునే ప్రేమ వ్యవహారం గురించి ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ఏదో ఒక విషయం గురించి చర్చ జరుగుతోంది. వీరి వివాహం ఎలా జరిగింది, పెళ్లికి ముందు ఎలా ఉండేవారు అంటూ చాలా కథనాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. తాజాగా రణ్వీర్‌ సింగ్‌ తన ప్రేమ విషయాన్ని చెప్పుకొచ్చాడు. స్వయంగా రణ్వీర్‌సింగ్‌ తన ప్రేమ విషయాన్ని వెళ్లడించడంతో వైరల్‌ అవుతోంది. గతంలో వీరిద్దరూ పలు వేదికలపై తమ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి రణ్వీర్‌ సింగ్‌ ఎలా దీపికా పదుకునేను ఒప్పించాను, అసలు ప్రపోజల్‌ ఎలా, ఎక్కడ చేశాడు అనే విషయాల గురించి వెల్లడించారు. సినిమాటిక్ స్థాయిలోనే స్టార్‌ హీరోయిన్‌ అయిన దీపికా పదుకునేకి రణ్వీర్‌ సింగ్‌ లవ్‌ ప్రపోజల్‌ పెట్టాడు, పెళ్లికి సైతం ఆమె ఒప్పుకుందట.

దీపికా పదుకునేతో ప్రేమ వ్యవహారం

ఇటీవల ఒక చిట్‌చాట్‌లో రణ్వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ... దీపికాతో డేటింగ్ నడుస్తున్న సమయంలో ఒకానొక సమయంలో స్నేహితులతో కలిసి మాల్దీవ్స్‌కి వెళ్లాం. అక్కడకు వెళ్లే వరకు దీపికా కి తెలుసు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది తెలియదు. అక్కడకు వెళ్లిన తర్వాత ఒక ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రైవేట్‌ ఐ ల్యాండ్‌కి వెళ్లాం. అక్కడ మేము ఇద్దరం తప్ప మరెవ్వరూ లేరు. ఆ సమయంలో నేను దీపికాకి ప్రేమ విషయాన్ని చెప్పాను, పెళ్లి చేసుకుందాం అని చెప్పాను. అప్పటికే ఇద్దరూ చాలా క్లోజ్‌ అయ్యారు, అవతలి వైపు నుంచి కూడా లైన్‌ క్లీయర్‌గానే ఉందని అర్థం కావడంతో రణ్వీర్‌ సింగ్‌ నుంచి ఆ ప్రపోజల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. రణ్వీర్‌ సింగ్‌ చాలా స్పెషల్‌గా ప్రపోజ్‌ చేయడంతో దీపికా కాదు అనలేక పోయి ఉంటుంది.

అల్లు అర్జున్‌ అట్లీ సినిమాలో దీపికా పదుకునే

దీపికా పదుకునే ను ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడ్డట్లు రణ్వీర్‌ సింగ్‌ సరదాగా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా దీపికా వాళ్ల అమ్మను సైతం కన్విన్స్ చేయడానికి, ఆమెను ఒప్పించేందుకు మరికొంత కాలం నాకు పట్టిందని రణ్వీర్‌ సింగ్‌ అన్నాడు. దాదాపు నాలుగు ఏళ్ల పాటు దీపికా ను ప్రేమించాను అని, చాలా కాలం ఇద్దరం సన్నిహితంగా ఉన్నాం అన్నాడు. అందరి సహకారం, అంగీకారంతో మేము వివాహం చేసుకున్నామని రణ్వీర్‌ సింగ్‌ పేర్కొన్నాడు. 2018లో వీరి వివాహం అత్యంత వైభవంగా ఇటలీలో జరిగిన విషయం తెల్సిందే. గత ఏడాది దీపికా తన కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ బేబీకి దువా పదుకునే సింగ్‌ అని పేరు పెట్టారు. ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న దీపికా త్వరలోనే రీ ఎంట్రీకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ మూవీలో ఈమె ఎంపిక అయింది. త్వరలో మరిన్ని సినిమాలతో దీపికా పూర్వ వైభవం తో దూసుకు పోవడం ఖాయం.