కుమార్తెకే భయపడుతోన్న మామ్!
బాలీవుడ్ సీనియర్ నటి రాణీ ముఖర్జి వృత్తి, వ్యక్తిగత జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది.
By: Srikanth Kontham | 20 Jan 2026 9:00 PM ISTబాలీవుడ్ సీనియర్ నటి రాణీ ముఖర్జి వృత్తి, వ్యక్తిగత జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. వివాహం అనంతరం ఎంతో సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. గ్లామర్ పాత్రలకు దూరమై? వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ నటిగా దిగ్విజయమైన ప్రయాణం సాగిస్తున్నారు. తన జీవితంలోకి కుమార్తె కూడా వచ్చిన తర్వాత మరింత సంతోషంగా కనిపిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కుటుంబ విషయాలను పంచుకున్నారు. `నాన్న రామ్ ముఖర్జీ ఉన్నప్పుడు తన సినిమాలు చేసి ఎలా నటించానో చెప్పేవారు. కానీ ఆయన వెళ్లిపోయాక ఫీడ్ బ్యాక్ కష్టమైందన్నారు.
`కానీ భగవంతుడు కుమార్తె రూపంలో ఆ లోటును కొంత వరకూ తీర్చాడు. నా కూతురు సినిమాలు పెద్దగా చూడదు. అందులోనూ ఏడిచే సన్నివేశాలున్నాయంటే చూసి తట్టుకోలేదు. డాన్సు చేస్తే మాత్రం ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తుందంన్నారు. ''హిచ్కీ', 'తోడా ప్యార్ తో డా మ్యాజిక్' ,'బంటీ ఔర్ బబ్లీ' సినిమాలు ఎక్కువగా చూస్తుంది. 'కుచ్ కుచ్ హోతాహై' మాత్రం చూడదు. ఎందుకంటే ఆ సినిమా మొదటి సన్నివేశంలోనే నేను చనిపోతాను. నేను మ్యాకప్ వేసుకున్నా కూడా తనకు నచ్చదు. మ్యాకప్ తీసిన తర్వాత తను మమ్మీగా ఒప్పుకుంటుంది. అంత వరకూ ఓ పరాయి వ్యక్తిగానే చూస్తుందన్నారు.
ఎంతైనా తను జెన్ ఆల్పా కిడ్. ఒక్కోసారి కోపంతో అరిచేస్తుంది. అప్పుడు తను చెప్పేది నేను వినాల్సిందే. అదే నా చిన్నప్పుడు అయితే మా అమ్మ రెండు దెబ్బలు వేసేది. కానీ ఇప్పుడా పని నా కూతురు విషయంలో నేను చేయలేకపోతున్నాను. ఒకవేళ చేసినా తిరిగి నా మీదే నా కూతురు దాడి చేస్తుంది. అలాగని చెడ్డది కాదు. చాలా మంచి లక్షణాలను కలిగి ఉంది. చెప్పిన పని చెప్పినట్లు చేస్తుంది. ఎంతో క్రమశిక్షణతోనూ ఉంటుందంది.
ఆ విషయంలో నేను తనని చూసి నేర్చుకోవాల్సి ఉంది. అబద్దాలు అస్సలు చెప్పదు. తాను ఏది అనుకుంటే ఆ విషయాన్ని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో తనని చూస్తే నాకే భయం వేస్తోందని తెలిపింది. రాణి ముఖర్జీ-ఆదిత్య చోప్రా 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2015 లో ఓ కుమార్తె జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 11 ఏళ్లు. రాణీ ముఖర్జీ సినిమాల విషయానికి వస్తే? ప్రస్తుతం `మర్దానీ 3` లో నటిస్తోంది. `మర్దానీ` నుంచి రిలీజ్ అయిన రెండు సినిమాలు మంచి విజయం సాధించిన చిత్రాలే.
