అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చా
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ఇండస్ట్రీలో మూడు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పర్సనల్ నోట్ ను షేర్ చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 12 Jan 2026 4:00 PM ISTప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ఇండస్ట్రీలో మూడు దశాబ్ధాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యష్ రాజ్ ఫిల్మ్స్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పర్సనల్ నోట్ ను షేర్ చేశారు. అప్పుడే 30 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మశక్యం కావడం లేదని, యాక్టింగ్ ను డెస్టినేషన్ లాగా అనుకోకపోవడం వల్లే టైమ్ చాలా వేగంగా గడిచిపోయినట్టు అనిపించిందని ఆమె రాసుకొచ్చారు.
సినిమా అంటే గ్లామర్ కాదు
తాను అనుకోకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చానని, మొదటి సినిమా టైమ్ లో ఎంతో భయపడిన ఆమె, తర్వాత బాలీవుడ్ లో ఎంతో పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, ఫస్ట్ సినిమా టైమ్ లో ఉన్న ఎనర్జీ, తడబాటును తాను ఇప్పటికీ ప్రతీ క్యారెక్టర్ లోకి తీసుకెళ్తున్నట్టు తెలిపారు. రాజా కీ ఆయేగీ బారాత్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రాణీ, సినిమా అంటే కేవలం గ్లామర్ కాదని, అదొక బాధ్యత అని మొదటి సినిమాతోనే ఓ అవగాహన కల్పించారు. కెరీర్ స్టార్టింగ్ లోనే ఆత్మ గౌరవం కోసం పోరాడే పాత్రను చేయడంతో తర్వాత ఫ్యూచర్ లో చేసే క్యారెక్టర్లపై అది ప్రభావం చూపిందని ఆమె పేర్కొన్నారు.
ప్రేక్షకులే విధిని నిర్ణయిస్తారు
1990 దశక రోజులు కెరీర్ పరంగానే కాకుండా ఎమోషనల్ గా కూడా తన లైఫ్ లో ట్రాన్ఫర్మేషన్ ను తీసుకొచ్చిందని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ టైమ్ లో వచ్చిన సినిమాలు, బాలీవుడ్ ఆడియన్స్ లైఫ్ లో ఎంతగా పాతుకుపోయాయో అర్థం చేసుకోవడానికి తనకు సహాయపడ్డాయని, ఆడియన్సే మన విధిని డిసైడ్ చేస్తారని, తన జర్నీని గొప్పగా తీర్చిదిద్దినందుకు ఆడియన్స్ కు రాణీ ముఖర్జీ కృతజ్ఞతలు తెలిపారు.
సాథియా తో రాణీ కెరీర్ టర్నింగ్
2000వ దశకం స్టార్టింగ్ లో రాణీ ముఖర్జీ సాథియా అనే సినిమా రాణీ కెరీర్లో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ గా నిలవగా, హమ్ తుమ్ లాంటి మూవీస్ ఆమెలోని కామెడీ యాంగిల్ ను చూపించగా, బ్లాక్ మూవీ తన కెరీర్ లో అత్యంత డిమాండ్ ఉన్న సినిమాల్లో ఒకటిగా నిరూపించబడింది. సంజయ్ లీలా భన్సాలీ, అమితాబ్ లాంటి సినిమాలతో వర్క్ చేయడం వల్ల వారి నుంచి తానెన్నో నేర్చుకున్నట్టు ఆమె చెప్పారు.
పెళ్లి తర్వాతే ఫోకస్ పెరిగింది
పెళ్లి, మాతృత్వం తనను నెమ్మదింపచేయలేదని, ఆ తర్వాత తనకు సినిమాలపై మరింత ఫోకస్ పెరిగిందని, వర్క్ విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉండటం వల్ల తాను అనుకున్న డెసిషన్స్ ను తీసుకోవడానికి సాధ్యమైందని హిచ్కీ మూవీ బలహీనతపై తన అవగాహనను మరింత పెంచిందని చెప్పారు. 2023లో వచ్చిన శ్రీమతి ఛటర్జీ vs నార్వే ఆమెకు నేషనల్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. రాణీ ముఖర్జీ నుంచి ఈ జనవరి 30వ తేదీన మర్దానీ3 రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
