Begin typing your search above and press return to search.

భ‌ర్తకు 10,000 కోట్ల సామ్రాజ్యం.. న‌టికి సొంతంగా 200కోట్ల ఆస్తులు!

కెరీర్‌లో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన సినిమాల్లో న‌టించిన ప్ర‌ముఖ హీరోయిన్ హిందీ చిత్ర‌సీమ‌లో గొప్ప పెర్ఫామ‌ర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

By:  Sivaji Kontham   |   31 Jan 2026 9:41 AM IST
భ‌ర్తకు 10,000 కోట్ల సామ్రాజ్యం.. న‌టికి సొంతంగా 200కోట్ల ఆస్తులు!
X

కెరీర్‌లో ఎన్నో విల‌క్ష‌ణ‌మైన సినిమాల్లో న‌టించిన ప్ర‌ముఖ హీరోయిన్ హిందీ చిత్ర‌సీమ‌లో గొప్ప పెర్ఫామ‌ర్ గా గుర్తింపు తెచ్చుకుంది. క్వీన్ అని పిలుపు అందుకుంది. ప్రముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌ సినిమాల్లో న‌టించేప్పుడే అత‌డితో ప్రేమ‌లో ప‌డింది. ఆ ఇద్ద‌రి ఎఫైర్ గురించి మీడియా కోడై కూసింది. పెళ్ల‌యిన‌వాడితో ఈ కులుకులేంటి? అంటూ చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా చివ‌రికి ఆ ఇద్దరూ ఒక‌ట‌య్యారు. అప్ప‌టికి భార్య‌తో ఉన్న మ‌న‌స్ఫ‌ర్థ‌ల కార‌ణంగా అత‌డు ఈ హీరోయిన్ కి ద‌గ్గ‌ర‌య్యాడ‌ని ప్ర‌చారం ఉంది. ఈ జంట‌కు ఇప్పుడు 10ఏళ్ల వ‌య‌సున్న కుమార్తె (అదీరా చోప్రా) కూడా ఉంది. అప్ప‌టికే పెళ్ల‌యిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ను పెళ్లాడిన ఈ ప్రముఖ న‌టి చాలా అవ‌మానాల‌ను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు 200కోట్ల ఆస్తుల‌ను కూడ‌గ‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

దాదాపు మూడు ద‌శాబ్ధాల సుదీర్ఘ‌మైన సినీప్ర‌స్థానంలో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో అల‌రించిన స‌ద‌రు హీరోయిన్ ఇటీవ‌ల సెకండ్ ఇన్నింగ్స్ లోను త‌న‌దైన ట్రేడ్ మార్క్ న‌ట‌న‌తో మ‌రోసారి ప్ర‌జ‌ల్ని, అభిమానుల‌ను రంజింప‌జేస్తోంది. ఈ న‌టి మ‌రెవ‌రో కాదు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత ఆదిత్యా చోప్రాను పెళ్లాడిన రాణీ ముఖ‌ర్జీ. ప్ర‌స్తుతం రాణీజీ నిక‌ర ఆస్తి విలువ 200 కోట్లు. సెకండ్ ఇన్నింగ్స్ లోను క్వీన్ అద‌ర‌గొట్టేస్తున్నారు. తాను న‌టించే ఒక్కో సినిమాకి ఏకంగా 7 కోట్లు అందుకుంటూ నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన మార్ధానీ 3 కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీసాఫీస‌ర్ గా రాణీజీ ప‌వ‌ర్ ఫుల్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. రాణి ముఖర్జీ పోలీస్ పాత్ర శివాని శివాజీ రాయ్ గా జీవించింద‌ని ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఈ సినిమా 30 జనవరి 2026న థియేటర్లలో విడుదలైంది. ఇందులో త‌న పాత్ర‌ కోసం రూ.7 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రంతో రాణి ముఖర్జీ భారతీయ సినీ పరిశ్రమలో 30 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. రాణీ 1996లో `రాజా కి ఆయేగి బారాత్`తో కెరీర్ ప్రారంభించింది. రాణీ ముఖర్జీ ఒక ఏడాదికి సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా సుమారు రూ.20 కోట్లు సంపాదిస్తున్నారు.

తాజా లెక్క‌ల ప్ర‌కారం.. రాణి ముఖర్జీ నికర ఆస్తి విలువ దాదాపు రూ.200 కోట్లు పైనే ఉంటుందని అంచనా. త‌న‌ విలాసవంతమైన ఆస్తుల వివ‌రాల్లోకి వెళితే.. ముంబైలోని జుహులో సీఫేసింగ్ అపార్ట్‌మెంట్ విలువ సుమారు 20- 30 కోట్ల మ‌ధ్య ఉంటుంద‌ని అంచ‌నా. ఖండాలాలో ఫామ్ హౌస్ విలువ రూ.9 కోట్లు. త‌న కార్ గ్యారేజీలో మెర్సిడెస్ బెంజ్, బీఎండ‌బ్ల్యూ ఉన్నాయి. సుమారు 2.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ కూడా ఉంది.

రాణి ముఖర్జీ త‌న వైవిధ్య‌మైన న‌ట‌న‌తో జ‌న‌హృద‌యాల‌ను గెలుచుకుంటూనే ఉంది. 2025లో `మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే` చిత్రంలో న‌ట‌న‌కు ఉత్త‌మ న‌టిగా జాతీయ‌ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు మ‌ర్ధానీ 3తో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు.

భ‌ర్త ఆదిత్య చోప్రా గురించి...

ఆదిత్యా చోప్రా బాలీవుడ్ లో ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌. భార‌తీయ చిత్ర‌సీమ‌లో ఐదు ద‌శాబ్ధాల సుదీర్ఘ ప్ర‌స్థానం ఉన్న‌ య‌ష్ రాజ్ ఫిలింస్ సంస్థానాన్ని దాదాపు 10,000 కోట్ల నిక‌ర ఆస్తుల రేంజుకు తీసుకెళ్లిన ఘ‌నాపాటి. గొప్ప బిజినెస్‌మేన్. ఆయ‌న కేవ‌లం నాలుగైదు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా అవ‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. కానీ అత‌డు వంద‌లాది విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించారు. అలాంటి వ్య‌క్తిని పెళ్లాడిన మేటి న‌టిగా రాణీ ముఖ‌ర్జీకి ఇప్పుడు సంఘంలో ఒక ప్ర‌ముఖ స్థానం ఉంది. త‌న భ‌ర్త‌కు అపార సంప‌ద‌లు ఉన్నా, త‌న‌కంటూ సొంతంగా ఒక రూ.200 కోట్లు వెన‌కేసుకున్న న‌టిగా ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.