Begin typing your search above and press return to search.

రంగస్థలం.. 7 ఏళ్ల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్..!

రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 2018లో రిలీజైన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ని మాత్రమే కాదు సినీ లవర్స్ ని అలరించింది.

By:  Ramesh Boddu   |   28 July 2025 5:00 PM IST
రంగస్థలం.. 7 ఏళ్ల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్..!
X

రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 2018లో రిలీజైన ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ని మాత్రమే కాదు సినీ లవర్స్ ని అలరించింది. చిట్టి బాబుగా చరణ్ అభినయం అదిరిపోయింది. ఈ సినిమా టైం లో సుకుమార్ కి ఎందుకు రంగస్థలం పాన్ ఇండియా రిలీజ్ ఆలోచన రాలేదో కానీ.. కచ్చితంగా రంగస్థలం పాన్ ఇండియా రిలీజైతే సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉండేది.

సుకుమార్ బాలీవుడ్ మాస్..

ఐతే రంగస్థలం డబ్బింగ్ వెర్షన్ ఆడియన్స్ ని అలరించింది. ఆ సినిమాతోనే సుకుమార్ అంటే ఏంటో హిందీ ఆడియన్స్ కి తెలిసింది. ఇక పుష్ప రెండు భాగాలతో సుకుమార్ తన రేంజ్ ఏంటన్నది చూపించాడు. పుష్ప సినిమాతో సుకుమార్ బాలీవుడ్ మాస్ డైరెక్టర్ ఇమేజ్ దక్కించుకున్నాడు. అతని టేకింగ్, డైరెక్షన్, క్యారెక్టర్స్ అన్ని కూడా బీ టౌన్ ఆడియన్స్ కి బాగా ఎక్కేశాయి.

అందుకే పుష్ప రాజ్ వేషధారణలో మన సౌత్ ఆడియన్స్ కన్నా నార్త్ సైడ్ ఫ్యాన్స్ ట్రెండింగ్ లో ఉన్నారు. ఐతే సుకుమార్ చేసిన రంగస్థలం సినిమా హిందీ వెర్షన్ ఇప్పటివరకు టెలివిజన్ ప్రీమియర్స్ పడలేదు. సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది. అయినా కూడా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు ఆ సినిమా రాలేదు. దాని వెనక రీజన్స్ ఏంటన్నది తెలియదు కానీ ఫైనల్ గా రంగస్థలం సినిమాను బాలీవుడ్ స్మాల్ స్క్రీన్ పై రిలీజ్ చేస్తున్నారు.

బుల్లితెర లోరంగస్థలం..

గోల్డ్ మైన్స్ ఛానెల్ లో రంగస్థలం సినిమా ప్రీమియర్స్ పడనున్నాయి. ఆగష్టు 24 ఆదివారం రంగస్థలం బుల్లితెర లో రిలీజ్ అవుతుంది. హిందీ ఆడియన్స్ కి ఈ సినిమా స్మాల్ స్క్రీన్ టెలికాస్ట్ సూపర్ జోష్ అందిస్తుంది. రాం చరణ్ నటన, సుకుమార్ డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అన్నీ కలిసి రంగస్థలం సినిమాను టాప్ లెవెల్ లో నిలబెట్టాయి.

రంగస్థలం సినిమాతోనే నటుడిగా చరణ్ తన కెపాసిటీ చూపించాడు. ఈ సినిమా అసలైతే ట్రిపుల్ ఆర్ ముందే హిందీ స్మాల్ స్క్రీన్ పై రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్ గా ఆగష్టు థర్డ్ వీక్ టెలికాస్ట్ అవుతుంది. సో నార్త్ సైడ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.