నో చెప్పి అతడి సెకెండ్ ఇన్నింగ్స్ నే మార్చేసిన నటుడు!
బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో చారిత్రక కథాంశాలకు, బయోపిక్‌లకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది.
By: Srikanth Kontham | 24 May 2026 2:00 PM ISTబాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో చారిత్రక కథాంశాలకు, బయోపిక్‌లకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం `ఛావా` రిలీజ్ అనంతరం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి (విలన్) పాత్ర అయిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర లో అక్షయ్ ఖన్నా ఎలాంటి పెర్పార్మెన్స్ ఇచ్చాడో? తెలిసిందే. ఓవైపు షంబాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ విశ్వరూపం చూపిస్తే? అదే రేంజ్ లో కూల్ గా పెరక్పార్మెన్స్ కట్టిపడేసాడు అక్షయ్ కన్నా.
నిజంగా ఈ పాత్ర అతడికి మాత్రమే సూటువుతుందా? అన్నంత గొప్పగా పాత్రలో పరకాయ ప్రవేశంతో ఒదిగిపో యాడు ఖన్నా. అయితే ఈ పాత్ర కోసం మొదట రణదీప్ హుడాను సంప్రదించారు మేకర్స్ . అయితే ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ పాత్రను ఆయన తిరస్కరించడం అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ఈ నిర్ణయం వెనుక గల అసలు కారణాన్ని రణదీప్ హుడా వెల్లడించారు. రణదీప్ హుడా కెరీర్‌లో ఎల్లప్పుడూ వైవిధ్యమైన, సవాలుతో కూడిన పాత్రలను ఎంచుకోవడానికి ఇష్టపడతారు.
`వీర్ సావర్కర్` చిత్రంలో వీర్ సావర్కర్ పాత్ర కోసం ఆయన చేసిన అసాధారణమైన శారీరక మార్పులు, మానసిక శ్రమ అందరికీ తెలిసిందే. ఆ సినిమా పూర్తయిన వెంటనే మరో చారిత్రక చిత్రంలో అది కూడా పూర్తి ప్రతికూల షేడ్స్ ఉన్న ఔరంగజేబు లాంటి తీవ్రమైన పాత్రను చేయడం తనకు సరైనది కాదనిపించిందని రణదీప్ పేర్కొన్నారు. ఒకే తరహా , చారిత్రక పాత్రలకే పరిమితమైపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్‌ను వదులుకున్నట్లు ఆయన వివరించారు. చలనచిత్ర రంగంలో నటుడిగా తన ప్రయాణం కేవలం స్క్రీన్ టైమ్ , పెద్ద ప్రాజెక్టులలో భాగం కావడం కోసం మాత్రమే కాదని రణదీప్ హుడా స్పష్టం చేశారు.
తాను పోషించే పాత్రకు పూర్తి న్యాయం చేయాలంటే? ఆ పాత్ర స్వభావంతో మానసికంగా కనెక్ట్ అవ్వడం ఎంతో అవసరమని నమ్ముతానన్నారు. ఔరంగజేబు పాత్రకు ఎంతో క్రూరత్వం, సంక్లిష్టమైన మానసిక స్థితి అవసరమని, సావర్కర్ సినిమా కోసం పడిన కష్టం తర్వాత అంతటి భారీ నెగెటివ్ పాత్రలోకి తక్షణమే పరకాయ ప్రవేశం చేయడం శారీరక, మానసిక స్థితికి ఇబ్బందికరంగా మారుతుందని భావించి కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చగల మరో అద్భుతమైన నటుడు ఎవరా? అని మేకర్స్ ఆలో చించగా అక్షయ్ ఖన్నా వైపు చిత్రబృందం మొగ్గు చూపింది. విలక్షణమైన నటనతో, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించగల అక్షయ్ ఖన్నా ఈ చిత్రంలో ఔరంగజేబుగా సరికొత్తగా అలరించారు. రణదీప్ వంటి ప్రతిభావంతుడు వదులుకున్న ఈ పాత్రను అక్షయ్ ఖన్నా ఎంతో గొప్పగా పండించాడు. ఓ రకంగా చెప్పాలంటే ఈ పాత్ర తర్వాత అక్షయ్ ఖన్నా సెకెండ్ ఇన్నింగ్స్ మరింత పుంజుకుంది. దీంతో పాటు `ధురంధర్` లో రెహమాన్ డెకాయత్ రోల్ కూడా సక్సెస్ అవ్వడంతో బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయారు.
