Begin typing your search above and press return to search.

భవిష్యత్తు గురించి ఆలోచించలేదేమో.. రణబీర్ పై ట్రోల్స్.. సద్గురు రియాక్షన్!

రాముడిగా రణబీర్ కపూర్ పాత్రకి ప్రాణం పోసినప్పటికీ చాలామంది మాత్రం రణబీర్ కపూర్ పై ట్రోల్స్ చేశారు.

By:  Madhu Reddy   |   30 Oct 2025 1:00 PM IST
భవిష్యత్తు గురించి ఆలోచించలేదేమో.. రణబీర్ పై ట్రోల్స్.. సద్గురు రియాక్షన్!
X

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం నీతేష్ తివారీ డైరెక్షన్లో వస్తున్న రామాయణ మూవీలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రీసెంట్ గా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. అలా వచ్చే ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ పార్ట్-1 కి సంబంధించి ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

రాముడిగా రణబీర్ కపూర్ పాత్రకి ప్రాణం పోసినప్పటికీ చాలామంది మాత్రం రణబీర్ కపూర్ పై ట్రోల్స్ చేశారు. బీఫ్ తినేవాడిని, బోల్డ్ సన్నివేశాల్లో నటించేవాడిని రాముడిగా తీసుకుంటారా అంటూ మండి పడ్డారు.. అంతేకాదు యానిమల్ సినిమాలో నటించిన వెంటనే ఆయన రామాయణ మూవీలో రాముడిగా చేస్తున్నట్టు వార్తలు వినిపించడంతో చాలామంది యానిమల్ మూవీలో రణబీర్ పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటూ ఇలాంటి వాడిని రాముడి పాత్రకి ఎంపిక చేయడం ఏంటి అని విమర్శించారు.

కానీ తాజాగా ఈ విమర్శలపై స్పందించారు ఈషా ఫౌండేషన్ చైర్మన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించారు.. ఆయన తాజాగా రామాయణ మూవీని నిర్మిస్తున్న నమిత్ మల్హోత్రా కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "రాముడిగా రణబీర్ ని తీసుకోవడం పట్ల వచ్చిన విమర్శలను నేను విన్నాను.. రాముడి పాత్ర కోసం రణబీర్ ని తీసుకోవద్దని అనడం చాలా అన్యాయం. ఆయన ఒకప్పుడు ఆ పాత్ర చేశారు.. మళ్లీ ఇప్పుడు రాముడు గా తీసుకోవడం ఏంటి? అని విమర్శించకూడదు.. అయితే ఆయన ఇంతకుముందు నటించిన సినిమాల్లో చేసిన పాత్రలను బట్టి ఇప్పుడు చేసే పాత్రను అంచనా వేయకూదు.. విమర్శించకూడదు. ఎందుకంటే ఆయనకు ముందే తెలియదు కదా రామాయణ మూవీ లో రాముడిగా నటిస్తానని..ఒకవేళ ఇప్పుడు రాముడిగా నటిస్తున్నాడు.. భవిష్యత్తులో వేరే సినిమాలో రావణుడిగా నటిస్తారు కావచ్చు.. అప్పుడు కూడా ఇలాగే విమర్శలు,ట్రోల్స్ చేస్తారా.. ఇలా ట్రోల్స్ చేయడం మంచి పద్ధతి కాదు" అంటూ రామాయణ మూవీలో రాముడి పాత్రలో నటిస్తున్న రణబీర్ కపూర్ ని సమర్ధించారు సద్గురు..

అంతేకాకుండా రావణుడి పాత్రలో నటిస్తున్న యష్ గురించి మాట్లాడుతూ.. "యష్ చాలా తెలివైన,అందమైన వ్యక్తి" అంటూ పొగిడారు. ప్రస్తుతం సద్గురు రణబీర్ కపూర్, యష్ లపై చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రాముడిగా రణబీర్ ఏంటి అని విమర్శించిన వారికి సద్గురు తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారని రణబీర్ కపూర్ ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు..

నితేష్ తివారి డైరెక్షన్లో వస్తున్న రామాయణ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా..సాయిపల్లవి సీతగా నటించగా..యష్ రావణుడిగా.. సన్నీడియోల్ హనుమంతుడిగా.. రకుల్ ప్రీత్ సింగ్ సూర్పనఖగా..వివేక్ ఒబేరాయ్ విభీషణుడిగా.. లారా దత్త కైకేయిగా నటిస్తున్నారు.. 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి నమిత్ మల్హోత్రా నిర్మాతగా చేస్తున్న సంగతి తెలిసిందే..

ఇక రీసెంట్ గా ఈ మూవీలో విభీషణుడి పాత్రలో నటిస్తున్న వివేక్ ఒబేరాయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రామాయణ మూవీ ద్వారా తనకి వచ్చిన రెమ్యూనరేషన్ లో ఒక్క రూపాయి కూడా వాడుకోనని, ఆ రెమ్యూనరేషన్ మొత్తాన్ని క్యాన్సర్ తో బాధపడుతున్న బాధిత పిల్లలకి విరాళంగా ఇచ్చేస్తాను అంటూ ప్రకటించారు.