Begin typing your search above and press return to search.

ఇంద్రుడు, రావణుడి భీకర యుద్ధం.. నెవ్వర్ బిఫోర్ అనేలా!

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని పలువురు నటీనటులు రామాయణ ప్రాజెక్టులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

By:  M Prashanth   |   29 July 2025 12:52 PM IST
ఇంద్రుడు, రావణుడి భీకర యుద్ధం.. నెవ్వర్ బిఫోర్ అనేలా!
X

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రామాయణ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బీటౌన్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి సీతారాములుగా కనిపించనున్నారు. కన్నడ స్టార్ యష్ రావణాసురుడిగా యాక్ట్ చేస్తున్నారు.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని పలువురు నటీనటులు రామాయణ ప్రాజెక్టులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయగా, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు.

ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. రెండో భాగాన్ని పూర్తి చేస్తున్నారని సమాచారం. ఇటీవల మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. వీఎఫ్ ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తెగ ఆకట్టుకున్నాయి. రణబీర్, రావణుడిగా లుక్స్ అదిరిపోయాయి. సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

అదే సమయంలో ఇప్పుడు కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రావణుడు, ఇంద్ర దేవ్ మధ్య యుద్ధం సీక్వెన్స్ వేరే లెవెల్ లో ఉండనుందని ప్రచారం జరుగుతోంది. భూమిపై కాదు, స్వర్గలోకంలో జరిగే యుద్ధం సీన్స్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత దృశ్యపరంగా అద్భుతమైన ఘర్షణలలో ఒకటిగా ఉంటుందని సమాచారం.

కాగా.. రావణాసురుడు, ఇంద్రుడి మధ్య జరిగిన యుద్ధం రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధంలో రావణాసురుడు ఇంద్రుడిని ఓడించి, స్వర్గాన్ని జయించాడు. ఇంద్రుడిని బంధించాడని కూడా పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుడి అహంకారం, స్వర్గాన్ని జయించాలనే కోరిక ఈ యుద్ధానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

అయితే ఇప్పుడు రామయణ మూవీలో ఆ యుద్ధం.. గెలాక్సీని చూపిస్తుందని టాక్ వినిపిస్తోంది. మంచి సినిమాటిక్ థ్రిల్ ను అందిస్తుందని సమాచారం. దర్శకుడు నితేష్ తివారీ రామాయణాన్ని ప్రామాణికతతో చిత్రీకరించడంపై దృష్టి సారించినట్లు కనిపిస్తుంది. అధిక నాణ్యతతో కథ చెప్పాలని ఫిక్స్ అయినట్లు అర్థమవుతుంది.