భారీ మల్టీస్టారర్ మూవీ... ఆ హీరోకు అన్యాయం!
బాలీవుడ్ ప్రేక్షకులు గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'లవ్&వార్' విడుదలకు ముహూర్తం ఖరారు అయిన విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 27 Sept 2026 7:00 PM ISTబాలీవుడ్ ప్రేక్షకులు గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'లవ్&వార్' విడుదలకు ముహూర్తం ఖరారు అయిన విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను 2027, జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి అంతా రెడీ అవుతోంది. ఇప్పటి వరకు సినిమా నుంచి పెద్ద అప్‌డేట్స్ ఇవ్వని సంజయ్ లీలా భన్సాలీ బ్యాక్ టు బ్యాక్ హీరోల, హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లను షేర్ చేయడం జరిగింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌లు హీరోలుగా నటిస్తున్న విషయం తెల్సిందే. వీరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ పోస్టర్స్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఒక హీరోకు హైప్ ఇచ్చి, ఒక హీరోను తగ్గించినట్లుగా ఈ పోస్టర్ ఉన్నాయి అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో...
సోషల్ మీడియాలో మెజార్టీ జనాలు రణబీర్ కపూర్ పోస్టర్ తో సినిమా హైప్ భారీగా పెరిగిందని, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ సినిమా స్థాయిని పెంచడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ కచ్చితంగా రణబీర్ కపూర్‌తో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక మంచి పాత్రను చేయించి ఉంటాడని కపూర్ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇటీవల విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ అంచనాలను మరింత పెంచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రణబీర్ కపూర్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కనిపించనంత స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. రణబీర్ కపూర్ ను మరింత హ్యాండ్సమ్ గా చూపించారు అంటూ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై కపూర్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో విక్కీ కౌశల్ విషయంలో కొందరు చేస్తున్న ట్రోల్స్ చర్చనీయాంశం అవుతున్నాయి.
ఆలియా భట్ లవ్&వార్ సినిమా ఫస్ట్ లుక్...
ఈ భారీ ప్రాజెక్ట్‌లో విక్కీ కౌశల్ కు నటించే స్థాయి లేదు అంటూ కొందరు ట్రోల్స్ చేస్తుంటే, కొందరు మాత్రం విక్కీ ప్రతిభకు కచ్చితంగా ఇది మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుందని, కచ్చితంగా సినిమాలో రణబీర్ కపూర్ ను డామినేట్ చేసే విధంగా విక్కీ కౌశల్ సినిమా ఉంటుందనే విశ్వాసంను ఆయన ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు విక్కీ కౌశల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకాస్త బెటర్‌గా, బెస్ట్ ఔట్ పుట్‌తో విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విక్కీ కౌశల్ కు సినిమాలో అయినా ప్రాధాన్యత ఇవ్వాలని, స్క్రీన్ టైమ్ లో విక్కీ కౌశల్ కు అన్యాయం చేయవద్దని ఆయన అభిమానులు, కొందరు నెటిజన్స్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి విజ్ఞప్తి చేస్తున్నారు.
విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్ పోస్టర్...
ఇప్పటి వరకు లవ్&వార్ అనగానే రణబీర్ కపూర్, ఆలియా భట్ పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిద్దరూ రియల్ జోడీ కనుక కచ్చితంగా బజ్ క్రియేట్ కావడం ఖాయం. అయితే విక్కీ కౌశల్ కు ఇక్కడ పబ్లిసిటీ విషయంలో అన్యాయం జరుగుతుంది అని ఆయన అభిమానులు కొందరు చేస్తున్న వాదన ఏమాత్రం నిజం కాదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వారు భార్య భర్త కావడంతో వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే పాత్రలను అనుసారంగా ఫస్ట్ లుక్ ను డిజైన్ చేసినట్లుగా చెబుతున్నారు. సినిమా విడుదల తర్వాత ఇద్దరి పాత్రల్లో ఏ పాత్రకు ప్రాధాన్యత ఉందో అర్థం అవుతుందని, ముందుగానే ఊహించుకుంటూ సోషల్ మీడియాలో సినిమా గురించి తప్పుడు ప్రచారం చేయవద్దని కొందరు యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థలు ఈ విషయాన్ని బలంగా చర్చిస్తున్న నేపథ్యంలో విడుదల తర్వాత ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
