20ఏళ్ల కెరియర్లో ఆ రికార్డు సృష్టించిన ఏకైక హీరో..
అయితే ప్రస్తుత జనరేషన్ అంతా సోషల్ మీడియాపై నడుస్తున్న తరుణంలో ఈ హీరో మాత్రం సోషల్ మీడియాకి ఆమడ దూరంలో ఉంటారట.
By: Madhu Reddy | 8 Sept 2025 1:00 PM ISTప్రస్తుత కాలంలో ఎవరైనా సరే సోషల్ మీడియాని ఫాలో అవ్వకుండా ఉన్నారా.. అస్సలు ఉండలేరు. ఉదయం నిద్ర నుండి లేస్తే చాలు ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలో బిజీబిజీగా గడుపుతూ ఉంటారు. పని పాట లేని మామూలు జనాలే కాదు బిజీ వర్క్ లో ఉన్న వాళ్ళు కూడా సోషల్ మీడియాని యూజ్ చేయకుండా ఉండలేరు.ఏ విషయం తెలుసుకోవాలన్నా సోషల్ మీడియానే ఆయుధంగా ఎంచుకుంటారు. ఏ విషయాన్ని ప్రచారం చేయాలన్నా సోషల్ మీడియానే ఎంచుకుంటారు.అయితే ప్రస్తుత జనరేషన్ అంతా సోషల్ మీడియాపై నడుస్తున్న తరుణంలో ఈ హీరో మాత్రం సోషల్ మీడియాకి ఆమడ దూరంలో ఉంటారట. ఆయన సోషల్ మీడియా లేకుండానే ఎదుగుతున్న స్టార్ అని చెప్పుకోవచ్చు.
మరి ఇంతకీ ఈ టెక్నాలజీ యుగంలో కూడా సోషల్ మీడియాని దూరం పెడుతున్న ఆ హీరో ఎవరంటే బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్.. అవును.. మీరు వినేది నిజమే.. రణబీర్ కపూర్ సోషల్ మీడియాకి పూర్తి దూరంగా ఉంటారు. ముఖ్యంగా చాలామంది స్టార్ హీరోలు తమ ఎదుగుదల కోసం సోషల్ మీడియాని ఎంచుకుంటారు. కానీ రణబీర్ మాత్రం తన ఎదుగుదలకు సినిమాలు మాత్రమే దోహదపడతాయని నమ్ముతారు.
సాధారణంగా చాలా మంది హీరోలు పీఆర్ స్టంట్స్ చేయిస్తూ.. సోషల్ మీడియా ద్వారా జనాలలోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తారు. అంతేకాదు తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. దీనికి తోడు సినిమా షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి.. విడుదల అయ్యేవరకు ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారానే సినీ ప్రేక్షకులకు చేరవేసే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు దీనికోసం లక్షలు ఖర్చు పెడుతున్న హీరోలు కూడా లేకపోలేదు.. ఇక్కడ ఎవరికీ తెలియని మరొక నిజం ఏమిటంటే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి కూడా డబ్బులు ధారపోస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదనే చెప్పాలి..
అయితే ఇలాంటి వాటన్నింటికీ తాను దూరం అని నిరూపిస్తూ.. తన 20 ఏళ్ల కెరియర్లో అసలు సోషల్ మీడియానే వాడకుండా సొంత కష్టంతో తన సొంత ప్రతిభతో జనాలలో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు రణబీర్ కపూర్. చెప్పినట్టుగా ప్రవర్తించడమే కాకుండా ఎప్పుడైనా సోషల్ మీడియా గురించి, ప్రమోషన్ స్టంట్స్ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే.. "బ్లడీ పీఆర్ స్టంట్స్.. నేను వాటిని అస్సలు నమ్మను..సోషల్ మీడియాని నేను ఆయుధంగా మలుచుకోను. కేవలం నా సినిమాల మీదే నేను ఆధారపడతాను" అంటూ ఆన్సర్ ఇస్తారు. ముఖ్యంగా " నా సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా కేవలం సొంతంగా ప్రమోషన్లు చేసుకోవడం మాత్రమే చేస్తాను.. నా తరఫున నా సినిమాలే మాట్లాడతాయని బలంగా నమ్ముతాను. సినిమాలో కథ, కంటెంట్ బాగుంటే.. ప్రేక్షకుడు థియేటర్ కి వస్తాడు.. ఎవరి సహాయం లేకుండానే ఇండస్ట్రీలో ఎదగవచ్చు అనేదే నేను నమ్ముతాను" అంటూ క్లారిటీ ఇచ్చారు రణబీర్ కపూర్.
రణబీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ ఆయన కెరీర్ ని మరో మెట్టు ఎక్కించింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ చేతిలో రామాయణ మూవీ తో పాటు లవ్ అండ్ వార్, యానిమల్ మూవీ సీక్వెల్ గా వచ్చే యానిమల్ పార్క్, ధూమ్-4 లాంటి సినిమాలు ఉన్నాయి.
