దిగ్గజ డైరెక్టర్ తో మరో కొత్త సినిమాకి సైన్
సంజయ్ లీలా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి బైజు బావ్రా లో రణబీర్ కపూర్ ని హీరోగా పెట్టి తీయాలి అనుకుంటున్నారట.. అంతేకాదు ఈ సినిమాకి రణబీర్ కపూర్ సైన్ చేసినట్టు సమాచారం.
By: Madhu Reddy | 2 Oct 2025 12:00 PM ISTబాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ వరుస సినిమాలతో బీ టౌన్ లో దూసుకుపోతున్నారు. ఈయన చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి.. ఓవైపు నటించిన సినిమాలకు సీక్వెల్స్ చేస్తూనే.. మరోవైపు కొత్త సినిమాలను కూడా ప్రకటిస్తున్నారు. అయితే తాజాగా దిగ్గజ డైరెక్టర్ తో మరో కొత్త సినిమాకి సైన్ చేశారు ఈ హీరో. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. ? ఆ సినిమా స్టోరీ ఏంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రణబీర్ కపూర్..
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ యానిమల్ మూవీ తర్వాత మరిన్ని ప్రాజెక్టులు ఓకే చేస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో నితేష్ తివారితో రామాయణ పార్ట్ 1 లో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కాబోతోంది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో 'లవ్&వార్' మూవీలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ తో పాటు ఆయన సతీమణి అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో విక్కీ కౌశల్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఇదే డైరెక్టర్ తో మరో సినిమాకి కూడా సైన్ చేశారట రణబీర్ కపూర్..
షూటింగ్ అప్పటి నుండే మొదలు..
సంజయ్ లీలా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి బైజు బావ్రా లో రణబీర్ కపూర్ ని హీరోగా పెట్టి తీయాలి అనుకుంటున్నారట.. అంతేకాదు ఈ సినిమాకి రణబీర్ కపూర్ సైన్ చేసినట్టు సమాచారం.లవ్ అండ్ వార్ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతోనే బైజు బావ్రా అనే సినిమా కూడా తెరకెక్కుతుందని బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది.
సంజయ్ లీల భన్సాలీ డ్రీం ప్రాజెక్టు వివరాలు..
బైజు బావ్రా సినిమా విషయానికి వస్తే.. 1955లో వచ్చిన ఈ క్లాసిక్ సినిమాని సంజయ్ లీలా భన్సాలీ రీమేక్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా సంజయ్ లీలా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. దాదాపు 20 ఏళ్లుగా ఈ సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నారట. కానీ కుదరడం లేదు. మొదట ఈ సినిమా తెరకెక్కిద్దాం అనుకున్న సమయంలో హీరోగా రణవీర్ సింగ్ ని అనుకున్నారట. కానీ ఆ తర్వాత ఈ ఐకానిక్ రోల్ కోసం రణబీర్ కపూర్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
వరుస సినిమాలతో బిజీగా మారిన రణబీర్ కపూర్..
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రణబీర్ కపూర్ యానిమల్ మూవీకి సీక్వెల్ గా వచ్చి.. యానిమల్ పార్క్ సినిమాలో వచ్చే ఏడాది జాయిన్ కాబోతున్నారు. అలాగే రామాయణ పార్ట్ -2 లో కూడా నటిస్తున్నారు. అంతేకాకుండా అలియా భట్ తో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమాకి సీక్వెల్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. అలా రణబీర్ కపూర్ ఓవైపు సీక్వెల్స్ చేస్తూనే మరోవైపు కొత్త ప్రాజెక్టులకు కూడా సైన్ చేస్తున్నారు.
