షాకింగ్: తండ్రితో స్టార్ హీరో నిరంతర గొడవలు
అయితే ఇదంతా అందరు తండ్రి కొడుకుల మాదిరిగానే.... అంతకుమించి ఏమీ లేదు. ఆ ఇద్దరి మధ్యా పరస్పర గౌరవం, ప్రేమాప్యాయతలు ఉన్నాయి.
By: Sivaji Kontham | 23 Oct 2025 9:12 AM ISTఅతడు ఇండస్ట్రీని శాసించిన పెద్ద సూపర్‌స్టార్. అయినా ఎదిగి వచ్చిన కొడుకును తీవ్రంగా తిట్టేవాడు. పబ్లిగ్గా అతడి కోపం, అసహనం చూసి అందరూ అవాక్కయ్యేవారు. అలాంటి సందర్భంలో ఆయన కుమారుడు పూర్తిగా తిట్లు భరిస్తూ మౌనంగా ఉండిపోయేవాడు. చాలా సందర్భాల్లో ఆ ఇద్దరి మధ్యా వాగ్వాదాలు జరిగాయి. అన్నిటినీ పరిశ్రమ వ్యక్తులు స్పష్ఠంగా గమనించారు. ప్రముఖ దర్శకులు, ఇండస్ట్రీ కొలీగ్స్ ముందు కూడా ఈ తండ్రి కొడుకులు ఒకరితో ఒకరు ఘర్షణ పడేవారు.
అయితే ఇదంతా అందరు తండ్రి కొడుకుల మాదిరిగానే.... అంతకుమించి ఏమీ లేదు. ఆ ఇద్దరి మధ్యా పరస్పర గౌరవం, ప్రేమాప్యాయతలు ఉన్నాయి. తండ్రి కొడుకుల అనుబంధం ఉంది. కొడుకుపై ప్రేమతోనే ఆ తండ్రి ఆవేదనను వ్యక్తం చేసాడు. తన కొడుకు ది బెస్ట్ గా ఉండాలని ఆ తండ్రి ఎప్పుడూ కోరుకునేవాడు. తన కుమారుడు భారతదేశంలోని అన్ని భాషల ప్రేక్షకులలోకి దూసుకుని వెళ్లాలని దివంగత తండ్రి గారు కోరుకున్నారు. అయితే ఈ కథంతా ఎవరి గురించి? అంటే.... కచ్ఛితంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్... ఆయన తండ్రి రిషీకపూర్ గురించిన విషయమే ఇది.
రిషీజీ పబ్లిగ్గా తనయుడిని తిట్టేసేవాడు. దానికి రణబీర్ చాలా చిన్నబుచ్చుకునేవాడు. అప్పటికి పాపా (డాడీ)తో ఘర్షణ పడకుండా మౌనంగా ఉండేవాడు. తర్వాత తన స్వేచ్ఛాయుత నిర్ణయాలలో తండ్రి అడ్డుపడకూడదని తన తల్లిగారైన నీతూకపూర్ తో చెప్పుకుని బాధపడేవాడట. అయితే ఈ తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ, అనుబంధం గురించి ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ తాను దగ్గరగా గమనించిన విషయాలను తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఆ ఇద్దరి మధ్యా అపారమైన ప్రేమానుబంధాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పరస్పర గౌరవం, ప్రేమాభిమానాలు ఉన్నాయి. కానీ రిషీజీ సాంప్రదాయబద్ధంగా ఉండటాన్ని ఇష్టపడతారు. తన కొడుకు నటించే సినిమాలు కూడా అలాగే ఉండాలని అనుకునేవారు. కానీ రణబీర్ న్యూయార్క్ లో ఫిల్స్ స్టడీస్ పూర్తి చేసి వచ్చాడు. అతడి ధోరణి పూర్తిగా పాశ్చాత్య బాణీలో ఉందని రిషీజీ భావించేవారు.
రిషి సాంప్రదాయ భారతీయ సినిమాను ఇష్టపడతాడు.. రణబీర్ ప్రపంచ స్థాయి ప్రభావాలను స్వీకరిస్తాడు. ఒకరితో ఒకరు ఘర్షణ పడినప్పటికీ ఒకరంటే ఒకరికి అభిమానం.. గౌరవం ఉన్నాయి... రణబీర్, రిషి కపూర్‌లకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సుభాష్ ఘాయ్ వెల్లడించారు. చాలా మంది తండ్రులు, కొడుకుల మాదిరిగానే ఆ ఇద్దరి మధ్యా ఘర్షణలతో కూడిన బంధం కొనసాగింది. రణబీర్ కెరీర్ విషయంలో.. రిషీజీ ఆందోళన కారణంగా ఘర్షణలు పుట్టుకొచ్చాయి. ఆ ఇద్దరి మధ్యా అభిప్రాయ భేధాలు ఎక్కువగా కనిపించాయి.
అయితే దీనికి కారణం.. తరాల అంతరం. రిషీజీ ఇప్పటికీ సాంప్రదాయాలు, మూలాలను నమ్ముతారు. కానీ రణబీర్ పూర్తిగా మోడ్రన్ భావాలు కలిగి ఉన్న యువకుడు. ఇద్దరి మధ్యా వయసు అంతరంతో జనరేషన్ డిఫరెన్సెస్ చాలా ఎక్కువ. అందుకే వారి మధ్య ఘర్షణలు కొనసాగాయి.. అని సుభాష్ ఘయ్ చెప్పుకొచ్చారు. ``వారి మధ్య తరాల అంతరం స్పష్టంగా ఉంది - రిషి సాంప్రదాయ హిందీ సినిమాను ఇష్టపడితే, రణబీర్ ప్రపంచ సినిమాపై తనకున్న అవగాహన ద్వారా ప్రేరణ పొంది మరింత ప్రపంచ శైలి కథ చెప్పే విధానం వైపు మొగ్గు చూపాడు. ఈ దృక్పథంలోని వ్యత్యాసం తరచుగా వారి మధ్య వాగ్వాదాలకు దారి తీసిందని తెలిపారు. రిషీజీ బయటకు కఠినంగా కనిపించినా కానీ, తన కొడుకు పెద్ద స్టార్ అవ్వాలని కలలు కనేవారని వెల్లడించారు.
రణబీర్ న్యూయార్క్ లో ఫిల్మ్ మేకింగ్ చదివి తిరిగి వచ్చాక, తండ్రి, కొడుకుల మధ్య తేడాలు మరింత స్పష్టంగా కనిపించాయి. తన కొడుకు పాశ్చాత్య ధోరని ప్రభావానికి గురయ్యాడని రిషీజీ ఆందోళన చెందారు. అయితే రణబీర్ తన ఎంపికలు ప్రతిభతో పరిశ్రమలో తన జనరేషన్ లో అత్యంత గౌరవనీయమైన స్థానానికి ఎదిగాడని కూడా సుభాష్ జీ గుర్తు చేసారు. రణబీర్ కరీర్ మ్యాటర్ కి వస్తే... ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్, నితీష్ తివారీ దర్శకత్వంలో `రామాయణం -1` చిత్రాల్లో నటిస్తున్నాడు.
