Begin typing your search above and press return to search.

రామాయ‌ణం డే వ‌న్ రికార్డు ఫిక్సైంది..మ‌రి అంత బ‌జ్ ఉందా?

నితీష్ తివారి దర్శకత్వంలో- నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ వర్క్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం`.

By:  Srikanth Kontham   |   14 Oct 2026 6:47 PM IST
రామాయ‌ణం డే వ‌న్ రికార్డు ఫిక్సైంది..మ‌రి అంత బ‌జ్ ఉందా?
X

నితీష్ తివారి దర్శకత్వంలో- నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ వర్క్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `రామాయణం`. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్న పాన్-గ్లోబల్ ప్రాజెక్ట్ పార్ట్-1 బాక్సాఫీస్ టార్గెట్‌లపై ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఏకంగా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డు క్రియేట్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ భారీ నంబర్‌ను సాధించేంత బజ్ ప్రస్తుతం సినిమాపై ఉందా? లేదా? అన్నది ఆస‌క్తిక‌ర అంశం.

ఈ గ్రాండ్ టార్గెట్‌కు ప్రధాన బలం సినిమాకున్న పాన్-ఇండియా & గ్లోబల్ మార్కెటింగ్ వ్యూహం. కేవలం బాలీవుడ్‌పైనే కాకుండా సౌత్ మార్కెట్‌పై కూడా ఈ చిత్రం దృష్టి సారించింది. కన్నడ స్టార్ యశ్, టాలెంటెడ్ నటి సాయి పల్లవిలు నటిస్తుండటంతో సౌత్ లో ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. దీంతో పాటు సోనీ పిక్చర్స్ అంతర్జాతీయంగా వేలాది స్క్రీన్లలో చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ వైడ్ ఐమ్యాక్స్ ..4DX స్క్రీన్‌ల ద్వారా లభించే ప్రీమియం టికెట్ ధరలు మొదటి రోజు కలెక్షన్లు భారీగా నమోదు కావడానికి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు ఈ టార్గెట్‌పై విశ్లేషకుల్లో చాలా సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ సినిమా `ఆదిపురుష్` రామాయణ ఇతిహాసం ఆధారంగానే తెరకెక్కి తీవ్ర విమర్శలు, వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఆ ప్లాప్ ప్రభావం వల్ల ప్రేక్షకులు రామాయణం ఆధారంగా వచ్చే కొత్త సినిమాల విషయంలో కొంత జాగ్రత్తగా.. అనుమానాస్పదంగా ఉండే అవకాశం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ , క్యారెక్టర్ లుక్స్ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా నేటి ఆడియన్స్ సోషల్ మీడియాలో నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేస్తున్నారు.

అలాగే నార్త్ ఇండియాలో రణబీర్ కపూర్.. సౌత్‌లో యశ్, సాయి పల్లవి ఉన్నా? సినిమాకు అసలైన గ్రాండ్ ఓపెనింగ్స్ రావాలంటే గూస్‌బంప్స్ తెప్పించే ప్రమోషనల్ కంటెంట్ అవసరం. స‌రైన ప్ర‌చార చిత్రాలు విడుదలైన తర్వాత మాత్రమే అసలైన మాస్ బజ్ క్రియేట్ అవుతుంది. ప్రమోషన్ల హోరుతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచితే తప్ప మొదటి రోజే 250 కోట్ల బెంచ్‌మార్క్‌ను అందుకోవడం అంత సులభమైన విషయం కాదు.

బాక్సాఫీస్ లెక్కలను పరిశీలిస్తే గతంలో `బాహుబలి 2`, `ఆర్‌ఆర్ఆర్`, `కల్కి 2898 AD` వంటి చిత్రాలు మాత్రమే డే-1న అంతర్జాతీయంగా సంచలన వసూళ్లు సాధించగలిగాయి. హిందీ బెల్ట్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలన్నింటిలోనూ తొలిరోజే హౌస్‌ఫుల్ బోర్డులు పడితేనే రామాయణం ఆ మార్కును ట‌చ్ చేయ‌గ‌ల‌దు. ఈ నేప‌థ్యంలో తొలిరోజు వసూళ్ల టార్గెట్ పెద్దదే అయినా? కంటెంట్ పవర్ - నార్త్-సౌత్ ఆడియన్స్‌ను ఏకం చేసే ప్రచార వ్యూహాలపైనే టార్గెట్ ఆధారపడి ఉంటుందన‌ది కాల‌న‌లేని నిజం.