Begin typing your search above and press return to search.

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

రణ్‌బీర్ కపూర్ మరో పదేళ్ల పాటు నటుడిగా కొనసాగి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో దర్శకత్వంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. తన తొలి దర్శకత్వ చిత్రంలో తాను హీరోగా నటించనని స్పష్టం చేశారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ఇట్స్ ఎ వండర్‌ఫుల్ లైఫ్’ తరహా ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామాలు, స్లైస్ ఆఫ్ లైఫ్ కథలంటే ఇష్టమని వెల్లడించారు. రోజువారీ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ కొత్త సినిమా స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నట్లు చెప్పారు.

By:  Srikanth Kontham   |   7 Nov 2026 1:52 PM IST
నటుడిగా  చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!
X

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ సినీ ప్రయాణంపై తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం వరుస పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న ర‌ణ‌బీర్ క‌పూర్ మ‌రికొన్ని కొన్ని సంవత్సరాల్లో కెరీర్‌కు సంబంధించి ఓ సంచ‌ల‌న నిర్ణయం తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. తాను నటుడిగా కొనసాగేది మరో పదేళ్లు మాత్రమేనని.. ఆ తర్వాత పూర్తిగా దర్శకత్వంపై దృష్టి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

మొదటి నుంచి దర్శకత్వంపై మక్కువ ఉందని తెలిపారు. నటుడిగా షాట్ పూర్తికాగానే తదుపరి సీన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుందని.. కానీ డైరెక్టర్‌గా కథను సృష్టించి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి దృశ్యరూపంలోకి మార్చే అనుభూతే వేరని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం స్వయంగా ఒక స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టినట్లు ర‌ణ‌బీర్ రివీల్ చేసారు. సినిమా రంగానికి సంబంధించిన సీక్వెల్స్ హడావుడి ఎలా ఉన్నా? తాను మాత్రం దర్శకత్వ అడుగును త్వరలోనే వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

`బ్రహ్మాస్త్ర `, `యానిమల్ 2` ,`రామాయణం పార్ట్ 2` వంటి భారీ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన తర్వాత వ‌చ్చే రెండు మూడేళ్ల‌లో ఏళ్లలోపే మొదటి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే తాను తెరకెక్కించే మొదటి చిత్రంలో తానే హీరోగా న‌టించ‌న‌ని స్పష్టం చేశారు. తన డెబ్యూ డైరెక్షనల్ మూవీ ఏ జోనర్‌లో ఉంటుందనే దానిపై క్లారిటీ ఇచ్చారు. `లైఫ్ ఫ్ ఈజ్ బ్యూటిఫుల్`, `ఇట్స్ ఎ వండర్ ఫుల్ లైఫ్` రాజ్‌కుమార్ హిరానీ చిత్రాల వంటి ఫీల్-గుడ్ ఫ్యామిలీ డ్రామాలు లేదా స్లైస్-ఆఫ్-లైఫ్ కథలంటే ఇష్టమని చెప్పారు.

ర‌ణ‌బీర్ మొదటి సినిమా కూడా సరిగ్గా అదే జోనర్‌లో ఉంటుందని ప్రస్తుతం రోజువారీ షూటింగ్ బిజీలో ఉన్నా? రోజులో కొంత సమయం కథా రచనకే కేటాయిస్తున్నానని పేర్కొన్నారు.ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న‌ `రామాయణం2` చిత్రంతో పాటు.. సంజయ్ లీలా భన్సాలీ క్రేజీ ప్రాజెక్ట్ `లవ్ అండ్ వార్` చిత్రంలోనూ రణ్‌బీర్ నటిస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ మధ్యలోనూ కథలు రాసేందుకు సమయం దొరు కుతోందని ర‌ణ‌బీర్ తెలిపారు.

ఏదేమైనా టాలీవుడ్ - బాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రణ్‌బీర్ కపూర్ రాబోయే రోజుల్లో డైరెక్టర్‌గా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో? చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో కూడా కొంత‌మంది హీరోలు కెప్టెన్ కుర్చీ ఎక్కాలని ఆశ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే.