Begin typing your search above and press return to search.

సందీప్ వంగా 'డబుల్' సర్ప్రైజ్? వచ్చేదెప్పుడు?

అయితే స్పిరిట్ మూవీ కంప్లీట్ అవ్వగానే.. ఆయన యానిమల్ పార్క్ ను మొదలుపెట్టనున్నారు. రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన యానిమల్ మూవీకి సీక్వెల్ గా ఆ సినిమా తీయనున్నారు.

By:  M Prashanth   |   27 Jan 2026 8:00 PM IST
సందీప్ వంగా డబుల్ సర్ప్రైజ్? వచ్చేదెప్పుడు?
X

టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు స్పిరిట్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న స్పిరిట్.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు తగ్గ ప్లాన్ తో వంగా.. మూవీని ముందుకు తీసుకెళ్తున్నారని సమాచారం.

అయితే స్పిరిట్ మూవీ కంప్లీట్ అవ్వగానే.. ఆయన యానిమల్ పార్క్ ను మొదలుపెట్టనున్నారు. రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన యానిమల్ మూవీకి సీక్వెల్ గా ఆ సినిమా తీయనున్నారు. నిజానికి.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్.. ఎలాంటి హిట్ అయిందో తెలిసిన విషయమే. బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను సాధించి దూసుకుపోయింది.

ఓవైపు సినిమాపై విమర్శలు వచ్చినా.. మరోవైపు రూ.900 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఫాథర్ అండ్ సన్ ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసింది. మోస్ట్ వైలెంట్ కంటెంట్ తో వచ్చిన ఆ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. యానిమల్ పార్క్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్.. యానిమల్ పార్క్ మూవీ కోసం మాట్లాడారు. ఆ సినిమాలో తాను డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు. ఒక పాత్రలో హీరోగా.. మరో పాత్రలో విలన్ గా నటిస్తున్నట్లు చెప్పారు. దీంతో వంగా డబుల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారన్నమాట!

అదే సమయంలో సందీప్ రెడ్డి వంగా తన ప్లాన్ కు అనుగుణంగా సినిమాను రూపొందించడానికి సమయం తీసుకుంటారని రణబీర్ కపూర్ పేర్కొన్నారు. తనకు డైరెక్టర్ పై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. మొత్తంగా యానిమల్ ఫ్రాంఛైజీ మూడు భాగాలు అని తెలిపారు. రెండో పార్ట్ చిత్రీకరణ వచ్చే ఏడాది మొదలు కానుందని చెప్పారు. అందుకు తగ్గ ప్లాన్ తో సందీప్ ఉన్నారని వెల్లడించారు.

అయితే రణబీర్ కామెంట్స్ ప్రకారం.. యానిమల్ పార్క్ చిత్రీకరణ 2027లో ప్రారంభమైతే.. విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సినిమాను థియేటర్లలో చూడటానికి అభిమానులు 2028 వరకు వేచి ఉండాల్సి రావచ్చు. ప్రీ- ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్- ప్రొడక్షన్, ప్రమోషన్స్ అన్నింటికీ కలిపి కచ్చితంగా సంవత్సరం టైమ్ అవుతుంది. కాబట్టి 2028లో యానిమల్ పార్క్ మూవీ.. ప్రేక్షకుల ముందుకు రానుందనే చెప్పాలి. మరి చూడాలి ఏం జరుగుతుందో..