ఆన్ సెట్స్ లో వాళ్లిద్దరి మధ్య అలాంటిదేం లేదు!
పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి వారిలో రణబీర్ కపూర్- కత్రినా కైఫ్ జోడీ ఒకటి.
By: Srikanth Kontham | 13 Jun 2026 7:00 PM ISTపరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి వారిలో రణబీర్ కపూర్- కత్రినా కైఫ్ జోడీ ఒకటి. ఇద్దరి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన చిత్రం `అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ`. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందనేది బాలీవుడ్‌లో దశాబ్దాలుగా వినిపిస్తున్న టాక్. అయితే ఈ సినిమా సెట్స్‌లో ఇద్దరి ప్రవర్తన ఎలా ఉండేదనే దానిపై తాజాగా ఈ చిత్రంలో నటించిన ఓ సహనటుడు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
షూటింగ్ సమయంలో రణబీర్- కత్రినాల మధ్య ఎలాంటి రొమాన్స్ ..ప్రేమ వాతావరణం తనకు కనిపించలేదన్నారు . సాధారణంగా ప్రేమలో ఉన్న జంటలు సెట్స్‌లో ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడం .. ప్రత్యేకంగా మాట్లాడుకోవడం చూస్తుంటాం. కానీ ఇద్దరి విషయంలో అలాంటిదేమీ జరగలేదని పేర్కొన్నారు. సెట్స్‌లో వారిద్దరూ అత్యంత ప్రొఫెషనల్‌గా ప్రవర్తించేవారన్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఊటీ, గోవా వంటి అందమైన ప్రదేశాలలో జరిగింది. ఆ సమయంలో ఇద్దరు ప్రేమలో ఉన్నారనే అనుమానం సెట్స్‌లో ఉన్న ఎవరికీ రాలేదన్నారు.
ఒకవేళ వారి మధ్య అప్పటికే ప్రేమ చిగురించి ఉంటే దానిని వారు సెట్స్‌లో ఇతరులకు తెలియకుండా చాలా జాగ్రత్తగా దాచగలిగారని అభిప్రాయపడ్డారు. అలాంటి అలజడి కూడా ఏనాడు సెట్స్ లో కనిపిచంలేదున్నారు. షూటింగ్ బ్రేక్ సమయంలో రణబీర్ కపూర్ ఎక్కువగా తోటి నటులతో, ముఖ్యంగా ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి కబుర్లు చెప్పేవారు. కత్రినా కైఫ్ సీన్లు ముగియగానే వ్యక్తిగత సిబ్బందితో లేదా మేకప్ రూమ్‌కే పరిమితమయ్యేవారు. కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే వారిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కనిపించేదని కానీ కెమెరా వెనుక మాత్రం వారు కేవలం ప్రొఫెషనల్ నటీనటులుగానే మెలిగేవారని సహనటుడు గుర్తుచేసుకున్నారు.
సినిమాలో `ప్రేమ్`, `జెన్నీ` పాత్రలలో వారు పండించిన అమాయకత్వం, ప్రేమ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కానీ నిజ జీవితంలో వారి ప్రవర్తన మాత్రం దానికి భిన్నంగా ఉండని సహనటుడి వివరణతో క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత కాలంలో రణబీర్, కత్రినా చాలా సంవత్సరాల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే విషయం బహిరంగ రహస్యమే. `రాజనీతి`, `జగ్గా జాసూస్` వంటి చిత్రాలలో కూడా ఈ జోడీ కలిసి నటించి మెప్పించింది. ప్రస్తుతం ఇద్దరు వ్యక్తిగత జీవితాల్లో ముందుకు సాగిపోతున్నారు. కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ని వివాహం చేసుకోగా..రణబీర్ కపూర్ అలియాభట్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. క్యాట్-రణబీర్ మధ్య పప్రేమ ఉన్నా? అది వివాహం వరకూ దారి తీయలేదన్నది క్లియర్.
