మేనేజర్ లేకుండా మ్యానేజ్ చేస్తోన్న స్టార్ హీరో!
సాధారణంగా బాలీవుడ్ స్టార్ హీరో అనగానే సెట్స్‌లో భారీ కాన్వాయ్, పర్సనల్ అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డులు ఇలా ప్రత్యేక మేనేజర్ టీమ్ కళ్ల ముందు కనిపిస్తుంది.
By: Srikanth Kontham | 2 July 2026 7:33 PM ISTసాధారణంగా బాలీవుడ్ స్టార్ హీరో అనగానే సెట్స్‌లో భారీ కాన్వాయ్, పర్సనల్ అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డులు ఇలా ప్రత్యేక మేనేజర్ టీమ్ కళ్ల ముందు కనిపిస్తుంది. కానీ ఈ విషయంలో రణబీర్ కపూర్ అందరి కంటే భిన్నంగా కనిపిస్తారని తెలుస్తోంది. ఎంతటి భారీ ప్రాజెక్టులో నటిస్తున్నా? షూటింగ్ సెట్స్‌లో ఆయన ప్రవర్తన అత్యంత సరళంగా ఉంటుంది. ఎలాంటి హంగామా.. మేనేజర్ల పర్యవేక్షణ లేకుండా తన పని తాను చేసుకుపోవడం రణబీర్ ప్రత్యేకత. ఈ వినమ్రత రణబీర్ ను నటుడిగానే కాకుండా, తోటి టెక్నీషియన్లు గౌరవించే గొప్ప సహ చరుడిగా నిలబెడుతోంది.
రణబీర్ కపూర్ సెట్స్‌లో ఎంత సింపుల్‌గా ఉంటారంటే? చాలామందికి ఆయన స్టార్ హీరో అని కూడా గుర్తుండదు. మేనేజర్ల అండ లేకుండా తన షూటింగ్ షెడ్యూల్స్, క్యారెక్టర్ డీటెయిల్స్ అన్నీ ఆయనే స్వయంగా చూసుకుం టారని సమాచారం. సెట్‌లో ఉన్న చిన్న టెక్నీషియన్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు అందరితో రణబీర్ కలిసిపో తారుట. ఈగో లేని రణబీర్ ప్రవర్తన పని పట్ల చూపే నిబద్ధత అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. స్టార్‌డమ్ ఇచ్చే అహంకారం ఏమాత్రం లేకపోవడం వల్లే రణబీర్ అందరికీ ఇష్టమైన నటుడిగా మారుతున్నారు.
ఇక రణబీర్ గురించి వినిపించే మరో ఆసక్తికరమైన విషయం.. సెట్స్‌లో తోటి వారికి ఆయన చూపే ఆత్మీయత. ఇంటి నుండి ఏవైనా తినుబండారాలు .. స్పెషల్ ఫుడ్ తెచ్చుకుంటే వాటిని తనతోనే ఉంచుకోకుండా అందరికీ స్వయంగా పంచుతుంటారట. ఒక స్టార్ హీరోగా ఇలాంటి పనులు చేయడం చాలా అరుదు. ఒకే పళ్ళెంలో అందరితో కలిసి భోజనం చేయడం ..తోటి సహనటులకు స్వయంగా ఆహారాన్ని అందించడం వంటి చర్యలు రణబీర్లో ఉన్న మంచి మనిషిని ఆవిష్కరిస్తున్నాయి.
సినిమా షూటింగ్ అంటేనే ఎంతో ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. అలాంటి చోట హీరోగా ఉండి కూడా, తన చుట్టూ ఉన్న వారిని తన కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం రణబీర్ వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. ఎవరి అసిస్టెన్స్ అవసరం లేకుండా తన పనులు తానే చేసుకునే స్వతంత్రత రణబీర్ ను సెట్‌లో మరింత స్వేచ్ఛగా ఉంచు తుంది. ఒక స్టార్ హీరో సెట్స్‌కు రాగానే మేనేజర్లు, పి.ఆర్ టీమ్ హడావిడి చేయడం కనిపిస్తుంది. కానీ రణబీర్ విషయంలో అలాంటిది ఉండదు. ఇది దర్శకులకు, నిర్మాతలకి కూడా ఎంతో ఊరటనిచ్చే విషయం.
ప్రస్తుత తరం నటులకు రణబీర్ కపూర్ ప్రవర్తన ఒక పాఠం లాంటిది. కెరీర్‌లో ఎంతటి స్థాయికి ఎదిగినా? ఒదిగి ఉండటం అనేది ఆయన నుండి నేర్చుకోవాల్సిన గొప్ప గుణం. మేనేజర్ల అవసరం లేకుండానే తన పనులన్నీ చక్కబెట్టుకుంటూ అందరితో ఆత్మీయంగా మెలగడం వెనుక.. ఆయనకు ఉన్న పరిణతి, మనుషుల పట్ల రణబీర్ కు ఉన్న గౌరవం కనిపిస్తున్నాయి. కెమెరా ముందు ఎలా నటించాలో? ఎంత ముఖ్యమో కెమెరా వెనుక ఎలా ఉండాలో రణబీర్ కపూర్ నిరూపిస్తున్నారు.
స్టార్ హీరోలు అంటే తెరపై మెరిసే తారలు మాత్రమే కాదు. బయట ప్రపంచంలో కూడా తమ సరళతతో ఆకట్టుకునే వ్యక్తులని రణబీర్ కపూర్ నిరూపించారు. మేనేజర్ల పర్యవేక్షణ లేకపోయినా? అందరి మనసు గెలుచుకుంటూ ముం దుకు సాగుతున్న ఆయన ప్రయాణం ఆదర్శప్రాయం. ఇలాంటి సింపుల్ స్టార్‌డమ్ ఉన్నప్పుడే ఒక నటుడు ప్రేక్షకులకు, తోటి వారికి శాశ్వతంగా గుర్తుండిపోతారు అన్నది కాదనలేని నిజం.
