Begin typing your search above and press return to search.

సరైన సమయంలో స్టార్‌ హీరో గొప్ప నిర్ణయం

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్ ప్రస్తుతం అతి పెద్ద ప్రాజెక్ట్‌ రామాయణ చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   9 Sept 2025 1:00 AM IST
సరైన సమయంలో స్టార్‌ హీరో గొప్ప నిర్ణయం
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్ ప్రస్తుతం అతి పెద్ద ప్రాజెక్ట్‌ రామాయణ చేస్తున్న విషయం తెల్సిందే. యానిమల్‌ సినిమాలో అత్యంత క్రూరమైన పాత్రలో కనిపించిన రణబీర్‌ కపూర్‌ ఇప్పుడు రామాయణ సినిమాలో రాముడి పాత్రలో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయింది. వచ్చే ఏడాది దీపావళికి సినిమా విడుదల చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రణబీర్‌ కపూర్‌ హీరోగా మరో వైపు మరిన్ని సినిమాలు సైతం రూపొందుతూ ఉన్నాయి. గతంలో మాదిరిగా కాకుండా రణబీర్‌ కపూర్‌ ఇప్పుడు ఇంటికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. భార్య, పాప వద్ద సమయం ఎక్కువ గడపడం కోసం రణబీర్‌ కపూర్‌ తన షూటింగ్‌ సమయంను సైతం తగ్గించుకున్నాడు అంటూ బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఫ్యామిలీ కోసం అది తప్పనిసరి అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రణబీర్ కపూర్‌కి బ్యాడ్‌ బాయ్‌ ట్యాగ్‌

రణబీర్‌ కపూర్‌కి మరో పేరు బ్యాడ్‌ బాయ్‌ అని కూడా ఉంది అనే విషయం తెల్సిందే. ఒకప్పుడు అంటే పెళ్లికి ముందు వరకు రణబీర్‌ కపూర్‌ ఎప్పుడు ఏ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నాడో అర్థం కావడం లేదు అంటూ చాలా మంది మాట్లాడుతూ ఉండేవారు. అందుకే ఆయన్ను లవర్‌ బాయ్‌, ప్లే బాయ్‌, బ్యాడ్‌ బాయ్‌ అంటూ పిలిచేవారు. కానీ ఎప్పుడైతే రణబీర్‌ కపూర్‌ కొత్త జీవితంలో అడుగు పెట్టాడో, కొత్తగా తన జీవితంలోకి అమ్మాయి వచ్చిందో అప్పటి నుంచి చాలా పద్దతిగా ఉంటున్నాడు అంటూ చాలా మంది బాలీవుడ్‌ మీడియా వారు మాట్లాడుతూ ఉంటారు. అంతకు ముందు రెగ్యులర్‌గా పార్టీలు, పబ్‌లు అంటూ తిరగడం అప్పటి మీడియా వారు చూసే ఉంటారు. కానీ ఇప్పుడు రణబీర్‌ కపూర్‌ చాలా సౌమ్యంగా మారడం, తన చెడు అలవాట్లు అన్నింటిని వదిలేయడం చాలా గొప్ప నిర్ణయం అని ఆయన సన్నిహితులు అంటున్నారు.

రహా కోసం రణబీర్‌ కపూర్‌

ఇటీవల రణబీర్‌ కపూర్‌ కూతురు రహా కపూర్‌ పెరిగి పెద్దది అవుతుంది. ఈ సమయంలో ఆమెతో రణబీర్‌ కపూర్‌ ఎక్కువ సమయం కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో అతడు మందు, సిగరెట్‌ పూర్తిగా మానేశాడట. తన కూతురు ఆరోగ్యం విషయంతో పాటు, పలు కారణాల వల్ల రణబీర్‌ కపూర్‌ చెడు అలవాట్లకు పూర్తి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీలు సిగరెట్‌, తాగుడు మానేయడం అంత ఈజీ విషయం కాదు. కానీ రణబీర్‌ కపూర్‌ మాత్రం చాలా ఈజీగానే తన చెడు అలవాట్లను పోగొట్టుకున్నాడు అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ సందర్భంగా రణబీర్‌ కపూర్‌ ను అభినందిస్తూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రామాయణ సినిమా చేస్తున్న కారణంగానూ వాటిని మానేయడం మంచి అభిప్రాయం.

ఆలియా, రణబీర్‌ కపూర్‌ల రహా

ఆలియాతో వివాహం జరిగిన తర్వాత రణబీర్‌ కపూర్‌ హీరోగా చాలా సినిమాలు చేశారు, ఆలియా సైతం చాలా సినిమాలు చేసింది. కానీ వీరిద్దరి కాంబో సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. వీరిద్దరు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే చేతితో పనిలో పనిగా రణబీర్‌ కపూర్‌ కూతురు రహా కపూర్‌ ను కూడా ఇండస్ట్రీలో బాల నటిగా పరిచయం చేయాలి, ఆ తర్వాత హీరోయిన్‌గానూ రహా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రణబీర్ కపూర్‌ రాముడి పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతుంది. యశ్‌ రావణాసురుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన రామాయణ కాన్సెప్ట్‌ సినిమాలతో పోల్చితే ఈ సినిమా చాలా బెస్ట్‌ ఉండే అభిప్రాయం ఉందని అంటున్నారు.