ఫేక్ ఇన్‌స్టాతో మోసం చేసిన హీరో
సోషల్ మీడియాల్లో ఇబ్బడిముబ్బడిగా సెలబ్రిటీల ఫేక్ ఖాతాలు తెరిచేవారికి కొదవేమీ లేదు.
By: Sivaji Kontham | 15 Nov 2025 11:56 AM ISTసోషల్ మీడియాల్లో ఇబ్బడిముబ్బడిగా సెలబ్రిటీల ఫేక్ ఖాతాలు తెరిచేవారికి కొదవేమీ లేదు. తమ ఫేవరెట్ స్టార్స్ ఫోటోలు వీడియోలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేస్తూ, భారీగా అనుచరులను సంపాదిస్తారు ఇలాంటి వేదికలపై. అయితే ఇవన్నీ ఫేక్ అని తెలిసిన తర్వాత ఆసక్తి తగ్గుతుంది.
అయితే ఇన్ స్టాగ్రమ్‌లో ఫేక్ ఖాతాలు తెరిచి అసలు ప్రజలు ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవాలని సెలబ్రిటీలు అనుకుంటే, అలాంటి ఒక ప్రయత్నం చేసాడు రణబీర్ కపూర్. అతడు తన పేరుతో అధికారికంగా ఇన్ స్టాలో అడుగుపెడితే ఉండే అలజడి ఎలా ఉంటుందో ఊహించలేనిది. అందుకే తన ఐడెంటిటీని దాచిపెట్టి, ఒక ఫేక్ ఖాతాను సృష్టించాడట. అక్కడ ప్రజలు ఎలా ఉంటారో, తన అనుచరులు ఎలా వ్యవహరిస్తున్నారో చూసానని తెలిపాడు.
అంతేకాదు.. దీనిని ఫన్ స్టా అని పిలుస్తారని కూడా నికిలీ ఖాతా గురించి చెప్పాడు. ఫిన్ స్టాను అతడు కంటెంట్‌ను బ్రౌజ్ చేయడానికి.. తనకు స్ఫూర్తిదాయకంగా అనిపించే వ్యక్తులను అనుసరించడానికి ఉపయోగిస్తాడు.
అయితే ఈ దాపరికం దేనికి ? అని ప్రశ్నిస్తే దానికి అతడి వద్ద సమాధానం స్పష్ఠంగా ఉంది. బయట మనల్ని ప్రేరేపించగలిగే అద్భుత వ్యక్తులున్నారు. కాబట్టి నేను వారిని అనుసరించాలనుకుంటున్నాను. కానీ నేను నటుడిని కాబట్టి అధికారికంగా ఇన్‌స్టాలో ఉండాలని అనుకోలేదు. ఒకవేళ అలా చేస్తే నా నిజమైన ఐడెంటిటీని వారికి ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. నటన-సినిమాలే నా ఐడెంటిటీ... అది చాలు నేనేమిటో చూపించుకోవడానికి! అని కూడా అన్నారు.
అయితే తనను అనుసరించడానికి నాకు కూడా అనుమతి లేదు! అంటూ తన చెంతనే ఉన్న ఆలియా భట్ సరదాగా వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆలియా ఆ ఫేక్ మేన్ ని అనుసరిస్తే, అతడు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలో పెరుగుతుంది. పైగా రణబీర్ ఎవరెవరిని అనుసరిస్తాడో, ఎవరికి రెస్పాండ్ అవుతాడో ప్రతిదీ ఓపెనైపోతుంది. ఆలియా ప్రస్తుతం ఆల్ఫా లో నటిస్తూ బిజీగా ఉంది. రణబీర్ వరుసగా రామాయణం పార్ట్ 1లో నటిస్తున్నాడు. యానిమల్ 2లోను నటించాల్సి ఉంది.
